కరీంనగర్

కేంద్ర నిధులతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఫిబ్రవరి 10: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం బిజెపి మున్సిపాల్ (పట్టణ) కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పేదలకు రూపాయికి కిలో బియ్యాన్ని కేంద్రప్రభుత్వ నిధులతోనే ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమపథకాలలో కేంద్ర ప్రభుత్వం అధిక శాతం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు సైతం కేంద్రం నుండి నిధులు మంజూరవుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో రహదారులు, రైతుల రుణమాఫి, అంగన్‌వాడి కేంద్రాలను తెరాస ప్రభుత్వమే అందిస్తున్నట్లు చెప్పుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తున్నట్లు తెలుపడంలేదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులను నమ్ముకొని ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందన్నారు. భూగర్బజలాలు ఎండిపోయే విధంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో బిజెపిపార్టీని బలోపేతం చేసి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పట్టణంలోని 18వార్డులలో బూతు కమిటీ వేసుకొని బూత్‌లెవల్ నుండి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామాలలోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. జిల్లా అధ్యక్షులు కాశిపేట లిం గయ్య, మీసా అర్జున్‌రావు, పుట్ట మొండయ్య, పిన్నింటి రాజు, పల్లె సదానందం, ఆదికేశవరావు, తొడుపునూరి క్రిష్ణమూర్తి, ఎల్లంపల్లి శ్రీనివాస్, యాంసాని వేణు, క్రాంతికుమార్, శ్రీనివాస్, వౌటం నర్సింగం, జిల్లా కార్యదర్శి చిలువేరి ఓదెలు, రాంరెడ్డిపాల్గొన్నారు.

ఇదేనా బంగారు తెలంగాణ?
* పంచాయతీ రాజ్ వ్యవస్థ అస్తవ్యస్తం
* ప్రభుత్వంపై డిసిసి అధికార ప్రతినిధి రత్నాకర్ ఫైర్

కరీంనగర్, ఫిబ్రవరి 10: బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి న టిఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నదని డిసిసి అధికార ప్రతినిధి ఒంటెల రత్నాకర్ మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీ చైర్‌పర్సన్‌తోపా టు జడ్పీటిసిలు, సర్పంచులు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొత్తుకుంటున్నా... ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయకపోవడం అత్యంత బాధాకరమన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచుల నుంచి జడ్పీటిసిల వరకు నిధులు కోసం వీధులకెక్కుతు న్నా, నిధులను విడుదల చేయని ప్రభుత్వం బంగారు తెలంగాణ ఏలా తెస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ మానస పుత్రికలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు మాత్రం నిధులు వెల్లువలా విడుదల అవుతున్నాయని ఆరోపించారు. మిషన్ కాకతీయ పనులు చేస్తున్న టిఆర్‌ఎస్ కార్యకర్తలకు ఆగమేఘాల మీద బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై ఉన్న ప్రత్యేక దృష్టి... పంచాయతీ రాజ్, విద్యా, వైద్య శాఖలపై లేదని ఆరోపించారు. రాబోయే రోజు ల్లో ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని రత్నాకర్ అన్నారు. సమావేశంలో నాయకులు మాదాసు శ్రీనివాస్, కటకం వెంకటరమణ, ఎలగందుల మల్లేశం, పొన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

యువత చేతిలోనే దేశ భవిష్యత్
* లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 10: యువత చేతిలోనే దేశ భవిష్యత్ దాగుందని లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్-2 మండలం చింతకుంట గ్రామంలో శ్రీచైతన్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవాపథక శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. ముందుగా విద్యార్థులు గ్రామంలో ప్రజలను చైతన్య పర్చడానికి, ప్రభుత్వం అందచేస్తున్న పలు పథకాలపై ప్రచారం చేయగా ఆయన అభినందించారు. అనంతరం వాలంటీర్లతో మాట్లాడారు. ధైర్యమైన యువత ద్వారా సమాజం సన్మార్గంలో నడుస్తుందని చెప్పారు. కళాశాల డైరెక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, ఎన్‌ఎస్ ఎస్ అధికారి లక్ష్మణ్, వాలంటీర్లు, యోగాచార్యులు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కొత్తగట్టు గుట్టను
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

* రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి
శంకరపట్నం, ఫిబ్రవరి 10: కొత్తగట్టు గుట్టపై వెలసిన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. శుక్రవారం మత్స్యగిరీంద్ర స్వామి జాతర ఉత్సవాలకు పెద్దిరెడ్డితో పాటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పార్టీల అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లారెడ్డి, మధూకర్, సర్పంచ్ తిరుపతి, తనుకు నారాయణ, ఆలయ కమిటి తాత్కాలిక అధ్యక్షుడు మొక్కిరాల కిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.