కరీంనగర్

‘మానసిక వికలాంగుల’ పాఠశాల బాధ్యత నాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, ఫిబ్రవరి 11: కరీంనగర్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల పాఠశాల, వృత్తి శిక్షణ కేంద్రం నుంచి ఇక కరపత్రాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, నేటి నుంచి పాఠశాల బాధ్యత అంతా తనదేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం పాఠశాల రజతోత్సవ వేడుకల ము గింపులో భాగంగా పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ముందుగా మంత్రి , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, తానిపర్తి భానుప్రసాదరావు కరీంనగర్ సిపి విబి కమలాకర్‌రెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన కి.శే.శ్రీ కె.వి.నర్సింగరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వల చేసి ప్రారంభించారు. ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ 25సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పాఠశా ల అనేక వ్యయప్రయాసాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందన్నారు. ఇందులో పని చేస్తున్న వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చి అప్పు చేసి నడిపామన్నారు. 3 సంవత్సరాలుగా కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా రావడం లేదన్నారు. కొంత మంది దాతల నుండి డాక్టర్ ప్రసాద్ అనే అతను ఈ విషయం చెబితే వెంటనే రమ్మని 5లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీలు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు నిధుల నుండి రూ. పది లక్షల చొప్పు న పాఠశాలకు ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాతంగి స్వరూప, ఎంపిపి బూడిద ప్రేమలత, జడ్పిటిసి ఉల్లెంగుల పద్మ, వైస్ ఎంపిపి భూలక్ష్మి, ప్రభాకర్, మేనేజింగ్ ట్రస్టీ బి.వెంకటయ్య, ట్రస్టు సభ్యులు జువ్వాడి మధుసూధన్‌రావు, పడాల చంద్రయ్య, గొడ్డె భూపతి, గుర్రం కొమిరెల్లారెడ్డి, మధుసూదర్ రావు, జనార్థన్‌రావు, డాక్టర్ నగేశ్, గాజుల భగవాన్ పాల్గొన్నారు.
అర్హులకే డబుల్ బెడ్ రూమ్స్
హుజూరాబాద్, ఫిబ్రవరి 11: హుజూరాబాద్ పట్టణంతోపాటు మం డలంలో త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలో ని సాయి రూప గార్డెన్‌లో అధికారు లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన అభివృద్ధి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మండలానికి మొత్తం వె య్యి ఇళ్లు కేటాయిస్తున్నామని, అధికారులు వెంటనే గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపికచేయాలని ఆదేశిం చా రు. ఇప్పటికే జమ్మికుంట, పరకాలతోపాటు వీణవంక, జమ్మికుంట- కమలాపూర్ రోడ్లు ఫోర్‌లైన్స్ రోడ్లుగా మార్చే పనులు జరుగుతున్నాయన్నారు.
నాయకులు,
కార్యకర్తలకు మంత్రి క్లాస్
సమావేశంలో మంత్రి కార్యకర్తలకు చురకలంటించారు. కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదని, కొందరు నాయకులు, కార్యకర్తలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటివన్నీ తన దృష్టికి వస్తున్నాయని, వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
బీడు భూములను
సాగునీటితో తడుపుతాం
కొడిమ్యాల, ఫిబ్రవరి 11: ప్రతి బీడు భూమిని సాగునీటితో తడుపుతామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మండలంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు గాను విచ్చేసి మాట్లాడారు. వచ్చేనెలలో డబుల్ బెడ్ రూంలకు పునాది వేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ కొడిమ్యాలలోని మైసమ్మ చెరువు పంపుహౌజ్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయుటకు మంత్రులు ఈటల, హరీష్‌రావు చొరవచూపితే పోతారం చెరువు నింపడం ద్వారా చొప్పదండి నియోజ క వర్గ ప్రజలు గోదావరి జిల్లాల కన్నా... అధిక పంటలు పండిస్తారని తెలిపారు. ఎంపిపి స్వర్ణలత మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలిక వసతి గృహం, చెరువుల నిర్మాణం పూర్తి చేసినట్లైతే ప్రజ లకు మేలు చేసినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి పునుగోటి ప్రశాంతి, ఎఎంసి చైర్మన్ చింతపంటి లక్ష్మి, విండో చైర్మన్ పునుగోటి కృషారావు, అబ్బిడి లక్ష్మారెడ్డి, ఎంపిటిసిలు చంద్రశేఖర్, మల్లేశం, సర్పంచ్ వేముల పద్మజ, లక్ష్మి పాల్గొన్నారు.

వేడుకగా నారసింహుని చందనోత్సవం
ధర్మపురి, ఫిబ్రవరి 11: బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవా లు ఘనంగా జరుగుతున్నాయి. శతాబ్ధాల ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ దేవస్థానం లో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలలో అంతర్భాగంగా 11 రోజులపా టు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బీర్పూరు గ్రామ శివార్లలో పెద్దగుట్ట, చిన్నగుట్టలపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి భక్తుల పాలిట కరుణ కటాక్షమూర్తిగా, దుష్ట శిక్షకుడుగా, శిష్ట రక్షకుడుగా పేరెన్నిక గన్న నేపథ్యంలో ప్రతి కార్యక్రమానికి వంశపారంపర్య ఆచారక్రమంలో అశేష భక్తు లు, కార్యక్రమాలో భాగస్వాములవుతున్నారు. దేవస్థానం ఇఓ ప్రసాద్ పర్యవేక్షణలో వేడుకలు వైభోపేతంగా జరిగాయి. ఉదయాత్పూర్వం మంగళవాద్యాలతో, అర్చకులు పవిత్ర జలాలతో స్వామి వారలను అభిషేకించారు. విధివిధాన వేదోక్త సాంప్రదాయ పూజాదికాలు నిర్వహించిన అనంతరం లక్ష్మీ నరసింహ సహస్ర నామార్చనలు, కల్పోక్త న్యాసపూర్వక ప్రత్యేక పూజలొనరించారు. ఉపనిషత్‌యుక్త దశశాంతులతో ఘనంగా చందనోత్సవాన్ని నిర్వహించారు. ప్ర ముఖ యాజ్ఞికులు వొద్దిపర్తి రామాచా ర్య ఆచార్యత్వంలో ఆలయ అర్చకులు వొద్దిపర్తి సంతోష్, మధుసూదనాచార్యలు ఘనంగా దీనిని నిర్వహించగా, పిఎసిఎస్ చైర్మన్ రాంచందర్‌రావు, మాజీ జడ్పిటిసి ముప్పాళ జల జ, దేవస్థానం మాజీ చైర్మన్ కేశవులు, దేవస్థానం ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్ర తినిధులు, భక్తులు పాల్గొన్నారు.
గోదావరి తీరం.. భక్తజన సంద్రం
పవిత్ర గోదావరినదీ తీర సమీపస్థ స్థంభంపెల్లి గుట్ట శనివారం భక్తజన సంద్రంగా మారింది. గుట్టపై గుహలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని కొలువు, భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నది. కరీంనగర్ - రాయపట్నం రాష్ట్ర రహదారికి ఆనుకుని, ఉన్న గుట్టపై నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకల సందర్భంగా మాఘ బహుళ పాడ్యమి పర్వదినాన సుదూర ప్రాంతాలనుండి సనాతన వారసత్వ సాంప్రదాయాచరణలో భాగంగా, ఏతెంచిన అశేష భక్త, యా త్రికజనం భగవన్నామ స్మరణలతో, జయజయ ధ్వనాలతో గుట్ట ప్రతిధ్వనించింది. భక్తి పారవశ్యం ఆవధులు దాటి అలౌకిక ఆనందాన్ని ఆస్వాదింప జేసింది. ఉదయాత్పూర్వం నుండే దూర ప్రాంతాలనుండి ప్రయివేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలోగుట్ట వద్దకు చేరుకున్న భక్తులు, పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించి, దైవ దర్శనాలు చేసుకుని, మొక్కులు తీర్చుకున్నారు. వెల్గటూరు ఎంపిపి శ్రీనివాసరావు, ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, తదితర ప్రముఖులు పూజాదికాలలో పాల్గొన్నారు.
రాజీమార్గంతోనే కేసుల పరిష్కారం
* సీనియర్
సివిల్ జడ్జి కృష్ణమూర్తి
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 11: పరస్పర అంగీకారంతో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని పెద్దపల్లి సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎం.కృష్ణమూర్తి సూచించారు. అలాగే ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దాంతో తగిన న్యాయం పొందడానికి అవకాశం ఉం టుందన్నారు. మండలంలోని రంగంపల్లి గ్రామంలో గల సబ్ కోర్టు ఆవరణంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు, జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జిల సమక్షంలో 150 కేసులు పరస్పర అంగీకారంతో రాజీ మార్గం ద్వారా తమ కేసులు పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ క్షణికావేశంతో కేసులు పెట్టడం వల్ల అనవసరంగా కోర్టుల చుట్టు తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవడం తప్ప మరేమి లేదన్నారు. కొన్ని సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులు వాపస్ ఇస్తామని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి వెంకటరమణారెడ్డి, ఎజిపి వి.తిరుపతిరావు, లోక్‌అదాలత్ సభ్యు లు శ్రీపతి సత్తయ్య, మంచాల జ్యోతి, దూడం కనకయ్య, సిఐ మహే ష్, పెద్దపల్లి, బసంత్‌నగర్, ధర్మారం ఎస్సైలు శ్రీనివాస్, విజయేందర్, సీనియర్ న్యాయవాదులు మల్లారెడ్డి, హ న్మాన్‌సింగ్, వాస్, బాబ్జి పాల్గొన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీరు
* ఆర్థికమంత్రి ఈటల
గంగాధర, ఫిబ్రవరి 11: పంటపొలాలకు సాగునీరు అందించేందుకు గాను పైపులైన్ వేయడం ద్వారానే తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీరు అందుతుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని ఇస్లాంపూర్ పంపు హౌస్, నారాయణపూర్ చెరువులోకి వచ్చే ఎల్లంపల్లి పైపులైన్‌ను పరిశీలించారు. అనంతరం గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎల్లంపల్లి అధికారులతో నారాయణ్‌పూర్ రిజర్వాయర్ పనులపై సమీక్షించారు. ప్రస్థుతం ప్రాజెక్టు ద్వారా మండలంలోని ఎన్ని చెరువులు నిండాయని స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. గంగాధర ప్రాజెక్టు నుండి వెళ్లె రైట్ కెనాల్ గంగాధర చౌరస్తాలో లక్షలాధి రూపాయల విలువ గల భూములు ఉండడంతో రైతులు అడ్డు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గంగాధర చౌరస్తాలో గల 1.8కిలోమిటర్ పరిధిలో ప్రస్తుత అలైన్‌మెంట్, పైపులైన్, బాక్స్ కల్వర్ట్‌పై అంచనాలు తయరు చేసి తనకు సమర్పించాలి ఎల్లంపల్లి డిఈని మంత్రి ఆదేశించారు. తర్వాత జిల్లాలో నెలకున్న సమస్యలపై మాట్లాడారు.
ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, స్థానిక ఎమ్మెల్యే బొడిగె శోభ-గాలన్న, ఎంపిపిలు దూలం బాలగౌడ్, గుర్రం భూంరెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజిరెడ్డి, మార్కట్ వైస్ చైర్మన్ నజీర్, ఎంపిటిసిలు మల్లేశం, లక్ష్మణ్‌గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు
* ఇద్దరు యువకుల దుర్మరణం
* మరో యువకుడి పరిస్థితి విషమం
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 11: కరీంనగర్ నగర శివారు బైపాస్ రోడ్డులో లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో శనివారం మధ్యాహ్నం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి కారు ఢీ కొన్న ప్రమాదంలో కారు లో ప్రయాణీస్తున్న శ్రీకాంత్, ఇబ్ర హీం అనే ఇద్దరు యువకులు దు ర్మరణం చెందగా, మరో యువకు డు వినోద్ తీవ్రంగా గాయపడ్డా డు. పోలీసుల కథనం ప్రకా రం...గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం గొనెపూడి గ్రామానికి చెందిన శ్రీకాంత్, మహరాష్ట్ర చంద్రాపూర్ జిల్లా మూల్ గ్రామానికి చెందిన ఇబ్రహీం, వినోద్‌లు కలిసి కరీంనగర్ మీదుగా కారులో మహరాష్టక్రు వెళ్తుండగా, నగర శివారు బైపాస్ రోడ్డులో లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు టాప్ మొత్తం ఎగిరిపోగా, శ్రీకాంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇబ్రహీం, వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని చల్మెడ ఆసుపత్రికి తరలించగా, ఇబ్రహీం చికిత్స పొందుతూ మృతి చెందాడు. వినోద్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వినో ద్ చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యంలో వాహనాన్ని నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

ఉత్సాహంగా 3కె రన్
* ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి
* పెద్దపల్లి డిసిపి విజయేందర్‌రెడ్డి
సుల్తానాబాద్, ఫిబ్రవరి 11: ఆత్మవిశ్వాసంతో యువకులు ముందుకు నడవాలని, 3కె రన్ లాంటి మంచి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యపరుస్తాయని పెద్దపల్లి డిసిపి విజయేందర్‌రెడ్డి, ఏసిపి సింధూశర్మ అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 3కె రన్‌ను ప్రారంభించారు. ఆడశిశువులను రక్షించండి- కాపాడండి...సేవ్ గర్ల్ చైల్డ్ అనే పేరుతో మైదానం అసోసియేషన్, పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన దీనికి మంచి స్పందన లభించింది, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన 3కె రన్ శాస్ర్తినగర్ మీదుగా రాజీవ్ రహాదారిపై కొనసాగింది. ఆడ పిల్లలను రక్షించాలనే సంకల్పంతో ప్రజలను చైతన్యపర్చేందుకుగాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమ న్నారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తానుపర్తి తిరుపతి రావు, సర్పంచ్ అంతటి అన్నయ్యగౌ డ్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ ముకుందరెడ్డి, ఎస్సై బి.జీవన్, నిర్వహుకులు సిద్ద తిరుపతి, శివ, మధు, శ్రీనివాస్, నరేష్, అంజి, మైదానం అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి ముస్త్ఫా, ఎంపిటీసీలు పల్ల సురేష్, సూరశ్యాం, నాయకులు ము త్యం రమేష్, మధుసూధన్ రెడ్డి, పిఈటీలు అంతటి శంకర్, బాలసాని రాజ్‌కుమార్‌తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. 3కె రన్‌లో విజేతలైన కె.అనిల్, బి.కొమురయ్య, కె.శ్రీ్ధర్, బాలికలలో వి.రమ్య, జి మమత, ఎస్.రమ్యకు నగదుతోపాటు మెమెంటోలు అందజేశారు.

ఘనంగా మాఘ పౌర్ణమి
ధర్మపురి, పిబ్రవరి 11: గోదావరి తీరస్థ ప్రాచీన పుణ్య తీర్థమైన ధర్మపురి క్షేత్రంలో మాఘపౌర్ణమి పర్వదిన వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. నక్షత్ర మండల మార్గంలో లెక్కలేనన్ని నక్షత్రాలుండగా, అవి ఇంచుమించు 27 సమభాగాలుగా విభజించబడినా యి. అట్టి 27్భగాలలో మాఘ ఒకటి. అందు పల్లకి ఆకారంలో ఐదు ప్రము ఖ నక్షత్రాలుంటాయి. మాసానికి ఒకసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తుండగా, ఏడాదిలో ఒకసారి మాత్రమే చంద్రుడు పదహారు కళలతో మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఆరోజే మాఘ పూర్ణిమ. ‘‘మహామాఘి’’ అని పంచాం గ కర్తలు చెప్పే ఈరోజున అరుణోదయ స్నానం, ప్రధానంగా నదీజలాల లో స్నానంచేయాలని సనాతన సాంప్రదాయ నేపథ్యం ఉంది. మాఘ మాస పౌర్ణమి పర్వదినాన నదీస్నానం, దైవ దర్శనార్థం పుణ్యప్రదాలని భావించ బడే క్రమంలో శుక్రవారం రాత్రినుండే భక్తులు క్షేత్రానికి అరుదెంచారు.