కరీంనగర్

టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 16: పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. మార్చి 14 నుండి 30 వరకు జరుగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ఏర్పాట్లపై గురువారం ముందస్తు సమావేశం స్థానిక పొదుపు భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7938 మంది విద్యార్థులు 39 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారని, ఇందులో 7369 మంది రెగ్యులర్, 569 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, స్ట్రాంగ్ రూముల వద్ద ఆర్మ్‌డ్ పోలీసులను నియమించాలని, డిఎస్పీని ఆదేశించారు. అలాగే కానిస్టేబుళ్ళను కేటాయించాలన్నారు. అలాగే ప్రతీ పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్లకు ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయం ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నాం 12.15 గం.ల వరకు జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని అన్నారు. ప్రశ్నా పత్రాలపై ఎలాంటి వదంతులు రాకుండా ఇంటెలిజెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. పరీక్షల జవాబు పత్రాలను పోస్టల్ పార్శిల్ ద్వారా పంపించడానికి ఆయా పోస్ట్ఫాసుల్లో బండల్స్‌ను ఏరోజు కారోజు పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని పోస్టల్ అధికారులను ఆదేశించారు. పరీక్ష జరిగే వివరాలను మీడియా పరంగ పబ్లిసిటి చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, అత్యవసర మందులు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని నియమించాలని ఆర్‌డబ్లుఎస్, డిఎం అండ్ హెచ్‌వోలను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులను వారి పరీక్ష కేంద్రాలకు వారి గ్రామాల నుండి ప్రయాణించడానికి బస్సులను ముందుస్తు సమయంతో నడిపించాలన్నారు. పీరక్ష కేంద్రాలకు విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సెస్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన వాహనాలను అద్దెపై సమకూర్చాలని రవాణ అధికారులను ఆదేశించారు. జిల్లాలో తొమ్మిది స్టోరేజి పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ సుధాకర్, డిఇవో రాధాకృష్ణ, పరీక్షల నిర్వహణ సహయ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలి
* రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వమించాలి
* పెద్దపల్లిలో ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం
పెద్దపల్లి, ఫిబ్రవరి 16: సత్యశోధనకు వెళ్లిన ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని అక్రమంగా అరెస్టుకు నిరసనగా టిడిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని టిడిఎఫ్ రాష్ట్ర కన్వీనర్, టివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చత్తిష్‌గడ్ రాష్ట్రంలో ఆదివాసులపై జరుగుతున్న దాడులను, హత్యలను, ఆత్యాచారాలను, నిజనిర్దారణ చేసి బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు వెళ్లిన చిక్కడు ప్రభాకర్, రవింద్రనాథ్, లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, దొడ్డు ప్రభాకర్, రాజేంద్రప్రసాద్‌లను తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అక్రమంగా అరెస్టుచేసిన సభ్యుల బృందాన్ని చత్తీష్‌గడ్ రాష్ట్రంలోని కుంట పోలీస్‌స్టేషన్‌లో 50రోజులుగా నిర్బందించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ హక్కు, భావప్రకటన, స్వేచ్చహక్కులను హరించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన, నిరసన చేపట్టడాన్ని అడ్డుకోవడం శోచనీయమన్నారు. చత్తీష్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జైళ్లో అక్రమంగా నిర్బందించిన 7గురు సభ్యుల బృందాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే విడిపించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో తెలంగాణ అంబెద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంకూరి సురెందర్ (సన్నీ), తెలంగాణ ప్రజా ఫంట్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల మల్లేశం, పార్వతక్క, జిల్లా కార్యదర్శి గుమ్మడి కొమురయ్య, తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా బాధ్యుడు వేగోళపు బాలక్రిష్ణ, పెంచాల సతీష్, బండి మహేష్, శ్రీకాంత్, కార్తిక్, వెంకటేష్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

విజయోత్సవాలు
ఇస్రోను అభినందిస్తూ. ఎబివిపి ఆధ్వర్యంలో సంబురాలు
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 16: ప్రపంచంలోనే తొలి సారిగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఆధ్వర్యనా గురువారం సంబురాలు మిన్నంటాయి. విద్యార్థులు జాతీయ జెండాలతో కళాశాల నుంచి కొత్త బస్టాండు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మిఠాయిలను పంపిణీ చేశారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్ర భాగాన నిలిపిన శాస్తవ్రేత్తలకు అభినందలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రంజిత్‌కుమార్, శ్రీనివాస్, మహేశ్, కృష్ణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో..
ఇస్రో ఒకేసారి 104 సాటిలైట్ రాకెట్లను అంతరిక్షంలోని విజయవంతంగా పంపడాన్ని అభినందిస్తూ గురువారం హుజూరాబాద్ పట్టణంలో ఆదర్శ పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జై భారత్, జై ఇస్రో అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఆదర్శ పాఠశాల కరెస్పాండెంట్ పరాంకుశం కిరణ్‌కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సైకిల్ పై సర్వే..
అందర్నీ ఆశ్చర్యంలో ముంచిన కలెక్టర్
వేములవాడ,్ఫబ్రవరి 16: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ ఆకస్మిక తనిఖీలతో అందర్ని దడాపుట్టిస్తున్నారు. పక్షం రోజుల క్రితం తన అంగరక్షకులను పక్కన పెట్టి ఓ సాదరణ భక్తుడిలాగా క్యూలైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు..అక్కడి నుంచి ప్రసాదాల క్యూలైన్లో స్వామివారి ప్రసాదాలను కొనుగోలు చేసి సాదాసీదాగా వెళ్లిపోయారు... గురువారం అదేరీతి మళ్లీ ఆలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. ఎవరి ఊహకు అందకుండా ఉదయం 6గంటలకు దేవాలయానికి చేరుకొని సైకిల్ పై ఆలయ పరిసర ప్రాంతాలు,పార్కింగ్ స్థలం,,్భమేశ్వరాలయం,బద్దిపోచమ్మ ఆలయాల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి వెళ్లారు.అదీ కూడా తన సతీమణితో సైకిల్ చుట్టిరావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.అయితే మీడియాకు తన చాయాచిత్రాలు లభించకుండా తన పనికానిచ్చుకుని వెళ్లడం విశేషం.

మహాశివరాత్రి నాడు ఆర్జిత సేవలు బంద్
వేములవాడ,్ఫబ్రవరి 16: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 23,24తేదీలలో రోజూవారిగా జరిగే అర్జిత సేవలను ఆలయ అధికారులు నిలుపుదల చేస్తున్నారు. 23తేదిన రాత్రి 9గంటలకు నిశీపూజ,్భక్తులకు సర్వదర్శనం,రాత్రి 12గంటల నుంచి 3గంటల వరకూ పురజనులకు సర్వదర్వనం ఉంటుంది. మహాశివరాత్రి అయినా 24తేదిన ఉదయం 7గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున స్వామివారికి,అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ, ఉదయం 8గంటలకు దేవస్థానం తరుపున ప్రభుత్వ ప్రతినిధిచే పట్టువస్త్రాలను అందజేస్తారు.సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల 25నిమిషాల వరకూ కళ్యాణ మండపంలో మహాలింగార్చన ఆలయ అధికారులు నిర్వహిస్తారు.రాత్రి 11.35గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.

ప్రాజెక్టుల రీ డిజైన్ పేర తెలంగాణకు తీరని అన్యాయం
పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 16: నీళ్ళు, నిధులు,నియామకాల ట్యాగ్‌లైన్‌తో అధికారం చేపట్టిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల రిడిజైన్ పేర తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావుకు గురువారం లేఖ రాశారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. నీటిపారుదల శాఖలోఅభివృద్ది పడకేసిందని, ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా రాష్ట్ర ప్రగతి కొనసాగుతుందని విమర్శించారు. రిడిజైన్ పేర కాలయాపన చేస్తూ కొత్త ప్రాజెక్టుల పేరుతో గుత్తేదారులతో కుమ్ముక్కై వేల కోట్ల కమీషన్లు కొల్లగొడుతూ, నీటిపారుదల రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. 2004జలయజ్ఞం కార్యక్రమంలో తెలంగాణలో 31 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేలా ప్రభుత్వనేతలను ఒప్పిస్తే, వాటి నిర్మాణం 95శాతం మేర పూరె్తైందన్నారు. కేవలం రూ.10వేల కోట్లు వెచ్చిస్తే అన్ని ప్రాజెక్టులు పూరె్తై, రాష్ట్రంలో 50లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశముండగా, పాతప్రాజెక్టులపై చేసిన వ్యయాన్ని వృధా చేస్తూ, వాటిస్థానంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు రిడిజైన్‌లు చేపడుతూ, వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుమ్మెత్తారు. ప్రభుత్వ చేతకానితనంతోతెలంగాణకు ద్రోహం చేస్తూ, తమపబ్బం గడుపుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ప్రజాభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ నేతల అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి హరీష్‌కు రాసిన లేఖలో సవాల్ విసిరారు.

ప్రతి ఒక్కరు చట్టాల గురించి తెలుసుకోవాలి
* అవగాహన కోసమే న్యాయ విజ్ఞాన సదస్సులు * మండల న్యాయ సేవా సంస్థతో ఉచిత న్యాయం
* సీనియర్ సివిల్ జడ్జి కృష్ణమూర్తి
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 16: ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలుసుకోవాలని పెద్దపల్లి సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎం.కృష్ణమూర్తి తెలిపారు. మండలంలోని మారేడుగొండ గ్రామ పంచాయితీ ఆవరణంలో గురువారం సాయంత్రం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల న్యాయ సేవా అధికార సంస్థ పని చేస్తుందన్నారు. విద్యా సంస్థలు, గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
పేదలు మండల న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి ఉచత న్యాయం పొందవచ్చని ఆయన సూచించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందాలంటే చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజురోజుకు కొత్తగా ఎన్నో చట్టాలు రూపొందిస్తున్నారని, వాటిని గురించి తెలుసుకొని తగిన న్యాయం పొందాలన్నారు. భారత సమాజంలో మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, గృహ హింస దృష్ట్యా కఠినమైన చట్టాలు తీసుకు రావడం జరిగిందని, వాటిపై అవగాహన పెంచుకొని న్యాయం పొందాలన్నారు. ఈ సదస్సులో జునీయర్ సివిల్ జడ్జి రాజేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి వెంకటరమణారెడ్డి, లోకు అదాలతు సభ్యులు దూడం కనకయ్య, శ్రీపతి సత్తయ్య, న్యాయవాదులు వాస్, శంకర్, హన్మాన్‌సింగ్, గ్రామ సర్పంచు శంకర్, ఎంపిటిసీ మహేందర్‌రెడ్డి తదిరతరులు పాల్గొన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణానికి మతపర రిజర్వేషన్లు ఆటంకం
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 16: సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమైన 12 శాతం ముస్లీం మతపరమైన రిజర్వేషన్లు ప్రజాస్వాయ్యానికి విఘాతం కలిగిస్తాయని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె మురళికృష్ణ అన్నారు. గురువారం కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామంలో భారతీయ యువమోర్చా జిల్లా నాయకులు కడర్ల రతన్‌కుమార్ ఆధ్వర్యంలో ముస్లీం రిజర్వేషన్ల ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మురళికృష్ణ మాట్లాడుతూ అప్రజాస్వాయ్య పద్దతిలో పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న సి ఎం కెసి ఆర్ అధికార దాహంతో ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారని ఆరోపించారు. ప్రతిపాదనతో యావత్తు యువతను విద్యా, ఉపాది, ఉద్యోగ అవకాశాలకు దూరం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న బడుగు బలహీనవార్గలు, దళితులు, గిరిజనులకు అన్యాయం చేసేదిశగా టి ఆర్ ఎస్ ప్రభుత్వ చర్యలు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత పరమైన 12శాతం రిజర్వేషన్లతో తెలంగాణ పునర్నిర్మాణంలో ఆటంకం కలిగిస్తాయని వివరించారు. ముస్లీం రిజర్వేషన్ల అమలుతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యె ప్రమాదముందని, దీంతో దేశసమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని దానికి సి ఎం కెసి ఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవై ఎం జిల్లా కార్యదర్శి దుర్శేట్టి సంపత్, నాయకులు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల రిజర్వేషన్లతో బిసిలకు అన్యాయం
బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి
గంగాధర, ఫిబ్రవరి 16: ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా జనాభాలో 50 శాతం ఉన్న బిసిలకు అన్యాయం జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గంగాధరలో గురువారం ముఖ్య కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లీంలకు రిజర్వేషన్ల పేరుతో బిసిలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, కెజి టు పిజి ఉచిత విద్య అమలు ఊసెత్తడం లేదని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గంగాధర ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న మంగపేట గ్రామానికి చెందిన 12 మంది రైతుల 72 ఎకరాల భూమి నష్టపరిహారం ఊసేలేదని, రైతులను ముంపునకు గురవుతున్న, గృహ యజమానులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. సమావేశంలో బూత్ కమిటీల బలోపేతం, ఉప మండలాల ఇంచార్జిలను నియమించడం వంటి వాటిపై చర్చించారు. కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షుడు కోల అశోక్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెరక మల్లారెడ్డి, కార్యదర్శి గుర్రాల వెంకటరెడ్డి, బిజెవైఎం రాష్ట్ర నాయకులు ఊరిడి శివారెడ్డి, రాష్ట్ర నాయకులు చెన్నమనేని మనోహర్ రావు, మండల నాయకులు కోల అంజి, పెంచాల చందు తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

స్ర్తి నిధి రుణాలపై నేడు సమీక్ష
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 16: స్ర్తి నిధి రుణాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కందుకూరి అంజయ్య తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సముదాయంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సమావేశానికి స్ర్తి నిధి మేనేజింగ్ డైరెక్టర్ జి.విద్యాసాగర్‌రావు హాజరు అవుతున్నారని చెప్పారు. జిల్లా పరిధిలోని ఎపిఎంలు, సిసిలతో జరిగే సమీక్షలో స్ర్తి నిధి రుణాలు ఎంత మందికి మంజూరు చేశారు, ఇంకా రుణాలు పొందడానికి ఇంకా ఎంత మంది అర్హులు ఉన్నారు, లక్ష్య సాధన కోసం ఏలాంటి చర్యలు చేపడతున్నారనే విషయాలపై చర్చించనున్నట్టు ఆయన పేర్కోన్నారు. మహిళ స్వాలంభన, ఉపాధి లక్ష్యంగా ప్రారంభించిన స్ర్తి నిధి రుణాలు సద్వినియోగం చేసే అంశంపై సమావేశంలో అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా పరిధిలోని ఎపిఎంలు, సిసిలు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.