కరీంనగర్

ప్రతీ మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 20: జిల్లాలోని ప్రతీ మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించనున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చే వారి గురించి పబ్లిక్ టాయిలెట్స్‌లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను గ్రామ పంచాయతీలు చేపట్టాలని తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిలోనూ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి వాటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీలు చేపట్టాలని సూచించారు. ఒడిఎఫ్‌గా ప్రకటించిన గ్రామాలలో బహిరంగ మల విసర్జన చేసినట్లయితే రూ.500 జరిమానా విధించాలని పంచాయతీలలో తీర్మాణం చేయాలని అన్నారు. మరుగుదొడ్లు లేని బస్టాండ్‌లను గుర్తించి జాబితాను పంపాలని ఎంపిడిఓలను ఆదేశించారు. ఆర్టీసితో సంప్రదించి స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా అన్ని బస్‌స్టేషన్లలో టాయిలెట్స్ నిర్మిస్తామని చెప్పారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్చి 15 లోపు 100 శాతం లక్ష్యం సాధించాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు ప్రతీ రోజు వాటి ప్రగతిపై సమీక్షించాలని, ప్రజలకు అవగాహన కల్పించి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోస్టాఫీసుల్లో మరిన్ని నూతన పథకాలు
అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 20: పోస్ట్ఫాసుల్లో మరిన్ని నూతన పథకాలను కేంద్రప్రభుత్వం ప్రవేశ పెడుతుందని తపాలా శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవా రం జగిత్యాల రూరల్, గొల్లపల్లి మం డలాల పోస్టుమాస్టర్లు, స్థానికులతో కలిసి మండలంలోని పోరండ్ల, బాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తపా లా బీమా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాల జీవిత బీమా, సుకన్య సమృద్ది యోజన వంటి ఆకర్షనీయమైన పథకాలతో పాటు ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ వంటి ఎన్నో లాభాదాయక కేంద్ర ప్రభుత్వ పథకాలను పోస్ట్ఫాసుల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతివారూ పొదుపును పాటిం చాలన్నారు.
ర్యాలీలో పోరండ్ల సర్పంచ్ శృంగారపు జలజ, ఎంపిటిసి చంద్రశేఖర్, గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.