కరీంనగర్

అక్రమాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 21: రేషన్ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏప్రిల్ నుంచి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పాస్) విధానం అమలు చేయనున్నట్టు పెద్దపల్లి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె.హాబీబ్- ఉర్-రహమాన్ వెల్లడించారు. మండల పరిషత్ కార్యాల య సముదాయంలో గల తన కార్యాలయంలో ఆయన మంగళవారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల పరిధిలో 403 రేషన్ దుకాణాలు ఉండగా, లక్షా 98 వేల 895 ఆహార భద్రతా కార్డులు, 12233 ఎఫ్‌ఎస్‌సి కార్డులు, 180 అన్నపూర్ణ కార్డులు ఉన్నట్టు ఆయన వివరించారు. పౌరసరఫరాల శాఖ నుంచి వస్తున్న సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ-పాస్ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ఈ విధానం అమలు కోసం సన్నాహాలు ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులో పేరు గల వారిలో ఒకరు రేషన్ దుకాణంకు వెళ్లి తమకు కావాల్సిన సరుకులు ఎలక్ట్రానిక్ మిషన్‌లో వేలు ముద్ర వేసి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విధానం వల్ల కార్డు కలిగిన వారు, అవసరం ఉన్న వారు మాత్రమే రేషన్ దుకాణం వెళ్లి సరుకులు తీసుకెళ్తారని ఆయన తెలిపారు. ఈ విధానం వల్ల రేషన్ డీ లర్ కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడటానికి వీలు ఉండదన్నారు. ఇటీవలి కాలంలో రేషన్ బియ్యం, కిరోసిన్ పెద్దఎత్తున అక్రమంగా బ్లాక్ మా ర్కె ట్‌కు తరులుతున్న నేపథ్యంలో ప్రభు త్వం దీనికి తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోని పక్షంలో తర్వాత నెలలో కోటా తగ్గించి వస్తుందన్నారు.

ప్రణాళికాబద్ధంగా
పరిశ్రమలను నడిపించాలి

* రాష్ట్ర చేనేత, జౌళి సంచాలకురాలు శైలజా రామయ్యర్
సిరిసిల్ల, ఫిబ్రవరి 21: సరైన నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలను ముందుకు నడిపించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందని రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్ అన్నారు. సిరిసిల్ల చేనేత, పవర్‌లూమ్ రంగ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇటీవల ముఖ్య మంత్రి పరిశ్రమ వాదులతో సమీక్ష జరిపిన నేపథ్యంలో ఇక్కడ కార్మికులు, ఆసాములు, యజమానులు, ఇతర అనుబంధ రంగాల ప్రతినిథులతో మంగళారం రామయ్యర్ సమావేశమయ్యారు. స్థానిక పొదుపు భవన్‌లో జిల్లా కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల కూలీ పెంచడానికి చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికపై అభిప్రాయాలు తీసుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆమె అన్నారు. చేనేత కార్మికుల కనీస వేతనం రూ.15 వేల నుండి 16 వేల వరకు చెల్లించే విధంగా ప్రణాళికలు రూపొందించేందుకు కార్మికులు, ఆసాములు, ఉత్పత్తిదారులతో చర్చించి వాస్తవిక సమస్యలను తెలుసుకోవాలని ముఖ్య ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా వీటిపై కలెక్టర్ ప్రతిపాదనలు తయారు చేస్తారని, ఈ నివేదికను సిఎం ముందు ఉంచుతామన్నారు.అయితే ఇంకా సలహాలు, సూచనలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు తెలుపవచ్చని, వాటిని కూడా నివేదికల్లో చేర్చుతామన్నారు. సమావేశం ముగింపులో శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ప్రధానంగా కార్మికులకు నెలకు రూ.15 వేల కూలీ పెంచాలన్న యోచనను అందరు ఆహ్వానించారన్నారు. ఇందు కోసం ప్రభుత్వం జీవో జారీ చేసి ఈ వేతనం అమలయ్యేలా చూడాలని కార్మిక సంఘాల ప్రతినిథులు కోరారన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్, ప్రభుత్వ త్రిఫ్టు కంట్రిభూషన్ ప్రతిపాదనలు కోరారని, కనీస వేతనాల జీవో ప్రకారం అమలు చేయాలని కోరినట్టు తెలిపారు. ఇక సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న మరమగ్గాలన్నింటిని ఎలా అప్‌గ్రెడేషన్ చేయాలి, ఆధునీకరించడానికి చర్యలు, దీని అములతోనే కార్మికులకు మంచి వేతనాలు, ప్రయోజనాలు కలుగుతాయనే దానిపై చర్చ జరిగిందన్నారు. సెమి ఆటోమెటిక్ లూమున్నింటిని ఆధునీకరించడం తప్పదన్నారు. ప్రస్తుతం ఉన్న పవర్‌లూం లన్నింటిని ఆధునీకరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. వస్త్ర ఉత్పత్తులు పెరగడానికి యజమానులు తగిన సూచనలు అందచేశారని, అయితే కనీస వేతనాలు ఇంత వరకు అమలు చేయకపోవడానికి పరిశ్రమలో నెల కొన్న సంక్షోభాలే కారణమని తెలిపారన్నారు. సైజింగ్, డైయింగ్ పరిశ్రమలకు కొన్ని ఇంప్రూవ్‌మెంట్ మిషనరీలు అమర్చితే ఆధునీకరించుకోవచ్చని అభిప్రాయాలు వెల్లడైనట్టు తెలిపారు. పరిశ్రమ పూర్తి స్థాయిలో అధునీకరిస్తే రానున్న ఏడాది, రెండేళ్ళలో కార్మికులకు రూ.15 వేల వేతనాలు అందే సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. తొలుత కార్మికులు, యజమానుల సమావేశాల్లో శైలజారామయ్యర్ మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే నిరంతం ఆధార పడితే లాభం లేదని, మార్కెట్‌లో మన వస్త్రాలపై డిమాండ్ పెంచుకుని రాణించాలని, లేని పక్షంలో నిరంతరం ప్రభుత్వ సాయంపై ఆధారపడితే పరిశ్రమ నిలదొక్కుకోలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గుడ్డ ఆర్డర్లపై నాయకత్వ లక్షణాలున్న వారు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని, ప్రభుత్వ ఆర్డర్లు అందరికీ పంచాలని, ఉత్పత్తులను ముందుకు తీసుకెళ్ళాలన్నారు. పరిశ్రమలో సరైన నాయకత్వం లేకుంటే పదేళ్ళలో పెను సంభోన్ని చవి చూస్తారన్నారు. నష్టాలు తెచ్చే ఉత్పత్తులను వీడాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాకారాన్ని సద్వినియోగం చేసుకోకుంటే నష్టపోతారన్నారు. ఐకమత్యంతో ఆక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని, లేకుంటే మరో ఐదేళ్ళు వెనక్కు పోతారని, ఇది మంచి సమమయని, ప్రభుత్వం మీకు తగిన సాకారం ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. చివరన జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ అందరికీ అనుకూలమైన ప్యాకేజీ సిద్దం చేయాలని, అందరి సలహాలు విన్నామని, వారంలో పరిశ్రమ అభివృద్ది కోసం ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నివేదిక తయారు చేసి, ముఖ్య మంత్రికి సమర్పిస్తామని, ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు కూడా సేకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, చేనేత జౌళి శాఖ ఎడి అశోక్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
* జిల్లాలో 37,956 మంది విద్యార్థులు
* 47 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
* నిమిషం ఆలస్యమైనా నో పర్మిషన్
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్, ఫిబ్రవరి 21: ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ప రీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు మార్చి 1 నుండి 19వ తేదీ వరకు జరగనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 37,956 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, వీరికోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షా సమయానికంటే ముందే రావాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయాల్లో మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 నిషేధాజ్ఞలతో పా టు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ సంచాలకులు సుహాసిని, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లతోనే
సంపూర్ణ పారిశుద్ధ్యం

* జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్
ధర్మపురి, ఫిబ్రవరి 21: గ్రామీణ సంపూర్ణ పారిశు ద్ధ్య సాధనకై ప్రతి ఒక్క రూ విధిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించు కోవాలని జగిత్యాల కలెక్టర్ డాక్డర్ ఎ. శరత్ కోరారు. బుగ్గారం మండలంలోని చందయ్యపల్లె పంచాయ తీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ ఎన్నం కిషన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం గ్రామ సందర్శన నిర్వహించారు. ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాధి హామీ, ఇంకుడు గుంతలు, అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంల పనితీరు, ఆరోగ్యం, గర్భిణీ స్ర్తిలు, పోషకాహారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, పారిశుద్ధ్య పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీరాజ్ ఇఇ, ధర్మపురి మండల ప్రత్యేకాధికారి మనోహర్ రెడ్డి, ధర్మపురి తహశీల్‌దార్ మహేశ్వర్, ఎంపిపి సూపరింటెండెంట్, ఇన్‌చార్జి ఎంపిడిఓ రాణి, ఇఓపిఆర్‌డి శ్రీ్ధర్, మండల వైద్యాధికారి శ్రీపతి, ఇజిఎస్ ఎపిఓ తిరుపతిరావు, ఎఓ జ్యోతిర్మయి, ఐకెపి ఎపిఎం రమాదేవి, ఎంఎల్‌ఓ రాజేశం, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ గంగాధర్, పంచాయతి కార్యదర్శి, విఆర్‌ఓ, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తాం
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 21: జిల్లాలోని ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నట్టు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో మొబైల్ కూరగాయల వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మండలం గోపాలపురంలో 200 ఎకరాలలో కూరగాయలు సాగవుతున్నాయని చెప్పారు. పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు రెండు వాహనాలను రైతులకు సబ్సిడీతో మం జూరు చేశామని తెలిపారు. ఆ గ్రామంలోని రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. నాలుగు లక్షల రూపాయల రుణంలో 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, ఈ వాహనాల వల్ల రైతులు ఆ గ్రామంలో పండించిన కూరగాయలను పట్టణానికి తీసుకువచ్చి అమ్ముకుంటారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు తాజా కూరగాయలు తక్కువ ధరలో లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు బండారు శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు.
యువత ఆర్థికాభివృద్ధికి పలు పథకాలు
* కలెక్టర్ కృష్ణ్భాస్కర్
సిరిసిల్ల, ఫిబ్రవరి 21: జిల్లాలోని నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి పొందేందుకు గాను పలు పథకాల కింద వారిని ఎంపిక చేయడం జరుగుతున్నదని కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. మంగళవారం తన బాంబర్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులు, కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా జిల్లాలో 35 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించి బ్యాంకులకు రుణా లు మంజూరుకు సిఫారసు చేశామన్నారు. వివిధ పరిశ్రమలు, టేలరింగ్, ఇంజనీరింగ్ వర్క్ షాపులను నెలకొల్పడానికి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషనర్ ద్వారా పరిశ్రమలు, సర్వీసింగ్ ఉత్తర్వులు వంటి వాటికి 32 దరఖాస్తులు రాగా, వాటిని కమిటీ పరిశీలించి ఆయా బ్యాంకులకు రుణాల మంజూరుకు సిఫారసు చేశారని తెలిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు ద్వారా వివిధ పరిశ్రమల స్థాపనకు 15 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించడంతో పాటు కమిటీ ఆమోదించి, రుణాల మంజూరుకు ఆయా బ్యాంకులకు పంపించనున్నట్టు తెలిపారు. టి.ఎస్.ఐపాస్ కింద జిల్లాలో ఏడుగురు పరిశమల స్థాపనకు దరఖాస్తులు వచ్చాయని, ఇందులో సుమారు ఆరు కోట్లతో ఆరు పరిశ్రమల స్థాపనకు అనుమతించామని, హైడల్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు స్థానికుల అభ్యంతరం మేరకు, వారి సమస్యలను పరిశీలించిన తర్వాత తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కమిటీ సూచించిందన్నారు. టి ప్రైడ్ కింద ఎస్సీలు 13 మంది దరఖాస్తు చేసుకోగా ఎనిమిది దరఖాస్తులు ఆమోదించి 25 లక్షల సబ్సిడి మంజూరు చేయడం జరిగిందన్నారు. పావలా వడ్డీ కింద 11 మంది దరఖాస్తు చేసుకోగా, ఏడుగురికి సుమారు 2.5 లక్షల వడ్డీ మాఫీ చేయ డం జరిగిందన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రాజారాం, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శేఖర్, ఎల్‌డిఎం, టి.ఎస్. ఐపాస్ జనరల్ మేనేజర్, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ పాల్గొన్నారు.
జూన్ లోగా ట్యాంక్‌బండ్ పనులు పూర్తి
* అటవీ శాఖ అలసత్వం వల్లే నిర్మాణం ఆలస్యం * చొప్పదండి ఎమ్మెల్యే శోభ

చొప్పదండి, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని రాగంపేట (రేవెల్లి) చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో కట్టపై ఉన్న చెట్లను తొలగించడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండటం వల్లే నిర్మాణం పనులు ఆలస్య మవుతున్నాయని, ఏదీ ఏమైనప్పటికీ జూన్ లోగా నిర్మాణం పనులు పూర్తి చేసి సంబందిత మంత్రితో ప్రారంబిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టింపులు లేనట్లు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొనేందుకు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయటం జరగుతుందని తెలిపారు. ఇలా అభివృద్ధిని అడ్డుకోవటంలో పరోక్షంగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు వెంటనే చెట్లను తొలగించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టాంక్ బండ్ నిర్మాణం పూర్తితో ఈ పరిసర ప్రాం తాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం పనులు జరిగేలా ప్రజలు చూసుకోవాలని కోరారు. గుండి చెరువు నిండటంతో దేశాయిపేట చెరవు, కుంటలను నింపటం జరిగిందని, వాటి ద్వారా మంగళంపల్లి, చిట్యాలపల్లి చెరువులను నింపటం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రాబోయే రోజుల్లో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపిపి గుర్రం భూంరెడ్డి, సర్పంచ్ కొత్తూరి శంకర్, బత్తిని బుచ్చయ్య, గొల్లపల్లి శ్రవణ్ కుమార్, కర్రె శ్రీనివాస్, మచ్చ రమేష్, చీకట్ల లచ్చయ్య, జహీర్, చందు, సీపెల్లి గంగయ్య, గాండ్ల లక్ష్మణ్, రాజారాం, రఫీక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
చక్రపాణి ఎన్నికపై హర్షం

ఎలిగేడు, ఫిబ్రవరి 21: అఖిల భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఘంట చక్రపాణి ఎన్నిక పట్ల ఎలిగేడు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ దేవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మేరుగు రాజు, బూసారపు కొమురయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.