కరీంనగర్

శరణం గచ్ఛామి సినిమా బ్యాన్ చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, ఫిబ్రవరి 24: మండల పరిధిలోని గట్టుదుద్దనపల్లి గ్రామంలో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై శుక్రవారం జైభీం యూత్ ఇండియా రాష్ట్ర నాయకులు మంద అమర్ ఆధ్వర్యంలో అరగంట పాటు రాస్తారోకో చేపట్టారు. శరణం గచ్చమీ సినిమా సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిన విదానాన్ని వ్యతిరేకిస్తు రాస్తారోకో చేపట్టారు. శరణ గచ్చమి సినిమా బ్యాన్ చేయవద్దు అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణయ్, కనుకం శ్రీకాంత్, అజయ్, పవన్, అనిల్, శ్రీనివాస్, రామక్రిష్ణ, అఖిల్ పాల్గొన్నారు.
ప్రత్యేక పూజల్లో అరెపల్లి, పొన్నం
తిమ్మాపూర్, ఫిబ్రవరి 24: తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామంలో మహశివరాత్రి వేడుకల సంధర్భంగా శుక్రవారం తిమ్మాపూర్, ఎల్‌ఎండి, నూస్తులాపూర్, పర్లపల్లి, నల్లగొండ, రామక్రిష్ణపూర్ కాలని, కొత్తపల్లి గ్రామంలోని దేవాయాలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఎల్‌ఎండి కాలనిలో ముత్యుంజయం దేవాలయంలో టిపిసిసి ఎస్సీ సెల్ ఛైర్మన్, మాజీ ప్రభుత్వ విప్ అరెపల్లి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను చెపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణం తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రేమలత, జడ్పిటిసి పద్మ, కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు నర్సింగరావు, నియోజవర్గం యూత్ అధ్యక్షుడు పులి క్రిష్ణ, కమాలకర్, మండల నాయకులు తదతరులు పాల్గొన్నారు.