కరీంనగర్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 24: పెరుగుతున్న కాలుష్యకారకాలతోదెబ్బతింటున్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అందరి బాధ్యత అని బల్దియా కమీషనర్ శశాంక్ అన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని నగరంలోని ఆర్ట్స్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోశుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాటిన మొక్కలను ఏడాదిపాటు సంరక్షిస్తే చెట్లుగా మారిన నిరంతరం కాలుష్యాన్ని తమదరికి చేర్చుకుని సృష్టిలోని జీవరాశులను సంరక్షిస్తాయన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతిని ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల ప్రసారం భూమిపై పడుతుందని, ఇది జీవరాశుల మనుగడకు గొడ్డలిపెట్టని అన్నారు. దీనిని నివారించేందుకు అత్యధిక సంఖ్యలో చెట్లు నాటాల్సిన అవసరముందన్నారు. పర్యావరణ పరిరక్షణకు వయోజనులు నడుం బిగించటం అభినందనీయమన్నారు. ఇది యువతకు మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు. కాంక్రీట్ జంగల్‌గా మారిన నగరంలో ప్లాంట్స్ జంగల్ నిర్మించేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని పిలుపునిచ్చారు. స్మార్ట్‌సిటీ కోసం పోటీపడుతున్న నగరంలోపచ్చలహారం ఏర్పాటుకు నగరవాసులు తమవంతుగా బాధ్యతలు స్వీకరించాలని, వాకర్స్ అసోసియేషన్‌లు తమ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని కోరారు. నగరంలోని అన్ని మైదానాల్లో కూడా మొక్కలు నాటాలన్నారు. కార్పొరేషన్ సహాకారం కూడా ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నాటిన మొక్కలకు ట్రీగార్డులు తొడిగారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు, కార్యదర్శి గందె మహేశ్, కార్పొరేటర్లు వాల జీవితమాల, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి నర్సింగరావు, సభ్యు లు, తదితరులు పాల్గొన్నారు.