కరీంనగర్

వాడవాడలా ఉప్పొంగిన భక్త్భివం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఫిబ్రవరి 24: మహా శివ రాత్రి పర్వదిన వేడుకలు శుక్ర వారం గోదావరిఖని, రామగుండంలో ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయానే్న గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్నానాలకు తరలిరావడంతో గోదావరి నది ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. శివ పార్వతులకు నదీ తీరం వద్ద పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాగారం ఉండే వారితో ఇటు వ్యాపార కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. గోదావరిఖనిలోని మార్కండేయకాలనీ, గౌత మి నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, ప్రశాంత్ నగర్, జిఎం కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ, ఎఫ్‌సి ఐ, బసంతనగర్ ఏరియాలలోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివ పార్వతుల కల్యాణంతో ఆలయాలు మారుమోగిపోయాయి. జాగారం ఉండే భక్తుల కోసం వివిధ సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
సిరిసిల్లలో ...
సిరిసిల్ల, ఫిబ్రవరి 24: సిరిసిల్ల పట్టణంలో మహాశివరాత్రి వేడుకలు ఘనం గా జరిగాయి. రెండు రోజుల పాటు పట్టణంలోని అన్ని శైవక్షేత్రాలలో జరిగే ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్దలతో ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోని శివనగర్ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో అలాగే పట్టణ శివారులోని రగుడు నెమళ్ళ గుట్టపై మల్లికార్జున స్వామి దేవస్థానంతో పాటు అన్ని శివాలయాలలు పోటెత్తిన భక్తులతో ఉదయం నుండే అలరించాయి. ఈ సందర్భంగా శివనగర్ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యపూజా కార్యక్రమాలతో పాటు శ్రీవిఘ్ణేశ్వర పూజ, స్వస్తి పుణ్యావాహచనం, నవగ్రహ ఆధాధనలు నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు నిరంతర జలాభిషేకం నిర్వహించారు. సాయంత్రం అఖండ దీపారాధన, భక్తులకు స్వామి వారి దర్శనాలు జాగరణ, భజనలు, అఖండ నామస్మరణలు నిర్వహించారు. రాత్రి లింగోదభవం, రుద్రాభిషేకం, బిల్వార్చనలు నిర్వహించారు. ఈకార్యక్రమాలకు వేకువ సమయం నుండే భక్తులు బారులు తీరి దర్శనాలు చేసుకుని, పవిత్ర శివరాత్రి పర్వదిన వేడుకలు ఉపవాసాలతో గడిపారు. అలాగే రగుడు నెముళ్ళ గుట్టపై ఉన్న శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమ య్యా యి. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల బృందంచే స్వామి వారికి మహిళలచే మంగళహారతులు తీసుకెళ్ళారు. పుట్ట బంగారం తెచ్చారు. సుంకు బియ్యం పట్టారు. లగ్గం పట్నం వేశారు. అనంతరం లింగపూజ నిర్వహించారు. అలాగే పట్టణంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. శనివారం శివపార్వతుల కళ్యాణం, మహా అన్నదానాలు నిర్వహిస్తున్నారు.
హుస్నాబాద్‌లో..
హుస్నాబాద్ , ఫిబ్రవరి 24: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని పొట్లపెల్లి స్వయం భూ రాజరాజ్వేర దేవస్థానంలో శుక్రవారం 3.30 నిమిషల నుండి భక్తులు లింగంపై పాలాభిషెకంతో పూజలు చేయుటకు పోటీ పడ్డారు. ఉదయం 8గంటల వరకు భక్తుల తాకిడి పెరిపోవడంతో పోలీసులు,వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసేకున్నారు. స్వయం భూరాజరాజేశ్వర స్వామిని దర్శించుకునుటకు విఐపిలు తాకిడి పెరిగింది దీనితో భక్తులకు కొంత ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని సిద్దేశ్వరా దేవాలయంలోస్వామివారికి నగర పంచాయితీ చైర్మెన్ సుద్దాల చంద్రయ్యతో పాటు పాలక వర్గం స్వామివారికి పట్టువస్తల్రుసమర్పించారు. మరకత లింగేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు.
పట్టువస్త్రాలు
సమర్పించిన సతీష్‌బాబు
పొట్లపెల్లి స్వయం భూ రాజరాజ్వేర స్వామికి హుస్నాద్ ఎమ్యెల్యే సతీష్‌బాబుశ్రీమతి షమిత దంపతులు స్వామివారికి పట్టువస్తల్రు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి కొడెను కట్టివేసి మెక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్యెల్యేదంపతులకు శాలువతో సత్కరించి తీర్థప్రసాదములు అందజేశారు. అనంతరం భక్తుల సౌకర్యాల ఎర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మెన్ రాజారెడ్డి ఎంపిపి భూక్య మంగ, నగర పంచాయితీ చైర్మెన్ చంద్రయ్య,కౌన్సిలర్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.