కరీంనగర్

హర..హర మహాదేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 24: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో శుక్రవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగాయి. హరోం..హర..! శివోహం.. శివ..హరహర మహాదేవ.. శంభోశంకర..! ఓం నమశ్శివాయః అంటూ శివా లయాలు మార్మోగాయ. ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలు అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే గోదావరి తీరంలో ని మంథని గౌతమేశ్వరస్వామి, కోటిలింగాల కోటేశ్వరస్వామి, ధర్మపురి రామలింగేశ్వరస్వామి, సారంగాపూర్ మండలంలోని పెంబట్ల శ్రీరాజరాజేశ్వరాలయం, ఓదెల మల్లన్న దేవాల యం, చొప్పదండిలోని శంభునిగుడి, పొట్లపల్లిలోని శివాలయం, పర్లపల్లి చంద్రవౌళీశ్వరాలయం, కోట్ల నర్సింహులపల్లి శివాలయం, గోదావరిఖని సమీపంలోని జనగామ, విలాసాగర్, మంథని సమీపంలోని సుందిళ్ల శివాలయాలలో సైతం శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన కరీంనగర్ పాతబజార్‌లోని ప్రాచీన గౌరీశంకర శివాలయం, కమాన్‌రోడ్డులోని రామలింగేశ్వరాలయం, భగత్‌నగర్‌లోని శివాలయం, ఆదర్శనగర్‌లోని రాజరాజేశ్వరాలయం, మార్కండేయనగర్‌లోని మార్కండేయ శివాలయాలు, ఉదయ్‌నగర్‌లోని మంజునాథాలయంలో, తిమ్మాపూర్‌లోని మృ త్యుంజయాలయంలో శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, నీటి, విద్యుత్, తదితర సౌకర్యాలను ఏర్పా ట్లు చేశారు. దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడంతో శివాలయాలన్ని కిటకిటలాడాయి. వేములవాడలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. కరీంనగర్‌లోని గౌరీ శంకరాలయంలో మంత్రి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు పలువురు ఉన్నారు. అలాగే మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పూజలు చేశారు. మొత్తం మీద శివరాత్రిని పురస్కరించుకుని క్షైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగగా, భక్తులు పులకించిపోయారు.
నీలకంఠుడికి ..నీరా‘జనాలు’
* మూడులక్షల మంది భక్తుల రాక
వేములవాడ / వేములవాడరూరల్, ఫిబ్రవరి 24: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శైవక్షేత్రంలో శివరాత్రి వేడుక శుక్రవారం అత్యంతవైభవోపేతంగా కన్నుల పండువగా జరిగింది. శివనామస్మరణలో రాజన్న క్షే త్రం పులకించింది.శ్రీ రాజరాజేశ్వరు డు భక్తుజనులతో నీరాజనాలు అందుకున్నారు. వేములవాడ పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. సుమారుగా మూడు లక్షల మంది భక్తులు రాజన్నను సేవించారు. మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరకు రెండు రోజూ శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావటంతో ఆలయ పరిసర ప్రాంతాలు,ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి.
స్వామివారికి
పట్టువస్త్రాల సమర్పణ
రాజరాజేశ్వర స్వామివారికి ప్రభు త్వం తరుపున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ఉదయం పట్టువస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు,సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంగనర్ ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్,జడ్పీ చైర్మన్ తుల ఉమ, నగర పంచాయితీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, మాజీ ఉత్సవ కమిటీ సభ్యులు పీచర్‌భాస్కర్‌రావు, ప్రసాదరావు, ముప్పిడి సునందశ్రీనివాస్ తదితరులు ధర్మకర్తల మండలి సమావేశ హాలు నుంచి శాస్త్రోక్తంగా ఆయన పట్టువస్త్రాలను శిరస్సు పై పెట్టుకొని కోవెలలో కొలువుదీరిన స్వామివారికి సమర్పించారు.
దర్శించుకున్న ప్రముఖులు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపి వినోద్‌కుమార్, రవాణా శాఖ కమీషనర్ సందీప్‌కుమార్ సుల్తానీయా,టిటిడి సంయుక్త కార్యనిర్వాహకాధికారి శ్రీనివాసరాజు,మాజీ ఎంపిపొన్నం ప్రభాకర్‌లు శుక్రవారం స్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణమండపంలో వారికి అర్చకులు ఆశీర్వదించగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు,ఆలయ ఇవో రాజేశ్వర్ నంది ప్రతిమలను అందజేశారు.
ప్రత్యక్ష ప్రసారాలు
వేములవాడ, ఫిబ్రవరి 24 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం జరిగిన అన్ని ప్రత్యేక కార్యక్రమాలను దూరదర్శన్‌తోపాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా పలు ప్రైవేటు చానళ్లు ప్రత్యేక ప్రసారాలు చేశాయి. ఉదయం జరిగి న పూజలతో పాటు, మహాలింగార్చన, లింగోద్భవం, జాగరణల కార్యక్రమాలను నేరుగా ప్రసారం చేశారు. ఇంట్లో ఉండి శివరాత్రి వేడుకలను ప్రేక్షకులు, భక్తులు కన్నులపండువగా చూసి తరించారు.
ముగిసిన శివదీక్షలు
వేములవాడ, ఫిబ్రవరి 24 : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిథిలో 41రోజుల మండల, 21 రోజుల అర్థ మండల శివదీక్షలు చేపట్టిన శివస్వాములు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తమ దీక్షలను విరమించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పట్టణ వీధులలలో ఓం నమఃశివాయ అంటూ నినాదాలు నృత్యాలు చేస్తు కోలహలంగా ఆలయంలోనికి చేరుకుని తమ దీక్షలను విరమించారు.
మహాలింగార్చన
స్వామివారి సన్నిధానంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా కల్యాణ మండపంలో మహాలింగార్జన అత్యం త వైభవోపేతంగా శుక్రవారం సా యంత్రం జరిగింది వేదపండితులు, అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 365 మృత్తికను లిం గాకారంలో చేసి వేదపండితులు ఆ మహాదేవున్ని ఆవాహనంగావించారు.
భక్తుల జాగరణ
వేములవాడరూరల్, ఫిబ్రవరి 24 : వేములవాడలో శివరాత్రి జాగరణలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రికి వివిధ ప్రాం తా ల నుండి తరలివచ్చిన భక్తులు వసతి గృహాలను దొరకనప్పటికీ, వారువిడిది చేసిన ఖాళీస్థలంలోనే గండాలు పోవాలని శివున్ని మనసులో స్మరించుకుంటూ దీపాలు వెలిగించి రాత్రంతా జాగరణ చేశారు. శివరాత్రి రోజున జాగరణ ఉంటే 366 రోజుల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అత్యద్భుత ఆలయంగా తీర్చిదిద్దుతాం
దేశంలోనే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని అత్భుత దేవాలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం మహాశిరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించాక ఆయన విలేఖరులతో మాట్లాడారు. రానున్న రెండు సంవత్సరాల కాలంలో ఈ దేవాలయాల రూపురేఖలు ఊహించనతంగా మారుతాయని,పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.యాదాద్రి మాదిరిగానే రాజాద్రి కూడా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.రాజన్న ఆలయంతో పాటు ధర్మపురి,కాళేశ్వరాలయాల అభివృద్ధికి సీఎం తగిన నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండి,ప్రజలందరూ సిరిసంపదలతో తులతూగాలని ఆ ఆది దేవుడిని వేడుకున్నట్లు చెప్పారు.
సుల్తానాబాద్‌లో..
సుల్తానాబాద్: మహాశివరాత్రి వేడుకలు వాడవాడలా శుక్రవారం వైభవంగా జరిగాయి.. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగాయి.. ఆలయాల వద్ద గంటల తరబడి భక్తులు బారులు తీరారు. మహాశివుడి దర్శనం చేసుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగాయి. భక్తులు నిష్ఠాప్రతిష్టలతో ఉపవాసదీక్షలు చేశారు. రాత్రంతా జాగరణలు చేశారు. సుల్తానాబాద్ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లోనూ శివరాత్రి వేడుకలు, శివపార్వతుల కల్యాణ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భక్తులతో దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. పూజారులు రమేష్, మహేష్, శ్రావణ్, చంద్రశేఖర శర్మతో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు, కల్యాణ వేడుకలను ఘనంగా జరిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పెద్దపల్లిలో ఎమ్మెల్యే దంపతుల పూజలు
పెద్దపల్లి రూరల్: శివరాత్రి పర్వదిన వేడుకలు పెద్దపల్లి మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చాలామంది శివ భక్తులు ఉపవాసాలు, రాత్రి జాగారం తో శివనామ స్మరణతో గడిపారు. శివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాల్లో భక్తులతో సందడి వాతావరణం నెలకొన్నది. మండలంలోని ముత్తారం గ్రామ సమీపంలోని గుట్టపై వెలసిన ప్రాచీన చరిత్ర కలిగిన ముక్తేశ్వరస్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రాగినేడు, పెద్దకల్వల, మూలసాల గ్రామాల్లోని శివాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో పార్వతీ, పరమేశ్వర కల్యాణం కన్నుల పండువుగా నిర్వహించారు. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామ శివారులోని పురాతన చరిత్ర కలిగిన జీల్గుల మల్లికార్జునస్వామి దేవాలయంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెం ట స్థానిక ఎంపిపి సందనవేన సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాస రి వెంకటరమణారెడ్డి, స్థానిక సర్పం చు పాలేటి కవిత, ఎంపిటిసీ శారద తదితరులు ఉన్నారు. కాగా, ఆయా దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల్లో భక్తుల కోసం నిర్వాహుకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే రాత్రి వేళలో శివుడి లీలలు తెలిపే పురాణ గాథలు, హరికథ కాలక్షేపం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
చందుర్తిలో..
చందుర్తి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి, రుద్రంగి మండలాలలో శివాలయా లు భక్తులతో కిటకిటలాడాయి. ఎన్గల్ శివాలయంలో మహాలింగార్చన, పల్ల కీ సేవ, భజన, నగర సంకీర్తన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో శివభక్తులు కాలినడకన వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకొని శివ దీక్ష విరమణ చేశారు. అలాగే రుద్రంగి బుగ్గ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానాల శంభు లింగేశ్వరాలయంలో నవగ్రహాల పూజ, యజ్ఞం కార్యక్రమాలను నిర్వహించారు.
గంగాధరలో..
గంగాధర: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు తరలిరావడంతో ఆలయాలు శివనామస్మరణతో కిటకిటలాడాయి. మండలంలోని న్యాలకొండపల్లి సహస్రలింగేశ్వర ఆలయంలో శివకల్యాణ మహోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించగా, వేలాది మంది భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్ గున్నాల రాజశేఖర్ దంపతులు శివకల్యాణం మహోత్సవాన్ని నిర్వహించగా కెడిసిసి డైరెక్టర్ వెలిచాల తిరుమల్ రావు, మార్కెట్ కమిటి చైర్మన్ రేండ్ల పద్మ, సర్పంచ్ ఉప్పుల అంజలిలు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే మండల కేం ద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, గర్శకుర్తి మార్కండేయ దేవాలయం, బూరుగుపల్లి మార్కండేయ దేవాలయం, కోట్లనర్సింహులపల్లి గ్రామంలోని శ్రీ నందగిరి వీరభద్ర స్వామి ఆలయలలో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకొని దైవదర్శనం చేసుకున్నారు.
చొప్పదండిలో..
చొప్పదండి: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం చొప్పదండి పట్టణంలోని శివకేశవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్దఎత్తున వేలాది మంది తరలివచ్చి శివకేశవాలయంలో దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సాయంత్రం రాష్ట్రం లో ఎక్కడా లేనివిధంగా చొప్పదండిలో శివకేశవుల ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో శివకేశవుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ శివకేశవాలయంలో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం శివకేశవులకు పట్టు వస్త్రాలను స్థానిక సర్పంచ్ ఆరెల్లి శ్రీలక్ష్మి-చంద్రశేఖర్‌లు తాళమేళాలతో ఇంటి వద్ద నుండి దేవాలయంలోకి తీసుకువచ్చారు. శివకేశవుల కల్యాణ మహోత్సవంలో జడ్పీటిసి ఇప్పనపల్లి సాంబయ్య, గొల్లపల్లి శ్రవణ్‌కుమార్, పూసాల భూమేశ్వర్ దంపతులు కూర్చొని శివకల్యాణంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా అర్చకులు, వివేకానంద యూత్ క్లబ్ సభ్యులు అన్ని ఏర్పాట్లను నిర్వహించగా ఎస్‌ఐ చంద్రశేఖర్ సిబ్బందితో పర్యవేక్షించారు. కార్యక్రమంలో పూజారులు తమ్మల సత్యనారాయణ, సింహాచలం జగన్‌మోహన్, మురళి, దూస రాము, ఎ.లక్ష్మీనారాయణ, మామిడాల నిరంజన్, గోగులకొండ ప్రదీప్, శివకుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ధర్మపురిలో ...
ధర్మపురి: దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, రాష్ట్రంలో మిగుల ప్రాచు ర్యం పొందిన సనాతన సాంప్రదాయాల సిరియైన పవిత్ర గోదావరినదీ తీరస్థ తీర్థమైన ధర్మపురి క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మునె్నన్నడూ లేని విధంగా, పర్వదిన సందర్భంగా శుక్రవారం సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన అశేష భక్తజన సందోహంతో, సనాతన క్షేత్రం అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రంలోని సుదూర ప్రాం తాల నుండి తరతరాల వారసత్వ ఆచరణలో భాగంగా శ్రీరామలింగేశ్వర దర్శనార్థం ప్రత్యేక ప్రయివేటు వాహనాలలో గురువారం రాత్రినుండే క్షేత్రానికి చేరుకున్న భక్తులు, యాత్రికులు శుక్రవారం ఉదయాత్పూర్వం నుండి పవిత్ర గోదావరిలో షవర్ల కింద మంగళ స్నానాలు ఆచరించారు. శ్రీరామలింగేశ్వర, అక్కపెల్లి రాజేశ్వర, మార్కండేయ, గౌతమేశ్వరాలయాలలో మరియు శివ పంచాయతనాల ముందు దైవదర్శనార్థం బారులుతీరి వేచి ఉండి భక్తి శ్రద్ధలతో అభయంకరుడు, అభిషేక ప్రియుడైన శంకరునికి ప్రత్యేక పూజలొనరించారు. దేవస్థానం ఎసి, ఇఓ సుప్రియ, మార్గదర్శకత్వంలో, దేవస్థానం వేదపండితులు బొజ్జా రమేశ్ శర్మ, ఆలయ అర్చకులు దేవళ్ళ విశ్వనాథశర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, స్థానిక వేదపండితులచే శ్రీరామ లింగేశ్వరాలయ అంతర్గత శృంగేరీ శంకరాచార్య బహూకృత, స్థాపిత శారదామాత, అదిశంకర భగవత్పాదుల మందిరంలో సామూహక రుద్రాభిషేకాలు, మంత్రపుష్ప నీరాజనాది అర్చనలు, విదివిధాన పూజలు గావించారు. క్షేత్ర సమీపస్థ అక్కపెల్లి రాజేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానంలో అర్చకులు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. పండితులు శివ మహాత్మ్యంను వివరించారు. ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, ఎంపిపి ఉపాధ్యక్షులు రాజేశ్‌కుమార్, మాజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్‌లు దినేశ్ శర్మ, అక్కనపెల్లి రాజేందర్, రంగా అశోక్, అక్కపెల్లి రాజేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్‌లు రాపర్తి నర్సయ్య, సుదవేని నర్సాగౌడ్, గంగారాం, ఆనంద్, శ్యాం, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్లు భీమయ్య, మల్లేశం, భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్, బిజెపి మం డల అధ్యక్షులు ఎల్లాగౌడ్, బండారి లక్ష్మణ్, మాజీసర్పంచ్ సంగి కిష్ట య్య, సర్పంచ్ సత్తమ్మ, ఉపసర్పంచ్ ఐ.రామయ్య తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. స్థానిక మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయగా, ఆర్యవైశ్య, వర్తక సంఘం అధ్యక్షులు మురికి శ్రీనివాస్, రవీందర్, రాజేందర్‌ల నేతృత్వంలో, పంచాయతీ కార్యాలయ నంది విగ్రహ కూడలి నుండి రాజేశ్వరాలయానికి వాహనాలను ఉచితంగా ఏర్పాటు జేసి, ప్రయాణ సౌకర్యాలు కల్పించి, ప్రశంసాపాత్రులైనారు. గోదావరీతీరస్థ మార్కండేయ మందిరాన పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో బిల్వపత్ర, ప్రత్యేక పూజలొనరించారు. ఊహించని రద్దీ పెరిగి, దేవాలయ రోడు భక్తులతో నిండి, పోలీసుల కొరతతో రద్దీ క్రమబద్దీకరణ కష్ట సాధ్యమైంది. ధర్మపురి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.
ధర్మపురిలో ఆధ్యాత్మికశోభ
దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా, గంభీర గౌతమీ తటమున వెలసి, వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా, నిత్య భక్తజన సందడితో అలరారుతున్న ధర్మపురి క్షేత్రం, శివరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా, అపర కైలాసపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలలనుండేగాక, రాష్ట్రేతర సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ ఆచారంలో భా గంగా దైవ దర్శనాభిలాషులై ఏతెంచిన భక్తజన బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవాద్యాలు, విధివిధాన వేదోక్త పూజలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. పిల్లాపాపలతో, నెత్తిన మూటాముల్లెలతో, పవి త్ర గోదావరి స్నానాలాచరించి, దైవ దర్శనాలు చేసుకుని, తమ మొక్కులు చెల్లించడానికి గురువారం రాత్రినుండే ఏతెంచిన భక్తుల, యాత్రికులతో శుక్రవారం ప్రాచీన క్షేత్రం అశేష జనసంద్రమైంది. సెలవుదినాన్ని పురస్కరింకుని క్షేత్రానికి అరుదెంచిన భక్తుల వెల్లువ పుష్కరాల సమయాన్ని తలపించింది. ప్రధాన రహదారి నిండి పోయి రాకపోకలు స్థంభించిన వేళ, క్యూలైన్లను శివాలయం వైపుకు మళ్లించే చర్యలు చేపట్టడం శక్తికి మించిన భారమైంది. రద్దీని క్రమబద్ధీ కరించడంలో తీవ్రవైఫల్యం చెందారు.
పట్టువస్రాలు
సమర్పించిన రసమయి
మానకొండూర్: శివరాత్రి మహోత్సవం సందర్భంగా శుక్రవారం మానకొండూర్ కేంద్రంలోని వెంకటేశ్వర్ల స్వామి, వెల్దిలో శ్రీ చేన్నకేశవ ఈశ్వరస్వామి, గంగిపల్లిలో శ్రీ మల్లిఖార్జున స్వామి, ఈదులగట్టెపల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, అన్నారం, కొండపల్కల, గట్టుదుద్దనపల్లి, లింగాపూర్ గ్రామంలోని దేవాలయంలో శివపార్వతిల కళ్యాణం మహోత్సవం అత్యం త వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. మానకొండూర్, లిం గాపూర్, ఈదులగట్టెపల్లి, గంగిపల్లి, కొండపల్కలలో కల్యాణం మహోత్సవంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. గంగిపల్లిలో శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం మహోత్సవానికి పట్టువస్త్రాలను అధికారికంగా సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలను చేపట్టారు. రసమయి బాలకిషన్‌కు ఆలయ ధర్మకర్త రెడ్డి సంపత్ రెడ్డి, పోల్సాసాని దేవెందర్‌రావు ఘనంగా స్వాగతం పలికారు. శివపార్వతుల కల్యాణం తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడినాయి. కరీంనగర్ రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వ ర్లు కుటుంబ సభ్యులతో కలిసి ఈదులగట్టెపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. గంగిపల్లిలో మహిళల కోల ఆటలు పలువురి అకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జీవి రామక్రిష్ణారావు, జడ్పిటిసి ఎడ్ల సుగుణాకర్, వైస్‌ఎంపిపి దేవ సతీష్ రెడ్డి, లింగపూర్ పోల్సాని ట్రస్టు చైర్మన్ దేవేందర్‌రావు, గంగిపల్లి ఆలయ ధర్మకర్త రెడ్డి సంపత్ రెడ్డి, బెడద ప్రభాకర్, మాజీ మండల అధ్యక్షుడు శాతరాజు యాదగిరి, సర్పంచ్ వాల ప్రదీప్‌రావు, మీస వౌనిక, బాకారపు శ్రీనివాస్, సదా నందం, పితాంబర్, సుజాతరెడ్డి, ఎం పిటిసిలు రెడ్డి లావణ్య, స్వామి, సుమలత, శంకర్, ఒసి జేఎసి రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు, పోలాడి వంశీదర్‌రావు, ఇడుమాల సంపత్, పారిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి శ్రీపతిరెడ్డి, ఈవోపిఆర్‌డి దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిలో..
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రలోని శివాలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు వేకువజామునే మహాశివుని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు శివునికి ఆభిషేకాలతో పాటు పత్య్రేక పూజలు చేశారు. వేకువజామునుండే భక్తులు శివాలయం వద్ద భక్తులు బారులుతీరారు. ఓం నమశ్వివాయ: అనే నామస్మరణతో ఆలయం మార్మోగింది. పెద్దపల్లిలోని శివాలయంలో మాజి ఎమ్మెల్యే విజయరమణారావు మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఉప్పు రాజు, శ్రీనివాస్, జగదీష్, అక్కపాక తిరుపతి, కొల ప్రశాంత్, రాజు,ఉప్పు రమేష్, సంపత్ పాల్గొన్నారు.