కరీంనగర్

2019లో బిజెపిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, ఫిబ్రవరి 26: రానున్న 2019లో ప్రజల ఆదరణతో బిజెపి అధికారం చేపట్టనుందని బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరా చారి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో బిజెపి యువమోర్చా అధ్యర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా భాస్కరాచారి హాజరయ్యారు. ముందుగా లక్ష్మిపూర్‌లో రాపాక ప్రవీణ్, రాపాక లక్ష్మణ్ ఆధ్వర్యంలో వివిధ పార్టిల నుంచి 40 మంది యువకులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా రంగు మాట్లాడుతూ దేశంలో యువకులు మోదీ వైపు చూస్తున్నారు అని తెలిపారు. కార్యక్రమంలో మం డల అధ్యక్షుడు బొంగోని శ్రీనివాస్, మండల యువమోర్చా శీలం కుమార్ యాదవ్, రాపాక ప్రవీణ్, అంబడి తిరుపతి రాజు, ఎరుకొండ సంపత్, యువకులు పాల్గొన్నారు.
ఆధార్ కార్డుల తప్పుల సవరణకు
డిజిధన్ మేళాలో ఏర్పాట్లు

* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

ముకరంపుర (కరీంనగర్), ఫిబ్రవరి 26: మార్చి 1న ఇండోర్ స్టేడియం పక్కన పెద్దఎత్తున డిజి ధన్ మేళ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ఆధార్ కార్డులలోని తప్పుల సవరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పాల్గొని తమ ఆధార్ కార్డులలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సవరించుకోవచ్చునని తెలిపారు. బ్యాంకుల ద్వారా ఖాతాలు లేని వారికి కొత్త బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నగదును తక్కువగా ఉపయోగించుకోవడానికి, డిజిటల్ లావాదేవీలపైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ స్టాల్స్ ఏర్పాటు చేసి డిజిటల్ లావాదేవీలపై వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తాయని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను సాంస్కృతిక సారథి బృందాలచే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.