కరీంనగర్

వితంతువులపై చిన్నచూపు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఫిబ్రవరి 26: నేటి ఆధునిక కాలంలో వితంతువులను చిన్నచూపు చూడడం తగదని, వారిపై వివక్ష మానుకోవాలని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో ఆదివారం బాల వికాస ఆధ్వర్యంలో వితంతువుల హక్కుల పరిరక్షణ అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రతి నిమిషానికి 70 మంది వరకు వివిధ కారణాలతో చనిపోతున్నారని, తద్వారా చాలామంది వితంతువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల్లో కూడా చాలా మంది మద్యానికి బానిసై చనిపోతున్నరని వారి భార్యలు కూడా వితంతువులుగా మారుతున్నారని తెలిపారు. వితంతువులు గతంలో ఎంతో వివక్షకు గురయ్యారన్నది వాస్తవమన్నారు. పూర్వ కాలంలో సతీ సహగమనం వంటివి కూడా జరిగేవన్నారు. కానీ కాల క్రమేణా ప్రజల్లో చైతన్యం, అవగాహన వచ్చాయని, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, సమాజం కూడా మారిందన్నారు. వితంతువులు కూడా సాధారణ మహిళలనే విషయాన్ని, వారు కూడా ఉద్యోగాలు చేయొచ్చు, స్వయం ఉపాధి పొందవచ్చు అందరు గుర్తుంచుకోవాలన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెం పొందే విధంగా అందరు ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్‌రాయ్ వంటి మేధావులు మహిళల స్వేఛ్చ, వితంతు పునర్వివాహం వంటి వాటిని వెలుగులోకి తెచ్చారని, ప్రోత్సహించారని గుర్తు చేశారు. భర్తలు వివిధ కారణాలతో మరణిస్తే జీవితాంతం వితంతువులుగా జీవించే విధానానికి మహిళలు స్వస్తి చెప్పాలని, వారి పిల్లల, వారి భవిష్యత్తు కోసం పునర్వివాహం చేసుకుంటే తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వితంతువులకు కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించే విషయాన్ని సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఇప్పటికే నిరుపేదలైన వితంతువులకు తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు. వితంతువుల పిల్లలు మోడల్ స్కూళ్లలో చదువుకునే అవకాశం ఉందన్నారు. రాబోయే బడ్జెట్‌లో వితంతు మహిళలకు ప్రత్యేక పథకం కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాల్లో వితంతువుల సంతానానికి ప్రాధ్యాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో నగర పంచాయతీ ఛైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ ఛైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, స్పందన సొసైటీ అధ్యక్షురాలు అనుమళ్ల శోభారాణి, బాల వికాస ప్రతినిధులు టిఆర్‌ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.