కరీంనగర్

సర్వం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 28: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి 19 వర కు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ అంతా సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 81,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరికోసం మొత్తం 117 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. కరీంనగర్ జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 18, 234 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 19,722 మంది విద్యార్థులకు గాను 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 11 కేంద్రాలు ప్ర భుత్వ కళాశాలల్లో, 32 కేంద్రాలు ప్రైవే టు విద్యాసంస్థలు, నాలుగు కేంద్రాలు సాంఘిక సంక్షేమ, మోడల్ పాఠశాలలున్నాయ. అలాగే జగిత్యాల జిల్లా లో మొదటి సంవత్సరం పరీక్షలకు 9,560 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 8,309 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం జిల్లా లో 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 16 కేంద్రాలు ప్ర భుత్వ కళాశాలల్లో, 10 ప్రైవేటు విద్యాసంస్థల్లో, నాలుగు మోడల్ పాఠశాలల ను ఏర్పాటుచేశారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 8,308 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 7,026 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, వీరికోసం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 14 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, 8 కేంద్రాలు ప్రైవేటు విద్యాసంస్థల్లో, రెండు కేంద్రాలు మోడల్ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొదటి సంవత్సరం 5,463 మంది, ద్వితీయ సంవత్సరం 4,511 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరికోసం జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 9 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, 7 కేం ద్రాలు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 9వ తేదీన జరగాల్సిన పరీక్షను 19వ తేదీన నిర్వహించనున్నారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్ప ష్టంచేశారు.
గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు 10 సిట్టింగ్, 8 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. వీరితోపాటు పరీక్షా కేంద్రానికి ఇన్విజిలేటర్లను నియమించారు. కేంద్రాలకు కిలోమీటరు వరకు జిరాక్స్ షాపులను మూసివేయనున్నారు. ఈ సారి కొత్తగా పరీక్షా కేంద్రానికి చేరుకునే దారిని చూపెడుతూ ఒక యాప్‌ను కూడా ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను పోలీస్ శాఖ 144 నిషేదాజ్ఞలతోపాటు పటిష్ట పోలీసు బందోబస్తు చేపట్టనుంది.