కరీంనగర్

నేరాల నియంత్రణకు ‘హాక్ ఐ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఫిబ్రవరి 28: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, నేరాల నియంత్రణకు గాను ‘హాక్ ఐ’ మోబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నార్త్ జోన్ ఐజిపి నాగిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ ఠాణాను మంగళవారం రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గాల్‌తో కలిసి ఐజిపి నాగిరెడ్డి హాక్ ఐ మోబైల్ యాప్‌ను ప్రారంభించారు. అలాగే పోలీస్ స్టేషన్ తనిఖీతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అలాగే పోలీస్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం విద్యార్థులు, యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ మీ ప్రాంతంలో ఏదైనా అరాచకం, గొడవ, ఇతర సంఘటనలు జరిగినప్పుడు ఈ యాప్‌లో ఎంటర్ చేయగానే వెంటనే పోలీసులు స్పందిస్తారని తెలిపారు. ఈ యాప్‌ను అందరు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ తయారు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మోబైల్ యాప్‌కు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కరపత్రాలలో మహిళల సురక్షిత ప్రయాణాల గురించి, ఎస్‌ఓఎస్ బటన్, ట్రాఫిక్ ఉల్లంఘన, మహిళలకు సంబంధించిన నేరాల గురించి పోలీసుల ఉల్లంఘనలు, యాప్, పోలీసులు చేసే మంచి పనుల గురించి సమాచారంతో పాటు అన్ని సమాచారాలను తెలుపవచ్చని కరపత్రాల్లో వివరించారు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఆన్ రైడ్ మోబైల్ యూజర్స్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అదేవిధంగా ఐ.ఒఎ.స్ వినియోగదారులు యాపిల్ స్టోర్ ద్వారా డౌన్‌లోడు చేసుకోవచ్చునని, హాక్ ఐ రామగుండం పోలీస్ అని క్లిక్ చేసి ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో రామగుండం పోలీస్ కమీషనర్ విక్రం జిత్ దుగ్గాల్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పోలీసుల ఆధ్వర్యంలో కొత్త యాప్‌కు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు గాను కృషి చేస్తున్నామని, ప్రజలు ఈ హాక్ ఐ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి డిసిపి విజేందర్‌రెడ్డి, మంచిర్యాల డిఎస్పీ జాన్‌వెస్లీ, పెద్దపల్లి ఎసిపి సింధు శర్మ, గోదావరిఖని ఎసిపి అపూర్వ, స్థానిక సిఐ అడ్లూరి రాములు, పెద్దపల్లి సిఐ మహేష్, ఎస్‌ఐలు బి.జీవన్, దేవేందర్‌తో పాటు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
30 నెలల్లో .. 60 వేల కోట్ల అప్పు
* దళితులు, ముస్లింలను మోసపుచ్చుతున్న సిఎం
* జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 28: సిఎం కెసిఆర్ 30 నెలల్లోనే 60 కోట్ల అప్పు చేశారని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ హాయంలోనే ఇలాగే అధికారంలో కొనసాగితే 2019 వరకు పుట్టిన ప్రతి బిడ్డపై అప్పు ఉంటుందన్నారు. మంగళవారం జగిత్యాలలో జరిగిన జన ఆవేదన సభలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ అప్పు 120 కోట్లని, 2019 వరకు సిఎంగా కెసిఆర్ కొనసాగితే పుట్టే ప్రతి బిడ్డకూ రెండు కోట్ల అప్పుతో పుడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌కు అధికారం ఇవ్వలేదని, దళితున్ని సిఎం చేస్తానంటే ఇచ్చారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎపి సిఎం చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారని వివరించారు. సదస్సులో కొత్త మోహన్, బండ శంకర్, గిరి నాగభూషణం, దామోదర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, ఎంపిపి గర్వందుల మానస, గోపి మాధ వి, భూక్య సరళ, తైదల శ్రీలత, వీరబత్తిని శోభారాణి, వీరభత్తిని పద్మ ఎల్లారెడ్డి, గర్వందుల నరేష్‌గౌడ్, రవీందర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.