కరీంనగర్

2019లో టిడిపిదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఫిబ్రవరి 28: రాను న్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిదే విజయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి సమన్వయకమిటీ సమావేశం మండల అధ్యక్షుడు పాల రామారావు అధ్యక్షతన జరిగింది. సమావేశం లో విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల కారణం గా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఇంటి కో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమితో పాటు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. నిరుద్యోగ యువకులు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడం సహించరానిదన్నారు. కెసిఆర్ ఇంటి లో నాలుగు ఉద్యోగాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా... పట్టించుకునే వారు లేరన్నారు. అలాగే కాలువ నీరందక చివరి పంటలు ఎండిపోతున్నాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు 14 వేలకు పైగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా నాయకులను అభినందించారు. గ్రామ కమిటీలు వేయటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సమావేశంలో రాష్ట్ర నేత గంట రాము లు, జిల్లా అధికార ప్రతినిధి సాయిరి మహేందర్, సింగిల్‌విండో చైర్మన్ కల్లెపల్లి జానీ, నాయకులు ఉప్పు రాజు, శ్యామ్, రాజేశ్వర్‌రెడ్డి, వెగోళం అబ్బ య్య, కుమార్ కిషోర్, ఎపి.మధు, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, శంకర్, మోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి పలువురు పాల్గొన్నారు.
డిజిధన్ మేళాకు ఏర్పాట్లు పూర్తి
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్, ఫిబ్రవరి 28: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహిస్తున్న డిజి ధన్ మేళాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో డిజి ధన్ మేళా నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వం నగదురహిత లావాదేవీలు వందశాతం నిర్వహించేందుకు కృతనిశ్ఛయంతో ఉం దన్నారు. అందులో భాగంగానే ప్రజలకు నగదురహిత లావాదేవీల నిర్వహణకై అవగాహన కల్పించేందుకు ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు బ్యాంకర్లకు సంబంధించి 62 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ బ్యాంక్ అధికారులు వారి బ్యాంకుల ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీలు, మోబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఫ్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సంబంధిత బ్యాంకర్లు, అధికారులు స్టాల్స్‌లో ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి మేళాను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వర్‌రావు, ఆం ధ్రాబ్యాంక్ డిజిఎం శేషగిరిరావు, ఎస్‌బిఐ ఆర్‌ఎం శోభ, ఎస్‌బిహెచ్ ఆర్‌ఎం గంగాధర్, ఇతర బ్యాంక్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు వేగవంతం చేయాలి
* జాబు కార్డు
కలిగిన వారందరికీ పని కల్పించాలి
* విధుల్లో నిర్లక్ష్యం చేస్తే.. కఠిన చర్యలు
* జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య హెచ్చరిక
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 28: రబీ పంట కాలం వ్యవసాయ పనులు తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామి పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కందుకూరి అంజయ్య సూచించారు. మార్చి 31వ తేదీ లోగా నిర్ధేశిత 13 లక్షల పని దినాలు పూర్తి చేసేందకు అందరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్ధేశిత లక్ష్య సాధనలో విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ సముదాయంలో గల తన కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పథకం పనులపై జిల్లా పరిధిలోని టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో ఉపాధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 23 లక్షల పని దినా లు చేయాల్సి ఉండగా, ఇటీవల వాటిని 32.60 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటికీ 19 లక్షల పని దినాలు పూర్తి చేసుకున్నా, నెల మాత్రమే గడువు ఉండటం వల్ల అదనంగా ఇచ్చిన పని దినాల లక్ష్యాన్ని అంకిత భావంతో పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ప్రస్తుతం మార్చి నెలలో 13 లక్షల పని దినాలు పూర్తి చేయడానికి కార్యచారణ రూ పొందించాలన్నారు. జిల్లా పరిధిలో 203 గ్రామాలు ఉండగా, ఒక్కో గ్రా మంలో రోజు 300 మందికి 25 రోజుల పాటు పని కల్పిస్తే సునాయాసంగా లక్ష్యం చేరవచ్చన్నారు. జాబు కార్డు కలిగిన కుటుంబాలలో కనీసం 60 శాతం కుటుంబాలకు పని కల్పించాలన్నారు. ఇప్పటికే గుర్తించిన పనులతో పాటు వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సమావేశంలో ఇజిఎస్ ఎపిడి భావన రుషి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
సెక్యూలర్ ఆదర్శాలతోనే
కాంగ్రెస్ ముందుకు : శ్రీ్ధర్‌బాబు
జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 28: సెక్యులర్ ఆదర్శాలతోనే కాంగ్రెస్ పార్టీ ముం దుకెళ్తుందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు అన్నారు. మంగళవారం సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నిర్వహించిన జన ఆవేదన సభకు శ్రీ్ధర్‌బాబు హాజరై మాట్లాడుతూ నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, కనీసం కేంద్ర మంత్రి వర్గానికి కూడా తెలియచేయకుండా రాత్రికిరాత్రే తెరపైకి తెచ్చారన్నారు. దేశంలో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి 3 యేళ్లు గడుస్తున్నా.. లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బిజెపి మతం పేరుతో ప్రాంతాలను విడగొట్టాలని చూస్తోందని, కాశ్మీర్ నుండి కన్యాకూమారి వరకు ఇదే తరహాలో పని చేస్తుందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ 3 యేళ్లలో కేవలం 4వేల ఉద్యోగాలనే భర్తీ చేశారన్నారు. మంత్రి వర్గంలో ఇంత వరకు మహిళలకు స్థానం కల్పించలేదన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజం, మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, ఎంపిపి గర్వందుల మానస, జడ్‌పిటిసి భూక్య సరళ, గోపి మాధవి, తైదల శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.