కరీంనగర్

ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్, మార్చి 5: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న తమపై అకారణంగా ధర్మారం ఎస్సై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ బొంపె లికి చెందిన అరికిల్ల దేవేందర్, శ్యామ ల అనే దంపతులు ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల రాజీవ్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. వీరికి గ్రామానికి చెం దిన దళితులతోపాటు ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. ఎస్‌ఐపై చ ర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చే శారు. అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్, పెద్దపల్లి ఎస్సైలు శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్ రాస్తారోకో చేస్తు న్న ప్రజాసంఘాల నేతలు బొంకూరి సురేందర్ (సన్నీ), పల్లె సదానందం, అక్కపాక తిరుపతి, గోపి, సీపెల్లి రవీందర్, మహంత, లెనిన్‌తోపాటు తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దంపతులు దేవేందర్, శ్యామ ల మాట్లాడుతూ శనివారం రాత్రి 9 గంటల సమయంలో తాము పొలానికి నీరు పెట్టడానికి పిల్లలతో సహా వెళ్లగా, అటుగా వస్తున్న ధర్మారం ఎస్సై హరిబాబు రాత్రివేళ ఇక్కడ ఏమి చేస్తున్నారని అడగగా, తాము పొలానికి నీరు పెట్టడానికి వచ్చామని చెప్పినా.. వినకుండా అకారణంగా నానా భూతులు తిడుతూ కొట్టాడని ఆరోపించారు. కా గా, దంపతులు పొలం పనులకు వెళ్లలేదని, పెద్దపల్లి-్ధర్మారం ప్రధాన రహదారిపై ఆ టోలో పిల్లలతో ఉండగా, రాత్రిపూట ఇక్కడేమి చేస్తున్నారని, మేము ధర్మారం పోలీసులమని చెప్పి నా వినకుండా దురుసుగా ప్రవర్తించడంతో వారిని పెద్దపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చినట్లు, ఈ క్రమంలో శ్యామ ల రోడ్డుపై పడడంతో గాయాలయ్యాయని, వారిని కొట్టలేదని ధర్మారం ఎస్ ఐ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా పోలీసుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన దంపతులపై కేసు నమోదు చేసినట్టు పెద్దపల్లి ఎస్సైశ్రీనివాస్ తెలిపారు.