కరీంనగర్

తిమ్మాపూర్ మండలానికి రూ. 2 కోట్ల్ల నిధులు: రసమయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, మార్చి 5: తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామంలో రూ. 2 కోట్లు నిదిలతో ప్రభుత్వం అభివృద్ధి పనులను చేసిందని రానున్న రోజుల్లో గ్రామల అభివృద్ధిని చేయడంమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. అదివారం తిమ్మాపూర్ మండల పరిధిలోని నేదునూర్, వచ్చునూర్, గోల్లపల్లి, రేణుకుంట, జూగోండ్ల, రామ్‌హన్‌మన్‌నగర్ గ్రామాల్లో ఎన్‌అర్‌డిఎస్ నిదుల కింద 20 లక్షల రూపాయాలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రసమయి బాలకిషన్ ముఖ్యఅతిదిగా పాల్గొని పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసమయి మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామల అభివృద్ధికోసం ఇప్పటి వరకు 2కోట్లు రూపాయాలను ప్రభుత్వం మంజురు చేసిందన్నారు. నియోజకవర్గ ప్రజలు రానున్న వేసవి కాలంను దృష్టిలో పెట్టుకొని నీటిని అదాచేయాలని అలాగే ఎండ కాలంలో అరోగ్యం పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈనేల 7న, ఎల్‌ఎండి కాలనిలో ఎమ్మెల్యే కార్యాలయం నూతన భవనం కోసం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. రేకుంట గ్రామంలో గ్రామపంచాయితి కార్యాలయంలో అద్వర్యంలో చలివేంద్రాని రసమయి ప్రారంభించారు. వేసవి కాలంలో చలివేంద్రం నిర్వహించే వారు తప్పకుండా మీనరల్ వాటర్‌ను ఉపయోగించాలని తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి పద్మ, ఎంపిడివో శ్రావణ్‌కుమార్, వివిధ గ్రామల సర్పంచ్‌లు, మండల నాయకులు పాల్గొన్నారు.
లఘు చిత్రం ప్రారంభం
కోహెడ, మార్చి 5: రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం కోహెడలో ‘తాయత్తు’ అనే లఘు చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. కోహెడకు చెందిన యువ నిర్మాత రమేష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సన్నివేశాన్ని ఆమె తిలకించారు. కోహెడలోని తమ బంధువుల ఇంటిలో విందు కార్యక్రమానికి హాజరైన ఈమెకు స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి స్వామి, జడ్పీటిసి లక్ష్మణ్, పార్టీ నాయకులు మహేందర్, రాజిరెడ్డి, అంజిరెడ్డి, దర్గారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు రాంచంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు