కరీంనగర్

జగతి మనుగడకు ఆడదే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, మార్చి 7: జగతి మ నుగడుకు ఆడదే ఆధారమని సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గాయత్రి పంక్షన్‌హల్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆడబిడ్డలను కనడానికి ప్రస్తుతం జంకుతున్నారని ఇది శోచనీయమన్నారు. జిల్లా పరిధి లో వెయ్యి మంది పురుషులకు సుమా రు 900మంది మహిళలున్నారని, రా బోయే కాలంలో ఈ పరిస్థితి మరింత విషమించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి కమ్మరి గంగసాయవ్వ, జడ్పీటీసీ మల్లుగారి పద్మ, తహసీల్దార్ ప్రసాద్, ఎంపిడివో వంగ సురేందర్‌రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు, నేతలు పాల్గొన్నారు.
మహిళలు సత్తా చూపాలి
* డివైఎస్‌వో అశోక్‌కుమార్
హుజూరాబాద్: మహిళలు తమ సత్తా చాటాలని జిల్లా యువజన సర్వీసుల అధికారి (డివైఎస్‌వో) అశోక్‌కుమార్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌కుమార్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారు మరింత ముందుకు దూసుకుపోవాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. సమావేశంలో స్పందన సొసైటీ అధ్యక్షురాలు అనుమాండ్ల శోభారాణి, కౌన్సిలర్లు రమాదేవి, వార్డెన్ రాజమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.