కరీంనగర్

రైస్‌మిల్లులపై వరుస దాడులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 10: రైస్ మిల్లులపై నిరంతరం దాడులు కొనసాగుతున్నా మిల్లర్లు, ట్రేడర్లు బియ్యం అక్రమ రవాణా దందాను మార్చుకోలేకపోతున్నారు. రేషన్ బియ్యాన్ని వినియోగదారుల వద్ద దొంగతనంగా, చౌకగా కొని ఆక్రమ వ్యాపారం చేస్తున్నారు. రేషన్ బియ్యం ఆక్రమంగా రవాణ చేస్తే పిడి యాక్డ్ అమలు చేస్తామని హెచ్చరించినా తెగించిన వ్యాపారుల బుద్ధి మారడం లేదు. జిల్లా కేంద్రానికి చెందిన పలువు రు రైస్‌మిల్ యజమానులకు పేదల చౌక బియ్యం అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. రాయితీపై అందిస్తున్న రేషన్ బియ్యాన్ని వినియోగదారుల వద్ద దొంగతనంగా కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న సివిల్ సప్ల యి కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలతో జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లో దాడులు నిర్వహించగా, అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున పిడిఎఫ్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆక్రమంగా రీసైక్లింగ్‌తో ప్రభుత్వానికే మళ్లీ విక్రయించి ఖజానాకు టోపీ పెడుతున్నారని కమిషనర్ ఆనంద్ ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు చేపట్టిన ఈ దాడులతో జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు వెలుగు చూస్తుండడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సివిల్ సప్లయి, ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ఫోర్సు సభ్యులు ఆకస్మికంగా దాడులతో పిడిఎస్ నిల్వలు, రా యికల్‌లోని గజాణన ట్రేడర్స్‌కు ప్రభు త్వం అప్పగించిన కస్టమ్ మిల్లింగుకు ఇవ్వాల్సిన 50 లక్షల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా విక్రయించుకున్నట్లు గుర్తించారు. అలాగే గణేష్ రైస్‌మిల్లుపై దాడి చేయగా 105 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నారు. కస్టమ్ మిల్లింగుకు ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదని, కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎమ్మార్ ధాన్యం కూడా మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో పాటు తాటిపల్లిలోని రాజరాజేశ్వర రైస్‌మిల్లులో తనిఖీకి యత్నించగా, మిల్లుకు తాళం వేసి యాజమాని పరాయినట్లు తెలుసుకుని అధికారులు గుమస్తాతో తాళం తీయిం చి తనిఖీ చేయగా, రూ.1 కోటి విలువైన కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని రైస్‌మిల్లు యాజమాని ఎక్కువ ధరకు విక్రయించుకున్నట్లు నిర్ధారించారు. దాంతో పాటు సివిల్ సప్లయి బియ్యాన్ని కూడా పట్డుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దా దాపు 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. మిల్లువ్యాపారుల అక్రమ దం దాపై ఉన్నతాధికారులకు నివేదించి చర్య లు తీసుకోవాలని ఓఎస్‌డి బి. రాజేశం తెలిపారు. ప్రత్యేక అధికారులు ఎంవి పద్మనాభరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎల్. లక్ష్మణ్ రావు, డిఎస్‌ఓ, ఆర్‌ఐ పాల్గొన్నారు.