కరీంనగర్

బెదిరింపులకు గురిచేస్తే కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 13: రైస్‌మిల్లు వ్యాపారినికి యాంటి కరప్షన్ ప్రెస్‌గా భయంబ్రాంతులకు గురి చేసిన నలుగురు వ్యక్తులను బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అనంతశర్మ తెలిపారు.
సోమవారం డిపిఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో నిందితులైన చంద అనంద్, కంకనాల మహేష్, చంద్రకుమార్, నారాదాసు అనీల్‌పై రైస్‌మిల్లులో ఆక్రమ చొరబాటు, బెదిరింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. రైస్‌మిల్లులో సదరు వ్యక్తులు ఆక్రమంగా చొరబడి తాము యాండి కరప్షర్ ప్రెస్ శాఖకు చెందిన వారుగా పరిచయం చేసుకుని డబ్బులు డిమాండ్ చేయడంతో రూరల్ సిఐకి వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారించి బాధితుడు బట్టు ప్రవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

సోలార్ పరిశ్రమ మాకొద్దు
* రాగినేడు గ్రామస్థుల ఆందోళన * పంచాయతీ సమావేశం అడ్డగింత

పెద్దపల్లి రూరల్, మార్చి 13: సోలార్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రోజురోజుకు ఆందోళన ఉధృతం అవుతోంది. జీవన మనుగడకు ఇబ్బంది కలిగించే దీని ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దని సోమవారం ఉదయం మండలంలోని రాగినేడు గ్రామంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. సోలార్ పరిశ్రమ అనుమతి కోసం సోమవారం గ్రామ పంచాయ తీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయితీ సభ్యుల సమావేశాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇస్తే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని పలువురు హెచ్చరించారు. గతంలో ఈ పరిశ్రమ ఏర్పాటు వద్దని గ్రామ సభలో తీర్మాణం చేసినా, గ్రామస్తుల అభీష్టానికి వ్యతిరేకంగా మళ్లీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించడం, అందుకోసం పంచాయితీ సమావేశం నిర్వహించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిశ్రమ ఏర్పాటు అనుమతి కోసం గ్రామ పంచాయితీ పాలక మండలి సభ్యులు సోలార్ ప్రతినిధుల నుంచి ముడుపులు తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే వారికి పరిశ్రమలో ఒకరిద్దరు ఉద్యోగం పెట్టించడానికి అవకాశం కల్పించినట్టు ప్రచారం జరుగతోంది. డబ్బుతో పాటు ఉద్యోగ అవకాశం లభించడంతో మొన్న టి వరకు వ్యతిరేకించిన కొంతమంది పాలక మండలి సభ్యులు పరిశ్రమ ఏర్పా టు పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో గ్రామానికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని కొత్త రాగం పాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ సమావేశం అనంతరం గ్రామ సర్పంచు, పంచాయితీ కార్యదర్శిని వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామ సభలో ఏం తీర్మాణం చేశారో లిఖిత పూర్వకంగా వెల్లడించాలని గ్రామస్తులు పట్టుపట్టారు. ఈ విషయంలో గ్రామ పంచాయతీ పాలక మండలికి, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సేపు గ్రామ పంచాయితీ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పరస్థితి అదుపుతప్పే పరస్థితి ఏర్పడటంతో సర్పంచు పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేయగా, గ్రామ జన మైత్రి పోలీసు శ్రీనివాస్ అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపు చేసే ప్రయ త్నం చేశారు. ఎంత చెప్పిన వినలేదు. చివరకు గ్రామ సభలో ఏలాంటి తీర్మాణం చేయలేనది లఖితపూర్వకంగా రాసి ఇచ్చి న తర్వాత ఆందోళన విరమించుకున్నారు.