కరీంనగర్

ఆంధ్రా పాలకులను మైమరిపిస్తున్న బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌టౌన్, మార్చి 13: స్వయం పాలనతో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పుకునే టిఆర్‌ఎస్ నేతలు ప్రవేశపెట్టిన 2017-18 రాష్ట్ర వార్షిక బడ్జె ట్ ఆంధ్రాపాలకులను మైమరిపిస్తోందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆరోపించారు. విద్యారంగ అభివృద్ధితోనే రాష్ట్రం పురోగమిస్తుందనే నానుడిని పెడచెవిన పెట్టిన రాష్ట్ర పాలకులు కేవలం రూ.12,706 కోట్లు మాత్రమే కేటాయించి, విద్యారంగం పట్ల చిన్నచూపు చూడటం సిగ్గుచేటని విమర్శించారు. కొఠారి కమిషన్ చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌లో 30శాతానికి తగ్గకుండా విద్యారంగానికి కేటాయింపులు జరపాల్సి ఉండగా, 10 శాతానికి తక్కువగానే చేర్చటం విద్యారంగం పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతోందన్నారు. పరోక్షంగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కెజి టు పిజి ఉచిత విద్య ఊసే ఎత్తకపోవటం శోచనీయమన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్దిపై కూడా దృష్టిసారించకపోవటం దారుణమని, ప్రభుత్వ తీరుతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్య తుడిచిపెట్టుకుపోయే అవకాశాలున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు తిరుపతినాయక్ మాట్లాడుతూ, విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా ప్రభుత్వ తీరు ఉందని తాజా బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో ప్రభుత్వ విద్యను సీమాంధ్ర నేతలు నీరుగార్చారని విమర్శించిన సీఎం తన పాలనలో కూడా అదే తీరున వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. బడ్జెట్‌లో విద్యారంగ కేటాయింపులు నామమాత్రమే చేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు రెడ్‌కార్పెట్ వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు నామమాత్రపు నిధులు కేటాయించటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ దీర్ఘకాలిక ఆందోళనలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంచేశారు.
ప్రతి ఎకరాకూ నీరందించండి: కలెక్టర్
సిరిసిల్ల, మార్చి 13: సిరిసిల్ల జిల్లా లో సాగునీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నట్టు రైతులు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో సోమవారం జిల్లా అధికారులతో కలెక్టర్ కృష్ణ్భాస్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులైన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పంటలు ఎండిపోవడంపై స్పందించాలని కలెక్టర్ కోరారు. ఏ విధమైన చర్యలు చేపడితే రైతన్నల పంటలు ఎండిపోకుండా జాగ్రత్త పడవచ్చో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందించాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న పంటల సాగు సౌకర్యంపై సవివరమైన రిపోర్టు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆత్మహత్యల కేసులు ఇటీవల కాలంలో పెరగడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నవాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం, యంత్రాంగం తమ వెన్నంటే ఉందన్న ఆత్మ స్థైర్యం నింపేలా సానుకూల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గొర్రె పెంపకం దారులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహకాలను ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అందిస్తున్న నేపధ్యంలో అర్హులందరికి ప్రయోజనం చేరేలా చర్యలు చేపట్టాలని పశు సంవర్ధక శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన వారందరిని గుర్తించి సోసైటీ వారిగా ఏర్పరచి రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. జిల్లాలో అభాగ్యులు, నిర్భాగ్యులకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక బడ్జెట్ లేకపోవడంతో తక్షణ ఆర్థిక సహాయం అందించలేకపోయామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక్కరోజు వేతనం ఆర్థిక సహాయం అందిస్తే వారికి మనం అందరం తరుపున జిల్లా యంత్రాం గం అండగా నిలబడుతుందన్నారు. ల కలెక్టర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వ శాఖల అధికారుల ఒక్క రోజు వేతనం విరాళంగా అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను జియో ట్యాగింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నందున హెల్త్ వెల్ఫేర్ విద్యతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జియో కోఆర్డినేటర్‌లను పంపాలని కలెక్టర్ సూచించారు. త్వరంలో గ్రామాలలోనికి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. కొద్ది రోజుల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నందున పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టాలన్నారు. అభ్యర్థులందరికి కుర్చీలు, తాగునీరు ఇతర సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. జెసి యాస్మిన్‌బాషా, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో పాండురంగ, అధికారులు పాల్గొన్నారు.