కరీంనగర్

స్వయం ఉపాధిలో శిక్షణ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 14: స్వయం ఉపాధిలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా చూడాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్-గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్‌బిహెచ్-ఆర్‌ఎస్‌ఇటిఐ) జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటి సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంస్థ నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అనంతరం మా ట్లాడుతూ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 153 కార్యక్రమాల ద్వారా వివిధ రంగాలలో 4,435 మందికి ఉచి త శిక్షణలు ఇవ్వడం జరిగిందని, ఇందులో బ్యాంక్ లింకేజి, సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా 3,388 మంది జీవితంలో స్థిరపడ్డారని తెలిపారు. ఈ సంస్థలో శిక్షణ పొందుతున్న వారికి భోజనం, వసతి సదుపాయాలు ఉచితంగా అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం స్వశక్తి కళాశాలలో నడుస్తున్న ఈ సంస్థ త్వరలో తిమ్మాపూర్‌లోని సొంత భవనంలోకి మార్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రో ఇరిగేషన్ అండ్ పాలీ హౌస్ కల్టివేషన్ శిక్షణలు ఇచ్చేందుకు తయారు చేసిన 2017-18 సంవత్సరానికి గాను యాక్షన్‌ప్లాన్‌ను ఆమోదించారు.
ఎస్‌బిహెచ్-ఆర్‌సిఇటిఐ డైరెక్టర్ పి.దత్తాద్రి, సభ్యులు గంగాధర్ రావు, ఎస్‌బిహెచ్ ఎజిఎం రవిబాబు, నాబార్డ్ డిడిఎం ప్రతాప్, డిఐసి జిఎం ఉమారాణి, జిల్లా ఉపాధికల్పనాధికారి భార్గవ్, జెడిఎం విజయ్ కుమార్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.