కరీంనగర్

ప్రశాంతంగా ‘టెన్త్’ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి17: జిల్లా వ్యాప్తం గా శుక్రవారం నిర్వహించిన టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయ గా, మొదటిరోజు 15,599 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 15,545 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.45 గంటల వరకు కొనసాగింది. ఈసారి ప్రయోగాత్మకంగా 18 పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ సప్తగిరికాలనీలోని పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిసేపు ఆందోళన దిగారు. సిసి కెమెరాలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా విద్యాధికారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఏలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు 144 నిషేధాజ్ఞలను అమలు చేసింది. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసి వేయించారు. మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా విద్యాధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కలిపి మొత్తం 39 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా విద్యాధికారి రాజీవ్ తెలిపారు.
జగిత్యాలలో
జగిత్యాల: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. శుక్రవారం జిల్లాలో 14వేల 108 మంది విద్యార్థులు హజరు కాగా 45 మంది గైర్హజరైయ్యారు. కాగా మొదటి రోజు ఎలాంటి మాస్‌కాపీయింగ్ కేసులు నమోదు కాలేదని అధికారుల ద్వారా సమాచారం.
వెల్గటూర్ మండలం ఎండపల్లి, మల్యాల మండలం తాటిపల్లి, పెగడపల్లి, జడ్‌పిహెచ్‌ఎస్, అదర్శ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాగా 99.68 హాజరు శాతం నమోదైందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు గంటన్నర ముం దుగానే కేంద్రాలకు చేరుకుని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
పెద్దపల్లిరూరల్‌లో..
పెద్దపల్లిరూరల్ : జిల్లాలో పదోతరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జిల్లా పరిధిలోని 55 పరీక్ష కేంద్రాలలో 10, 296 మందికి గాను 10,261 మంది పరీక్ష రాసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో 32 మంది గైర్హాజరైనట్టు ఆ యన తెలిపారు. అలాగే ప్రైవేట్‌లో 64 మంది విద్యార్థులకు 61 మంది హా జ రయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్షకేంద్రాల ను తనిఖీ చేసినట్టు ఆయన వివరించారు.