కరీంనగర్

విద్యార్థి మృతి కేసులో సిపి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, మార్చి 21: జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గల బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇనుగాల రాజేష్ (18)కు సంబంధించిన కేసులో కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమలాసన్ రెడ్డి మంగళవారం రాత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈనెల 17న బావిలో పడి మృతి చెందిన రాజేష్ తండ్రి సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. విద్యార్థి మృతి విచారణపై సిపి మాట్లాడుతూ హత్యగా భావించి విచారణ చేస్తున్నామన్నారు. విద్యార్థి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చాలాసార్లు అమ్మాయితో అన్న ట్లు విచారణలో తేలిందన్నారు. కానీ ఆ కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృ తుడితో రూమ్‌లో ఉంటున్న ఇతర విద్యార్థులను విచారించగా, కారణాలేవి బయటపడలేదు. సంఘటనా స్థలంలో పరిశీలించినపుడు 25 కిలోల బండరాయి కట్టి ఉండగా, శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఈత రావడం వల్ల బండ కట్టుకొని దూకి మృతి చెందినట్టు భావిస్తున్నామన్నారు. రూంలో ఉంటున్న విద్యార్థులను విచారించినపుడు అతనిది ప్రత్యేక మనస్థత్వం ఉన్నట్టుగా తెలిసింది. మృతుడు చేగువేరా భావాలను ఎక్కువగా అభిమానిస్తాడని తేలింది. ఇప్పటికి చాలా కోణా ల్లో అనుమానం కలిగిన వ్యక్తులను విచారించామన్నారు. హత్యగా భావించి కేసు విచారణ సాగించినప్పటికి, సరైన ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం మరిన్ని అధారాలు లభిస్థాయని తెలిపారు. వివిధ కోణాల్లో దర్యాప్తు హత్య ? లేక ఆత్మహత్య? అన్న కోణంలో విచారణ సాగుతుందని తెలిపారు. విచారణలో హుజురాబాద్ ఎసిపి రవీందర్‌రెడ్డి, జమ్మికుంట టౌన్ సిఐ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.