కరీంనగర్

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మార్చి 24: ముస్లింలకు ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, ఈ విషయమై వెనుకడుగు వేయొద్దని, కొన్ని పార్టీలు, సంస్థలు రిజర్వేషన్లను వ్యతిరేకించ డం దారుణమని జిల్లా మస్జీద్, ఈద్గా మేనేజ్‌మెంట్ల అధ్యక్షుల ఫోరం అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చాలా ముస్లిం కుటుంబాలు ఇంకా పేదరికంలో మగ్గుతున్నాయని, వారికి ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదన్న విషయా న్ని గుర్తుంచుకోవాలన్నారు. వారంతా కష్టపడి చెమట చుక్కలతో జీవనం సాగిస్తున్నారని అలాంటి వారికి ఇచ్చే రిజర్వేషన్లను కొందరు అందోళనతో అడ్డుకోవడం దారుణమన్నారు. కొం దరు రిక్షా తొక్కుతూ, మరికొందరు సైకిల్ రిపేరు చేస్తూ, ఇంకొందరు కార్మికులుగా, ఆటోలు నడుపుతూ కూడా జీవిస్తున్నారని పేర్కొన్నారు. చిన్నచిన్న హోటళ్లు, వ్యాపారాలు నడుపుకుంటూ జీవిస్తున్నారని, వారికి ఎలాం టి రిజర్వేషన్లు లేక అభివృద్ది చెందలేకపోతున్నారాన్నది వాస్తవమని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ సుధీర్‌కుమార్ కమిషన్ నివేదిక ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
బిసి కమిషన్ కూడా పలు చోట్ల పర్యటించి ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసిందన్నారు. సమావేశంలో గౌస్‌ఖాన్, యూసుఫ్, అహ్మద్, ఫహీమ్, అజీమ్, ఖదీర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
బిసి కమిషన్‌కు రాజ్యాంగ
భద్రత కల్పించడం హర్షణీయం
- మోదీ చిత్రపటానికి బిజెపి నేతల క్షీరాభిషేకం
గోదావరిఖని, మార్చి 24: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిసి కమీషన్‌కు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బిజెపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గోదావరిఖని జి ఎం ఆఫీస్ చౌరస్తా వద్ద ప్రధాని మోడీ చిత్ర పటానికి వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు కాశిపేట లింగయ్య మాట్లాడుతూ బిసి, ఎస్సీల పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న నిబద్ధత ఉందనడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. గత 25 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం కూడా బిసి కమీషన్ పట్ల శ్రద్ధ చూపలేదని అన్నారు. 1993 సంవత్సరంలో గత ప్రభుత్వాలు బిసి కమీషన్ ఏర్పాటు చేసినప్పటికీ చట్టబద్ధత కల్పించకుండా బిసి హక్కులను కాలరాసినారని ఆరోపించారు. కేవలం బిజెపి ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమైందని, దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌లతోపాటు బిసి కమీషన్‌ల ముగ్గుర సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి, బిసి సమస్యలపై సత్వర చర్యలు చేపట్టేందుకు కమిటీ పని చేస్తుందని తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని బిసి, ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలు ఆయన తప్పకుండా తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు బల్మూరి అమరేందర్ రావు, వడ్డెపల్లి రాంచందర్, మామిడి రాజేష్, ఉప్పులేటి రాంచందర్, తోట కుమార్, జక్కుల నరహరి, ఇనుగొండ నర్సింహ రెడ్డి, గోగుల రవీందర్ రెడ్డి, గుర్రం సురేష్ తదితరులు పాల్గొన్నారు.