కరీంనగర్

పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 24: రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. శుక్రవారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సుదూర ప్రాం తాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి ఇక్కడి భక్తులు చేరుకున్నారు. పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వా మివారి దర్శనానికి నిర్దేశించిన క్యూలైన్లలో బారులు తీరారు. ముందుగా స్వామివారికి భక్తులు కోడెమొక్కు, కుంకు మపూజలు చెల్లించుకున్నారు. అంతరాలయంలోని స్వామివార్లను, అమ్మవారిని దర్శించుకొని తరించారు. గండాలు తొలగాలని గండాదీపం వద్ద జ్యోతులను వెలిగించారు.
రాజన్న సేవలో అగ్రోస్ చైర్మన్
స్వామిని అగ్రోస్ చైర్మన్ కిషన్‌రావుదంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వారు ఆలయంలోకి రాగానే అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. కల్యాణ మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
క్షయను నిర్మూలిద్దాం

* జగిత్యాల ఆర్డీవో నరేందర్ పిలుపు
జగిత్యాల, మార్చి 24: క్షయను సమూలంగా నిర్మూలిద్దామని జగిత్యాల ఆర్‌డిఓ నరేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాలలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన జగిత్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో నరేందర్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉండడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, రాత్రి వేళల్లో జ్వరం రావడం వంటివి క్షయ వ్యాధి లక్షణాలని వైద్యశాస్త్రం పేర్కొంటుందన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండడం వల్ల వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి.. టిబి నివారణకు కృషిచేయాల్సిన అవసరం ఉందని నినాదాలు చేశారు. టిబి, లెప్రసీ పోగ్రాం అధికారి శ్రీనివాస్, వైద్యఆరోగ్య సిబ్బంది, ఆశలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.