కరీంనగర్

ఎన్నికల హామీలను మరిచిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తారం, మార్చి 24: రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపి ఐ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్ ఆధ్వర్యంలో ముత్తారం తహశీల్దార్ దేవేందర్ రావుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజలకు ఎన్నికల ముందు కెసి ఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ముత్తారం మండలంలో చివరి ఆయకట్టుకు ఎస్ ఆర్ ఎస్ పి నీరు అందక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, అలాగే ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల పెన్షన్‌ను వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. సిపిఐ మంథని డివిజన్ అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, నాయకులు బాపి రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం
* అరెస్టులతో ఉద్యమం ఆపలేరు * జిజెపి జిల్లా కార్యదర్శులు భాస్కరాచారి, వెంకట్ రెడ్డి
మానకొండూర్, మార్చి 24: శాసనసభ సమావేశాలకు రాకుండ రెండు రోజులపాటు బిజెపి ఎమ్మెల్యేలను ఐదుగురిని రాష్ట్రప్రభుత్వం సస్పెండ్ చేయడం రాజ్యంగ విరుద్ధం అని బిజెపి జిల్లా కార్యదర్శిలు రంగు భాస్కరాచారి, గుర్రల వెంకట్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం బిజెపి అద్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలివేళ్లుతున్న బిజెపి జిల్లా కార్యదర్శి రంగు బాస్కరాచారి, గుర్రల వెంకట్ రెడ్డి, మండల రజక సెల్ కన్వినర్ ముక్కెర సతీష్, పూదరి రమణ, తిరుపతిరాజు, శంకరచారి, సంపత్, మల్లారెడ్డి, లక్ష్మయ్య, సంపత్, రమణయ్య, నరిసింహరెడ్డి, ఎరుకొండ శ్రీనివాస్‌తోపాటు 25 మంది బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్టేషన్ తరలించారు. ఈసందర్భంగా పోలీస్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్ల వ్యతిరేఖిస్తు బిజెపి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసి రాష్టప్రతి, గవర్నర్‌కు వినతి పత్రం అందించిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. మతపరమైన రిజర్వేషన్‌కు బిజెపి వ్యతిరేకంగా ఛలో ఆసెంబ్లీ కార్యక్రమాని శాతియుతంగా వెల్లుతున్న బిజెపి నాయకులను ఎక్కడిక్కడే రాష్ట్ర ప్రభుత్వం బిజెపి నాయకులను పోలీసులతో అరేస్టు చెయిండం సరైంది కాదని తీవ్రంగా మండిపడ్డారు. శాసన సభ సమావేశంలో రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికితీసుకపోవల్సిన బిజెపి ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేయడం రాజ్యంగ విరుద్దం అని అరోపించారు. బిజెపి నాయకుల అరేస్టుతో ఉద్యామం అగదు అని మరింతగా బలోపేతం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయిని వారు సూచించారు. ఎమ్మెల్యే సస్పెండ్‌కు నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలను చేయనున్నట్లు వారు తెలిపారు.