కరీంనగర్

బొగ్గు గని కార్మికుల సమస్యలపై మహోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 26: రాష్ట్రం ఏ ర్పడితే బతుకులు బాగుపడుతాయని ఆశిస్తే... అడుగడుగునా వంచనే ఎదురవుతుంది. నమ్మిన ప్రజలను, కార్మికులను ప్రభుత్వం నట్టేట ముంచుతుంది. దేశసంపదను పెంపొందించుందుకై రక్తాన్ని చెమటగా మార్చి అహర్నిషలు శ్రమిస్తున్న బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ మహోద్యమానికి సిద్ధమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశా రు. ఆదివారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో బిజెపి ఆరు జిల్లాల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనారణ్యానికి దగ్గర ప్రాంతంలో ఓసిపిలు ఉండొద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పచ్చని పొలాలను బొం దల గడ్డగా మారుస్తున్నారని, ఓసిపిలతో మానవాళి మొత్తం నాశనమవుతుందని... అయితే భూగర్భ గనులే నిర్మాణం చేయాలన్నారు. ‘ఏరు దాటేదాక ఓడ మల్లయ్య... ఏరు దాటాక బోడ మల్లయ్య’ల కెసిఆర్ పాలన వ్యవహారం ఉందని లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర సాధనలో సింగరేణి గని కార్మికుల సకల జనుల సమ్మె చారిత్రాత్మకమని, ఎన్నికల సందర్భంగా కెసిఆర్ గని కార్మికులకు ఒక్క రోజు సర్వీసు ఉన్న వారసత్వ ఉద్యోగాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వంచనకు గురి చేయడం సరైంది కాదన్నారు. ఓ నిరుద్యోగి హైకోర్టులో వేసిన పిల్‌ను చూపించి వారసత్వంను ఇవ్వకపోవడాన్ని సహించేది లేదని అన్నారు. ఓసిపిలకు వ్యతిరేకంగా బిజెపి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని పచ్చి అబద్ధాలు చెప్పారని... అయితే సింగరేణిలో 30వేల వరకు కాంట్రాక్టుకార్మికులు ఉన్నారని, సింగరేణి బొగ్గు పరిశ్రమతోపాటు రాష్ట్రంలోని ఇతర కంపెనీలో పని చేసే కాంట్రాక్టు కార్మికులందరిని రెగ్యూలరైజ్ చేయాలని, అది జరిగే వరకు ఊరుకునే ప్రకస్తే లేదని లక్ష్మణ్ కరాకండిగా తేల్చి చెప్పారు. సింగరేణి బొగ్గు గని కార్మికులకు భారతీయ జనతా పార్టీ అన్ని వేళలా... అండగా ఉంటుందని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. భూ నిర్వాసితులకు పరిహారంతోపాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, సింగరేణి ఏరియాలో నివాసముంటున్న కార్మికుల ఇండ్లను జీవో 58 జారీ చేసి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని అన్నారు.
పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కాశిపేట లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిజెపి రాష్ట్ర నేతలు గుజ్జుల రామక్రిష్ణా రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పుష్ప లీల, బల్మూరి వనిత, సుభాష్ రావు, చందు పట్ల కీర్తిరెడ్డి, ఎస్.కుమార్, ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చింతల సత్యనారాయణ, కన్నం అంజయ్య, బల్మూరి అమరేందర్ రావు, మీసా అర్జున్ రావుతోపాటు వేలాదిమంది బిజెపి శ్రేణులు, గని కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.