కరీంనగర్

ప్రజాభిమానంతో ఏదైనా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, మార్చి 26: ప్రజల అండదండలు, అభిమానం ఉంటే ఎం తటి పనినైనా సాధించవచ్చని కరీంనగ ర్ పార్లమెంటు సభ్యుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చేసిన సర్వేలో ఎంపికి రాష్ట్రం లోనే ప్రథమస్థానం రావటంతో ఆదివారం చొప్పదండికి చెందిన జడ్‌పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ పార్టీ అధ్యక్షుడు గడ్డం చుక్కారెడ్డితో పాటు పలువురు నేతలు వినోద్‌కుమార్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతు ప్రజల ఆదారాభిమానాల వల్లే తాను కేంద్రంతో కొట్లాడి మెజార్టీ ప్రాజెక్టులు తీసుకు రావడానికి అవకాశం లభించిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లను, బ్రిడ్జిలను తీసుకురావటంతో పాటు కొన్నింటిని పూర్తిచేసే అ వకాశం దక్కిందని తెలిపారు. ఈ సర్వే వల్ల తన భాద్యత మరింత పెరిగిందని, తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు అత్యధిక నిధులు తీసుకు రావటానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో ఏ ఎంపి చేయలేని విధంగా వినోద్‌కుమార్ జిల్లాతో పాటు పలు ప్రాంతాలకు అవసరమైన పథకాలు అందించారని, పలు పెండింగ్ పనులు పూర్తి చేయించడానికి కృషి చేయడం అభినందనీయమని జడ్‌పిటిసి సాం బయ్య పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిలా ఎంపి వ్యవహరించడం వల్లే ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని అన్నారు. తామంతా ఎంపి వెంట ఉండి అభివృద్దిలో భాగస్వాములం అవుతామని చెప్పారు.
పథకాలే పార్టీకి పునాది
గంగాధర: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి పునాదిలా పనిచేస్తాయని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం చొప్పదండి ని యోజకవర్గ స్థాయి టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గంగాధరలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే పునాది రాయి అని, ప్రతీ గ్రామంలో పెద్దఎత్తున పార్టీ సభ్యత్వాన్ని చేపట్టి కార్యకర్తలను సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు టిఆర్‌ఎస్ వైపే ఉన్నారనడానికి ముఖ్యమంత్రి చేపట్టిన సర్వేలే నిదర్శనమన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు సాగు, తాగునీటి ప్రాజెక్టులు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేపట్టనున్న సభ్యత్వాన్ని రాష్ట్రంలోనే అత్యధికంగా చేపట్టేలా ప్రతిఒక్కరు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎంపిపి దూలం బాలాగౌడ్, జడ్పీటిసిలు ఆకుల శ్రీలత, వీర్ల కవిత, లచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు రేండ్ల పద్మ, చింతపంటి లక్ష్మి, టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ సీనియర్‌నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభ
చందుర్తి, మార్చి 26: చందుర్తి మండలం రా మారావుపల్లి గ్రామంలోని రైతు కుటుంబానికి చెం దిన ఇంజనీర్ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని శ్రీ విద్యా కళాశాలలో ఇటీవల నిర్వహించిన యంత్ర విద్యార్థుల ప్రయోగ ప్రదర్శనలో నల్లా అజయ్‌రెడ్డి ప్రతిభ కనబర్చాడు. బిటెక్ ద్వి తీయ సంవత్సరం చదువుతున్న అజయ్ కళాశాల తరుపున యంత్ర పరిశోధనల భాగంగా స్పోర్టుకారును తయారు చేసి ప్రదర్శించడంతో ప్రథమ స్థా నంలో నిలిచాడు. అనం తరం పలువురు మాట్లా డారు. దీంతో అజయ్‌ను కాకినాడ కళాశాల యాజమాన్యం సన్మానించి రూ. లక్ష నగదు బహుమతిగా అందించారు. కాగా, అజ య్ తల్లిదండ్రులు నల్లా నాగిరెడ్డి , అమృతను గ్రామసర్పంచ్ కళావతి, సింగిల్‌విండో చైర్మన్ ముస్కు ముకుందారెడ్డి, నేతలు మల్లారెడ్డితోపాటు గ్రామస్థులు అభినందించారు.

అధిక సభ్యత్వాల కానుకనివ్వాలి
* బివైనగర్ సభలో ఎఎంసి చైర్మన్ జిందం
సిరిసిల్ల, మార్చి 26: సిరిసిల్లను అన్ని రకాలుగా అభివృద్ది పథంలోకి తీసుకెలుతున్న మంత్రి కెటిఆర్‌కు కానుకగా భారీ సభ్యత్వాలు నమోదు చేసి ఆ యన ముందుంచాలని ఎఎంసి చైర్మన్, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల కార్మిక క్షేత్రం బివైనగర్ జెండా చౌరస్తా వద్ద ఎనిమిది వార్డుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు జెండా చౌరస్తాలో పార్జీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లకు భారీగా నిధులిస్తున్న మంత్రి కి అధిక సభ్యత్వాలతో కృతజ్ఞతలు తెలుపాలన్నారు. ప్రతీ ఇంటికి టిఆర్‌ఎస్ పోవాలని, ప్రతి కార్మికుడికి పార్టీ సభ్యత్వం ఇప్పించాలన్నారు. కార్మికులకు అందుబాటులో ఉన్న రూ.30 లకే సాధారణ సభ్యత్వం ఇస్తారని, దీనికి రెండు లక్షల బీమా వర్తిస్తుందన్నారు. క్రియాశీలక సభ్యత్వంకు రూ.100 ఉంటుందని, దీనికి కూడా అంతే బీ మా ఉంటుందన్నారు. పది వేల మంది కి పార్టీ సభ్యత్వం ఇప్పించాలని, దీని ద్వారా మంత్రి ద్వారా మరింత అభివృద్దికి ఆస్కారం కలుగుతుందన్నారు. ప్రతీ ఇంటి నుండి కనీసం రెండు సభ్యత్వాలు సేకరించాలని చక్రపాణి అన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, వైస్ తువుటు కనకయ్య, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ, మాజీ చైర్మన్ గూ డూరి ప్రవీణ్, మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ తస్లీం, బత్తుల వనజ, మంచె శ్రీనివాస్, గుగులోతు రేణ, నాయకులు హన్మంతనాయక్, మామిడాల రమణ, ఎస్కె మహమూద్, కొమిరె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.