కరీంనగర్

రైతు సమస్యలపై స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, మార్చి 30: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రైతాంగానికి ఎ లాంటి సమస్యలు తలెత్తవన్న ముఖ్యమంత్రి కేసిఆర్... వారిని పట్టించుకున్న పాపానపోలేదని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతాంగ సమస్యల పరిశీలనలో భా గంగా గురువారం తిమ్మాపూర్ మండలంలోని మనె్నంపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను మాజీ ఎంపి పొన్నం, మానకొండూర్ మాజీ ఎమ్మె ల్యే ఆరపల్లి మోహన్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు సాగునీటిని చివరి ఆయకట్టు, ప్రతి ఎకరానికి నీటిని అందిస్తామని అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల ముందుకు రావాలని బహిరంగ చర్చలకు తాము సిద్దమని సవాల్ విసిరారు. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులు వేసిన వరి పంటలు ఎండిపోగా వాటిని సర్వే చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు.
మాజీ సింగిల్‌విండో చైర్మన్ ఎస్‌ఎల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తూముల శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి మేడి అంజ య్య, శ్రీనివాస్, మారకొండ వెంకన్న, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సొమ్ము దుర్వినియోగం

* ఎస్సీ కార్పొరేషన్ గడువును పొడగించాలి
* టిపిసిసి చైర్మన్ ఆరెపల్లి మోహన్
మానకొండూర్, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం ఇజిఎస్ ద్వారా గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం పేరుతో ఆర్భాటంగా నాణ్యత లేకుండా తూతూ మంత్రంగా పనులు చేపడుతూ ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని టిపిసిసి చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆరెపల్లి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ అర్హులైన లబ్ధిదారులకు రుణాలకోసం రెండు రోజుల గడువు ప్రభుత్వం ఇవ్వడం సరైంది కాదని, వెంటనే 15 రోజుల పాటు గడువు పొడగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని ముంజంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొల్లబొత్తుల బస్వయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పడాల శంకరయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు గడమల్ల వెంకటయ్య, ఎంపిటిసి సత్యం, నాయకులు పెండ్యాల రాంరెడ్డి, మండల యువజన సంఘం అధ్యక్షుడు పిట్టల మధు, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మరక్షణకు దొంగలను చంపినా.. కేసులు ఉండవు : ఎస్పీ

మల్లాపూర్, మార్చి 30: ఆత్మరక్షణకు దొంగలను చంపినా.. ఎలాంటి కేసులు ఉండవని జగిత్యాల ఎస్పీ అనంతశర్మ అన్నారు. మండలంలోని సాతారంలో బుధవారం రాత్రి గ్రామంలోని పెండెం భూమయ్య ఇంటి సమీపంలో దొంగలు వచ్చి అరుపులు వేస్తు తిరగగా, ఇరుగు పొరుగుకు సమాచారం ఇవ్వడంతో దొంగలు పారిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ గురువారం గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి దొంగలు వచ్చారని, గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళ చిన్న పిల్లల అరుపులు, వెకిలి చేష్టలతో ఇంటి ముందు అల్లరి చేస్తారని, ఎవరు కూడా తలుపుతీయవద్దని, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మల్లాపూర్ స్టేషన్ సందర్శించారు. డిఎస్పీ మల్లారెడ్డి, ఆర్‌ఎస్‌ఐ ప్రతాప్, సిఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై సతీష్ ఉన్నారు.
రాయికల్‌లో..
రాయికల్: ఈప్రాంతంలో గజ దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, ఇందుకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అనంతశర్మ అన్నారు. గురువారం రాయికల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అనుమాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో పిల్లల ఏడుపులు, వెకిలి చేష్టల శబ్దాలు వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయకూడదని అన్నారు. ఉదయం పూట వ్యాపారాల పేరుతో కూడా ఇళ్లలో వచ్చే వారిపై అమ్రమత్తంగా ఉండాలని సూచించారు.
బార్ అసోసియేషన్
అధ్యక్షుడిగా సత్యనారాయణ రావు
కరీంనగర్ లీగల్, మార్చి 30: కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు 2017-18 కి గురువారం జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా బాస సత్యనారాయణ రావు విజయం సాధించారు. ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు ఇద్దరి మధ్యనే కొనసాగింది. బాస సత్యనారాయణ రావు తన సమీప ప్రత్యర్థి కొరివి వేణుగోపాల్‌పై 167 ఓట్ల తేడాతో విజయదుందుభి మ్రోగించి రెండవసారి అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధానకార్యదర్శిగా త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ మళ్లీ రఘునందన్ రావుకే న్యాయవాదులు పట్టం కట్టారు. తన సమీప ప్రత్యర్థి హర్కాల చక్రధర్‌పై 41 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పటికే ఆరుసార్లు ప్రధానకార్యదర్శిగా గెలుపొంది మరోసారి విజయం సాధించారు. కార్యదర్శిగా ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ఆరెల్లి రాములు దూసుకెళ్లి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి శ్రీరాముల కిషన్‌పై 71 ఓట్ల తేడాతో విజయం సాధించారు. లైబ్రరీ కార్యదర్శిగా సల్పాల రమేష్ తన సమీప ప్రత్యర్థి పురుషోత్తం ఆంజనేయులుపై 197 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కోశాధికారిగా చంద రమేష్ తన సమీప ప్రత్యర్థి బూడిద మల్లేశంపై విజయం సాధించారు. సీనియర్ కార్యవర్గ సభ్యులుగా పెంచాల ప్రభాకర్ రావు, పూరెళ్ల రాములు, కొత్త ప్రకాష్‌లు విజయం సాధించారు. జూనియర్ కార్యవర్గ సభ్యులుగా మడిపెల్లి రవి, సిరికొండ శ్రీ్ధర్ రావు, పుల్యాల వేణుగోపాల రెడ్డిలు గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా పి.వి.రాజ్ కుమార్ మరోసారి రంగంలోకి దిగడంతో తనను తట్టుకునే ధైర్యం ఎవరికి లేకపోవడంతో రాజ్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మహిళా ప్రతినిధిగా కస్తూరి స్వరాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మారోజు రామకృష్ణాచారి తెలిపారు. ఈ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్, బొమ్మ వెంకన్న, ఆరెపల్లి మోహన్, నారదాసు లక్ష్మణరావు, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కొత్త శ్రీనివాస్ రెడ్డిలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు సజావుగా కొనసాగినందుకు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపు మదుసూధన్ రెడ్డితో పాటు కార్యవర్గానికి, న్యాయవాదులందరికీ ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు.
నార్త్‌జోన్‌లో 17 మంది సిఐల బదిలీ

కరీంనగర్, మార్చి 30: వరంగల్ నార్త్ జోన్ పరిధిలో 17 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సిఐ)లను బదిలీ చేస్తూ నార్త్‌జోన్ ఐజి వై.నాగిరెడ్డి గురువారం సా యంత్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు సిఐలకు స్థానచలనం కలుగగా, మరో ఇద్దరు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ ట్రాఫిక్-1లో పనిచేస్తున్న సిఐ మహేష్‌గౌడ్ కరీంనగర్ టూ టౌన్, ఇక్కడ పనిచేస్తున్న సిఐ హరిప్రసాద్ కరీంనగర్ కమిషనరేట్ (విఆర్), కరీంనగర్ త్రీ టౌన్‌లో పనిచేస్తున్న సిఐ ఎస్.సదానందం కరీంనగర్ ట్రాఫిక్ -2, వరంగల్ డిఐజి వద్ద పనిచేస్తున్న సిఐ జి.విజయకుమార్ కరీంనగర్ త్రీ టౌన్ బదిలీ అయ్యారు. అలా గే రామగుండంలో పనిచేస్తున్న సిఐ జి.సీతారెడ్డి కరీంనగర్ ట్రాఫిక్ -1కు, కరీంనగర్ ట్రాఫిక్ -2లో పనిచేస్తున్న సిఐ నారాయణ కరీంనగర్ కమిషనరేట్ (విఆర్)కు, కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న సిఐ ఎస్.ప్రమోద్‌రావు మంచిర్యాల రూరల్‌కు, బెల్లంపల్లిలో పనిచేస్తున్న సిఐ రఘు రామగుండం కమీషనరేట్ (విఆర్)కు బదిలీ చేశారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లు వారివారి పోస్టింగ్‌ల్లో రిపోర్టు చేయాలని ఐజి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈనామ్ ద్వారానే
మామిడి కొనుగోలు
* జగిత్యాల ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ

జగిత్యాల రూరల్, మార్చి 30: ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటిం గ్ (ఈనామ్) ద్వారానే మామిడి కొనుగోలు చేపట్టాలని జగిత్యాల ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా చల్‌గల్‌లోని రాజీవ్‌గాంధీ మామిడి మార్కెట్‌ను మార్కెట్ చైర్‌పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సీజన్ సమీపిస్తున్నందున మామిడిని విక్రయించే రైతులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే వౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అడ్తీ వ్యాపారులు తప్పనిసరిగా ఈ నామ్ ద్వారానే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో వ్యాపారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మార్కెటింగ్ ఎడి ప్రకాశ్, ఎడిఎ రాజేశ్వర్, కార్యదర్శి సిరాజొద్దిన్ అహ్మద్, సూపర్‌వైజర్ రమేశ్, అడ్తీ వ్యాపారులు అమీనొద్దిన్, మోహినొద్దిన్, ఎఎంసి డైరక్టర్లు ఉన్నారు.
3న ఎయిర్‌మెన్
ఉద్యోగాలకు రాత పరీక్ష

కరీంనగర్ టౌన్, మార్చి 30: నిరుద్యోగ యువతకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం పురుష అభ్యర్థులకు ఏప్రిల్ 3న స్థానిక అంబేద్కర్ స్టేడియంలో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలోని నిరుద్యోగ యువత నేరుగా 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి రాత పరీక్ష (ఇంగ్లీష్, రీజనింగ్ జనరల్ అవేర్‌నెస్)లో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు 17 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపువయస్సు కలిగి ఉండాలని, ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని, ఇంగ్లీష్‌లో 50 శాతం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ దృవీకరణ పత్రాలతో పాటు మూడుసెట్ల జిరాక్స్ ప్రతులు, 8 పాస్‌పోర్టు సైజు ఫోటోలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సైకాలజి టెస్ట్ ఉంటుందని, ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారు పరుగుపందెం 7 నిమిషాలలో 1.6 కిలోమీటర్లు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం 10 పుషప్స్, 10 సిట్టప్స్, 20 స్క్వయిర్స్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి, కమాండర్ యశ్వంత్ సింగ్ పంగాల్, డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్, ఆర్‌డిఓ రాజాగౌడ్, ఎయిర్‌ఫోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

’డబుల్‌‘ కదలిక

* కరీంనగర్‌లో భూమి పూజ చేసిన మంత్రి ఈటల
* ఉమ్మడి జిల్లాకు 6,947 ఇళ్లు మంజూరు
* ఇప్పటికే ఎమ్మెల్యేలతో మంత్రి రాజేందర్ సమీక్ష
* మొదటి విడత ఇళ్లు పూర్తి చేయాలని నిర్ణయం

కరీంనగర్, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతగా 400ఇళ్ల చొప్పున మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు గుత్తేదార్లు ముందుకురాకపోవడం మూలాన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక అడుగు కూ డా ముందుకు పడలేదు. మంజూరైన ఇళ్లకు లబ్దిదారులను సైతం ఎంపిక చేశారు. రెండేళ్లుగా డబుల్‌కు ఎంపికైన లబ్దిదారులు ఆశలు వదులుకుంటున్న తరుణంలో సిఎం కెసిఆర్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఏడాది మొత్తం 2లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమంటూ ప్రకటించడం
తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆ దిశగా పనిచేయాలంటూ మార్గనిర్దేశనం చేశారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గంలో యుద్దప్రాతిపదికన చేపట్టేందుకు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13నియోజకవర్గాలకు 400ఇళ్ల చొప్పున మొత్తం 5,200 ఇళ్లను మొదటి విడత మంజూరు చేశారు. ఇవేకాక సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న చినముల్కనూరులో 247, మంత్రి కెటిఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో అదనంగా 1500 ఇళ్లను మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం 6,947 ఇళ్లు మంజూరయ్యాయి. ధరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చినప్పటికీ మొదటి విడతగా 3,550 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. మంజూరైన నాటి నుంచి నేటి వరకు పథకం ముందుకుసాగకపోవడం, దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం లాంటి పరిణామాల క్రమంలో సిఎం కెసిఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి తీరుతామంటూ అసెంబ్లీలో ప్రకటన చేయడమేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశనం చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్ నియోజకవర్గంలోని నగర శివారు పద్మనగర్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భూమి పూజ చేశారు.మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరలో పూర్తి చేసేందుకు నడుంబిగించారు. వాస్తవానికి ఉగాది పర్వదినాన భూమి పూజ చేయాలనుకున్న స్థలాల గుర్తింపులో ఆలస్యం జరుగుతుండటంతో శంకుస్థాపనలు లేట్ అవుతున్నాయి. ఇప్పటికే మంత్రి రాజేందర్ జిల్లా ఎమ్మెల్యేలతో డబుల్‌పై సమీక్ష నిర్వహించి యుద్ధప్రాతిపదికన స్థలాలను గుర్తించడంతోపాటు ఇళ్లను ఏలాగైన పూర్తిచేయాలని నిర్ణయించారు. మొత్తానికి డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో ఎట్టకేలకు కదలిక రావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.
లారీ ఓనర్స్ సమ్మె షురూ
* కదలని లారీలు * నిలిచిన రవాణా

కరీంనగర్, మార్చి 30: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ లారీ యజమానులు గురువారం నుంచి సమ్మె బాట పట్టారు. గురువారం ఉదయం నుంచే ఎక్కడికక్కడే లారీలు నిలిచిపోగా, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 7వేల వరకు గూడ్స్ లారీలు ఉండగా, ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. వీరికి గూడ్స్ వ్యాన్, ఆటో యజమానుల సంఘాలు మద్ధతు ప్రకటించాయి. జాతీయ పర్మిట్ లేని లారీలు పక్క రాష్ట్రానికి వెళ్లి రావటానికి సింగిల్ పర్మిట్ విధానాన్ని అన్ని రాష్ట్రాలు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు అమలు చేస్తున్నాయని, దీనిని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని లారీ యజమానుల డిమాండ్. అయితే, సింగిల్ పర్మిట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని లారీ యజమానులు పేర్కొంటున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారం కోసం నిరవధిక బంద్‌కు వెళ్లగా, రాష్ట్ర మంత్రులు లారీ యజమానులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. మంత్రులు హామీ ఇచ్చి 14నెలలు గడిచినా లారీ యజమానుల సమస్యలకు పరిష్కారం లభించలేదు. దీంతో లారీ యజమానులు మరోమారు సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పటికైన తమ సమస్యను పరిష్కరించాలని లారీ ఓనర్స్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, భవన నిర్మాణ సామాగ్రీ, మందులు తదితర సరుకుల రవాణా నిలిచిపోయి ప్రజలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సమస్య ముదరకముందే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బొమ్మకల్ బైపాస్ రోడ్డులో లారీ యజమానులు రాస్తారోకో చేపట్టారు.
సరుకులతో వెళ్తున్న ఇతర రాష్ట్రాల లారీలను అడ్డుకున్నారు. దీంతో బైపాస్‌లో రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.