కరీంనగర్

దళితుల అభివృద్ధే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 13: దేశం లో దశాబ్దాల తరబడి వివక్షకు గురువుతున్న దళితులు అభివృద్ధి చెందినపుడే దేశం పురోగమిస్తుందని కేంద్రవ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వారిపట్ల అణిచివేత ధోరణి కొనసాగుతుందని, ఇది తగదన్నారు. భారతీయ జనతాపార్టీ 37వ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలో పర్యటించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ, కొన్ని ప్రాంతీయ పార్టీలు దళితుల పట్ల హేయభావంతో వ్యవహరిస్తున్నాయని, ఫలితంగా వారిపై పలుచోట్ల భౌతికదాడులు జరిగి, హత్యలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపట్ల కొనసాగుతున్న వివక్షత, దాడులను కేంద్రం తీవ్రంగా ఖండిస్తోందని, అధికార నేతల ఆగడాలతోభయబ్రాంతులకు గురవుతున్న దళితుల్లో భరో సా నింపి, మేమున్నామంటూ ధైర్యం చెప్పేందుకే దళితవాడల్లో సహపంక్తి భోజనం చేస్తున్నట్లు వెల్లడించారు. దళితవాడల్లోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోందని, ఇందులోభాగంగానే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించినట్లు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నగరంలోని సుభాష్‌నగర్‌లో గల పెరుక రాజేశ్ అ నే దళిత కార్యకర్త ఇంట్లో ఆయన మ ధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి బండి సంజయ్‌కమార్,నాయకులు పొల్సాని సుగుణాకర్‌రావు, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, కొట్టె మురళీకృష్ణ, కట కం లోకేష్, బి.ప్రవీన్‌రావు, ముజీబ్, మహిళా నాయకురాళ్లు ఆకుల సుజాత, గాజుల స్వప్న, సుంకె యశోద, పోతుగంటి సుజాత, బండ అనిత, కన్నం అంజయ్య పలువురు పాల్గొన్నారు.
మేధావులూ ఆలోచించండి
ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడటంలో కీలకభూమిక పోషిస్తున్న మేధావులు ఒక్కసారి ఆలోచించి, ప్రధాని మోదీ పాలనకు మద్ద తు పలకాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీ 37వ ఆవిర్భావ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం జిల్లాలోని ఆ పార్టీశ్రేణుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన ఆయన నగరంలోని ఓ హోటల్‌లో ఏ ర్పాటు చేసిన మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ గతంలో భారతదేశమంటేనే ప్రపంచంలోని అగ్రదేశాలు ఛీదరించుకునేవని, నాటి పాలకులు తమ స్వప్రయోజనాలే తప్ప దేశ ప్రయోజనాలపై దృష్టి సారించకపోవటంతో ఈ దుస్థితి నెలకొనగా, నేడు అగ్ర దేశాలన్నీ భారత్‌తో స్నేహ హస్తం చాచేందుకు పోటీపడుతున్నాయని అన్నారు. బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మో దీ ఆలోచనా విధానాన్ని ప్రజలకు వివరిస్తూ, దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు. దేశం సుభిక్షంగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారనే భావనతో రాజకీయ కోణం వీడి దేశ రక్షణ పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుడుగేస్తుందని, గత పాలకులకు భిన్నంగా ఎన్‌డిఏ పాలన కొనసాగుతుందన్నారు. ఈక్రమంలోనే దేశంలోకి చొరబాటుదారులను పంపేయత్నం చేస్తున్న ఉగ్రవాదులపై సరిహద్దులు దాటి సర్జికల్ స్ట్రైక్‌లు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పాకులాడదని, దేశ ప్రజానీకం సంక్షేమం, రక్షణే ముఖ్యమనే భావనతోపాలన కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. పెద్దనోట్ల రద్దును స్వాగతించిన మేధావులు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుపై వారు చేసిన విశే్లషణలే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపికి ఘనవిజయాలు తెచ్చిపెట్టాయన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై మేధావులంతా ఆలోచించి, తెలంగాణలోని వెనుకబడిన వర్గాలకు జరుగబోతున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమావేశంలో ఆపార్టీ రాష్టశ్రాఖ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా పార్టీ బాధ్యులు, ముఖ్యకార్యకర్తలు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 600 మంది మేధావులు పాల్గొన్నారు.