కరీంనగర్

కరీంనగర్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 15: కరీంనగర్‌లో దారుణం జరిగింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను గర్భవతి అని చూడకుండా భర్త ఉరివేసి హత్య చేసిన సంఘటన విద్యానగర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. భర్త చేతిలో గుర్రాల శశికళ (28) అనే ఐదు నెలల గర్భిణీ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం...నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గుర్రాల లక్ష్మణ్‌తో, నగరంలోని హుస్సేనిపురకు చెందిన శశికళకు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వివాహా సమయంలో లక్ష రూపాయల కట్నం, మూడు తులాల బంగారం అందజేశారు. పెళ్లి అనంతరం లక్ష్మణ్ నగరంలోని విద్యానగర్‌లో నివసిస్తూ, ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ డిఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, భార్య శశికళ ఎవరితో మాట్లాడిన అనుమానించే లక్ష్మణ్ తరచు గొడవ పడుతుండేవాడు. ప్రస్తుతం శశికళ ఐదు నెలల గర్భిణీ. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అదేరాత్రి భార్యను ఉరివేసి చంపేసి, బంగారం, ఇతర విలువైన వస్తువులను తీసుకుని లక్ష్మణ్ పరారయ్యాడు. అంతేకాకుండా ఏమి తెలియనట్టుగా శనివారం మధ్యాహ్నం ఇంటి ఓనర్‌కి ఫోన్‌చేసి తన భార్య ఫోన్ లిప్ట్ చేయడం లేదని చెప్పగా, ఇంటి ఓనర్ గదిలోకి వెళ్లి చూడగా, శశికళ మృతి చెంది కన్పించింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని నేరస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహేష్‌గౌడ్ తెలిపారు.

అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
మానకొండూర్, ఏప్రిల్ 15: మాజీ రాష్టప్రతి, దివంగత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం లో కొనసాగుతున్న బాలకా సాధికారిత, అభ్యాసనాభివృద్ధి కార్యక్రమాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ విద్యార్థుల పక్కనే నేలపై కూర్చుకోవడంతో వారు కంగారుపడినప్పటికీ సరైన సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ ద్వారా గణితశాస్త్రంపై చాలా నేర్చుకున్నామని, లెక్కలంటే భయం పోయిందని విద్యార్థులు కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పెడగ రాజీవ్, జిసిడివో అనురాధ, తహశీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంఈవో మధుసూదన్, ఎస్‌వో స్వప్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.