కరీంనగర్

రామలింగేశ్వర స్వామి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఏప్రిల్ 16: జైనా గ్రామంలోని గుట్టపై వెలసిన రామలింగేశ్వర స్వామి జాతరను అశేష భక్తజన భాగస్వామ్యంతో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జైనా గ్రామంలో అంతర్భాగంగా, రామలింగేశ్వర గుట్టగా పేరెన్నికగని, ప్రాచీన శివలింగం కలిగి, పలు విగ్రహాలతో నిత్యపూజలందుకుంటున్న సదరు ఆలయంలో ఏటా జాతరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూండడం పరిపాటి. ఆలయంలో ఆలయ అర్చకులు దేవళ్ళ ప్రసన్న శర్మ ఆధ్వర్యంలో, వేదపండితులు తాడూరి బాలకృష్ణ శర్మ, బలరామ శర్మ, గుడ్ల రమేశ్ శర్మ, తదితర ఆచార్యులు పుణ్యాహవాచనం, నవ గ్రహ స్థాపన, మహన్యాస పూర్వక రుద్రాభిషేక, సకృతావర్తనాది ప్రత్యేక అర్చనలు, నవగ్రహ పూజలు, రుద్రహోమం వేదోక్త సాంప్రదాయ రీతిలో గావించారు. స్థానిక మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడిన వార్షిక ఉత్సవ ప్రత్యేక కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్ రాపెల్లి కమలాకర్, మాజీ చైర్మన్ అల్లె రాజేశం, జైనా గ్రామ సర్పంచ్ కుంట సుధాకర్, కోసునూరు పల్లె సర్పంచ్ పెరుమాండ్ల లక్ష్మి రాజం, ఎంపిటిసి గాజుల కళావతి, ఉపసర్పంచ్‌లు సంగెపు గంగారాం, ఎన్నం లక్ష్మారెడ్డి, జైనా పిఎసిఎస్ చైర్మన్ సౌళ్ళ నరేశ్ కుమార్, మాజీ సర్పంచ్ గాండ్ల బుచ్చన్న, మాజీ ఎంపిటిసి సభ్యుడు కుక్కల గంగారెడ్డి, కేడిసిసి బ్యాంకు మాజీ డైరెక్టర్ ఇనగంటి ప్రేంచందర్ రావు, బొల్లం మల్లేశం, సత్యనారాయణ తదితర ప్రముఖులు భాగస్వాములైనారు. వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అఖండ మహిమాన్వితుడైన రామలింగేశ్వర ప్రత్యేక పూజాది కార్యక్రమాలలో పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బిజెపి వౌన ప్రదర్శన
* నేతల అరెస్ట్..విడుదల
చొప్పదండి, ఏప్రిల్ 16: మతపరమైన రిజర్వేషన్ల బిల్లును ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు నిరసనగా పట్టణంలో బిజెపి మండల అధ్యక్షుడు చేపూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు నోటికి నల్ల గుడ్డలు కట్టి స్థానిక తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలలో వేర్వేరుగా బిజెపి, బిజెవైఎం ఆధ్వర్యంలో వౌనప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎస్‌ఐ చంద్రశేఖర్ పోలీసులతో వచ్చి నేతలను అరెస్ట్ చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. మండల అధ్యక్షుడు చేపూరి సత్యనారాయణ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం మజ్లిస్ (ఎంఐఎం)తో కుమ్మక్కై మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల జనాభాలో 52 శాతం ఉన్న బిసిలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసమే ఈ సాధ్యం కాని రిజర్వేషన్లను కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. మండల ప్రధాన కార్యదర్శి కొత్తూరి భూమయ్య, బొల్లాజి వెంకటస్వామి, పట్టణ అధ్యక్షుడు ఉసికె రాజశేఖర్ రెడ్డి, భైరగోని కిట్టుగౌడ్, జొం గోని తిరుపతి, మడుపు నరేందర్, రాజన్నల తిరుపతి, తాటికొండ కుమార్, బత్తిని హరీష్, మారం ఓదెలు, పల్లపు కుమార్, శంకరయ్య, సుదర్శన్, రాజవీరు, మహేష్, మురళి పాల్గొన్నారు.