కరీంనగర్

ముస్లిం రిజర్వేషన్‌పై బిజెపి మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభు త్వం ముస్లిం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై బిజెపి మండిపడింది. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోరుబా ట పట్టింది. దీంతో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టగా, అదేరీతిలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. పార్టీలోని ముఖ్య నాయకులను పోలీసు అధికారులు వేకువజామునే ముందస్తూ అరెస్ట్‌లు చేయగా, మరికొందరు నేతలను గృహ నిర్భం దం చేశారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో ముఖ్యనేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మీస అర్జున్‌రావు, కోమల ఆంజనేయులు, న్యాలకొండ నారాయణరావు, కొరివి వేణుగోపాల్, కన్నం అంజయ్యను ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించగా, బిజెపి నేత డి.శ్రీ్ధర్‌ను గృహ నిర్బం ధం చేశారు. అలాగే సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ముఖ్య నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో బిజెవైయం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. సంజయ్‌కుమార్ నేతృత్వంలో కోర్టు చౌరస్తా సమీపంలోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటి వైపు నకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్ చేసిన వారిని డిపిటిసికి తరలించారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో, మండల కేంద్రాల్లో పలు రకాల నిరసన కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టగా, వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్‌లు చేసి స్టేషన్‌లకు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై వారందరినీ విడుదల చేశారు.
నేడు కలెక్టరేట్ ముట్టడి
ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి పార్టీ జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.