కరీంనగర్

మాతృభాషను మరిచిపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 16: అన్ని భాషలకన్నా... తెలుగు భాష మధురమైనదని, ఆంగ్ల మోజులోపడి మాతృభాషను మరిచిపోవద్దని సిరిసిల్ల డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కవిసమ్మేళానికి డిఆర్వో ముఖ్య అతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా సంస్కృతిని పరిరక్షించే బాధ్యత కవులదేనని అన్నారు. అంగ్లం మోజులో పడి తెలుగు భాషను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో మాతృభాషను పరిరక్షిస్తూ మాట్లాడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం తెలుగు భాషను మర్చిపోతున్నారన్నారు. గత 19ఏళ్ల నుండి సిసాస కవి సమ్మేళం నిర్వహించడం అభినందనీయమన్నారు. సిసాస కవులు, డిఆర్వోను సన్మానించారు. ఈకార్యక్రమంలో సిసాస అధ్యక్షుడు పోరండ్ల మురళీధర్, కవులు జనపాల శంకరయ్య, రామస్వామి, రాములు, ఆంజనేయులు, కరుణాకర్, నారాయణ, రాజేశం, వెంకట్రాజం, తదితరులు పాల్గొన్నారు.
దళితుల చేతిలో..
కెసిఆర్‌కు పరాభవం తప్పదు
* టిడిపి కరీంనగర్ నియోజకవర్గ పరిశీలకురాలు పద్మావతి

ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 16: దళితుల చేతిలో కెసిఆర్‌కు పరాభవం తప్పదని టిడిపి కరీంనగర్ నియోజకవర్గ పరిశీలకురాలు గడ్డి పద్మావతి అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర పార్టీ కన్వీనర్ కల్యాడపు ఆగయ్య అధ్యక్షతన నగర పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి పద్మావతి, టిడిపి జిల్లా కన్వీనర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ దళితులను అవమానపరుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దళితుల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు. దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు దళితులంతా సిద్ధమవుతున్నారన్నారు. నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం పాటుపడాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జిల్లా కన్వీనర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు సన్నద్ధం కావాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ తాజోద్దీన్, రొడ్డ శ్రీనివాస్, నాగుల బాలాగౌడ్, వంచ శ్రీనివాస్ రెడ్డి, కొరటాల శివరామకృష్ణ, దూలం రాధిక, రొడ్డ రత్నకుమారి, తీట్ల ఈశ్వరి, మేకల మాధవి, సదుర్ల ఇందు, నూజెట్టి వాణి, సందబోయిన రాజేశం, ఆడెపు కమలాకర్ , తదితరులు పాల్గొన్నారు.