కరీంనగర్

మోసం చేస్తున్న రైస్‌మిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, ఏప్రిల్ 27: రైతులు పండించిన వరి పంటను తాలు వడ్ల పేరుతో రైస్ మిల్స్ ఓనర్స్ మోసం చేస్తున్నారు అని గురువారం మండల పరిధిలోని వెల్ది గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం రైతులు ఆగ్రహానికి గురై ధాన్యం బస్తాలకు నిప్పుపేట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం పాటు పండించిన పంటకు కొనుగోలు కేం ద్రంలో ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని రైతులు ధాన్యాన్ని కొనుగొలు కేంద్రంలోకి తరలిస్తే కోనుగోలు కేంద్రంలో రైతులకు చెందిన దాన్యం కొన్నవాటిని రైస్ మిల్స్ తరలిస్తే తాలు వడ్లు, నల్లగా ఉన్నాయని మద్దతు ధర అందించలేమని క్వింటాళ్లకు ఏడు నుండి పది కిలోల దాన్యం కట్ చేస్తామాని తెలిపి కొనుగోలు చేసిన దాన్యాని రైస్‌మిల్ నుండి వేనుకకు పంపిచారు అని రైతులు ననుమాల లస్మయ్య, వెల్పుల రంగయ్య, కోమ్మగల్ల ఓదయ్య, గంప రాజయ్య, శ్రీనివాస్, ఐలయ్య, మల్లరెడ్డి, చక్రరెడ్డి, నగూనూరి లక్ష్మయ్య, పప్పు సత్యం, మహిళలు, సుమారు 150 మంది రైతులు గంటపాటు అందోళన చేపట్టారు. రైస్‌మిల్ ఓనర్స్‌తో కోనుగోలు కేంద్రం నిర్వాహకులు కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారు అని అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడును పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిదులు ఎవరులేరు అని రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అవేదన వ్యక్తం చేశారు. వెల్ది గ్రామంలోని దాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం బస్తాలకు రైతులు నిప్పు పెట్టి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిదులు స్పం దించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా పంటలు లేక పోవడంతో ఈయెడాది ప్రభుత్వం పంట సాగుకోసం ఎల్‌ఎండి ఎస్సారెస్పి కాల్వల ద్వార సాగు నీటిని అందిస్తే పంట చివరి దశలో అకాల వర్షం కురిసి వరి దాన్యం గింజలు కొంత నల్లపడిపోయిన్నాయని వాటిని కూడ కోనుగోలు చేయడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేశారు. కోనుగోలు కేంద్రం నడువకుండా నిలిపివేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం మేరుకు మానకొండూర్ తహశీల్దార్ వెంకట్ రెడ్డి వెల్ది గ్రామంలోని కోనుగోలు కేంద్రానికి చేరుకోని నల్లవడ్లు, తాలు, నల్ల మచ్చలుగా ఉన్న దాన్యం కుప్పులను పరిశిలించారు. తాలు వడ్లు లేని వాటిని కోనుగోలు చేయాలని నిర్వహుకులకు తహశీల్దార్ సూచించారు. నల్ల మచ్చల ఉన్నవాటిని, నల్ల వడ్లను శ్యాపింల్‌ను ముందుగా రైస్ మిల్ కు పంపిస్తామాని అనంతరమే కోనుగోలు చేయాలని తెలిపారు.