కరీంనగర్

ప్రయాణికుల పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 27: అసలే వేసవికాలం.. ఆపై సెలవులు...వీటికి తోడు శుభకార్యాలు....రోజురోజుకు బస్టాండ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ.... ఇందుకనుగుణంగా బస్సులు తిప్పాల్సిన ఆర్టీసీ యం త్రాంగం గురువారం ఉమ్మడి జిల్లాలో 80శాతం బస్సులు నిలిపేసింది. వీటన్నిటిని అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు జనాలను తరలించేందుకు వినియోగించగా, దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లనెదుర్కొన్నారు. ఎలాంటి ప్రకటనలు చేయకుండానే ఒక్కసారిగా బస్సులను మూకుమ్మడిగా రద్దుచేయటంతో జిల్లావ్యాప్తంగా బస్టాండ్లన్ని కిటకిటలాడిపోయాయి. తాము వెళ్ళాల్సిన ప్రదేశానికి పది నిమిషాలకోబస్సు ఉండగా, రద్దుమూలంగా గంటకో బస్సు కూడా సక్రమంగా తిరగలేదు. వచ్చిన బస్సును ఇదే భాగ్యంగా భావిస్తూ ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ప్రయాణికులు టాప్‌పై కూడా ప్రయాణించటం కనిపించింది. ఉమ్మడి జిల్లాలోని 11డిపోల్లో సుమారు 1180 బస్సులుండగా, వీటి ద్వారా నిత్యం 4నుంచి 5లక్షల వరకు ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. అధికార పార్టీ వార్షికోత్సవ సమావేశం జరిగే హన్మకొండ పట్టణానికి జిల్లానుంచి ప్రజలను తరలించేందుకు 900కు పైగా బస్సులను అధికారులు బాడుగకు ఇవ్వగా, నిత్యం నడిచే ట్రిప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. నామమాత్రంగా సర్వీసులను తిప్పటంతో బస్టాండ్లలో బస్సుల కోసం వేలాది మంది ప్రయాణీకులు పడిగాపులుకాయక తప్పని పరిస్థితి నెలకొంది. అత్యవసరమైన వారు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తే, వాటి యజమానులు ఇదే అదనుగా ధరలు పెంచి, ముక్కుపిండి మూడింతలు వసూలు చేయటంతోప్రయాణీకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. గంటల తరబడి వేచిచూసిన దూర ప్రాంత ప్రయాణీకులు తమకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ నగరంలోని బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. గంటకు పైగా రాస్తారోకో చేపట్టినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవటంతో, వారి వైఖరిపై దుమ్మెత్తిపోస్తూ బస్టాండ్‌లోనికి వెళ్ళిపోయారు. ప్రయాణీకులకు మెరుగైన బస్సు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, అధికారపార్టీ ఆదేశాలకు తలొగ్గి, ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా రద్దు చేసి అధికార పార్టీకి అద్దెకివ్వటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు అధికార పార్టీ వార్షికోత్సవ సభకు బస్సుల తరలింపు తమ ప్రయాణాలకు అడ్డుగా మారిందంటూ ఆర్టీసీ అధికారులపై ప్రయాణీకులు విరుచుకుపడటం కొసమెరుపు.