కరీంనగర్

ఎన్నికల హామీలు నెరవేర్చని కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, ఏప్రిల్ 27: ముఖ్య మంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కరీంనగర్ జిల్లా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యంజయం ఆరోపించారు. గురువారం హుస్నాబాద్‌లో మాజీఎమ్యెల్యే అల్గిరెడ్డి బొమ్మశ్రీరాంచక్రవర్తిస్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ దేశంలో అత్యుత్తమ పేరు గాం చిన ములుకనూరు సహకార బ్యాం కును అధ్యయనం చేయుటకు ఈ 30న కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, దిగ్విజయసింగ్‌తో పాటు సీనియర్ నాయకులు వస్తున్నారని తెలిపారు. టిఆర్ ఎస్‌పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రిగా తొలి సంతకం పెట్టిన రైతు రుణమాఫీ చేయకుండా రైతులను అప్పుల పాలు చేస్తుందని దీనికి తోడు కొత్తగా రైతుకు ఎకరానికి 4వేలు వచ్చె ఎడాది నుండి అమలు చేస్తామని చెప్పడం సిగ్గుగాలేదా అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తు ఇంక ఏన్నాళ్లు కొనసాగుతవని నిలదీశారు.30నెల్ల కాలంలో ఒక్కపనైన చేశారాని ప్రశ్నించారు.మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పనుల్లో మొత్తం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కేంద్రనిధులను పేదల డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇవ్వకుండ దారి మళ్లించి అధికార దుర్వినియోగం చేస్తున్నావన్నారు. ప్లీనరీ పేరుతో కూలీ పని చేస్తు రోజుకు ఒక్కొక్క మంత్రి 5లక్షలు ఎలా సంపాదిస్తున్నారని ఈ లెక్క చోప్పున ఉపాధి హామీ కూలీలకు కనీసం మూడు నెల్లకు ఒకసారైన కూలీ పైసలు ఇవ్వాలేరాఅడిగారు. ఇప్పటికైనా హామీలను వెంటనే నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరం లేవని హెచ్చరించారు. సింగిల్ విండో చైర్మెన్ శివయ్య,అధికారప్రతినిధి కేడం లింగమూర్తి, మాజీ ఎంపిపి అకుల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు లింగరెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, అక్కన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు అశొకుబాబు, అక్కుశ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులపై 29న సమీక్ష
* గైర్హాజరయ్యే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవు
* డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్
సిరిసిల్ల, ఏప్రిల్ 27: ఈనెల 29న జిల్లా కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనుల ప్రగతిపై ప్రజాప్రతినిథులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ బాధ్యులు, ఇన్‌చార్జి జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి జీవీ శ్యాంప్రసాద్‌లాల్ తెలిపారు. ఈ మేరకు గురువా రం ఇక్కడ ప్రకటన విడుదల చేస్తూ 29 ఉదయం 9.00గంటలకు సిరిసిల్ల పట్టణం పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎంపిపిలు, ఎంపిటిసిలు, ప్యాక్స్, ఎఎంసి చైర్మన్లు, సెస్ డైరెక్టర్లు, గ్రామ సర్పంచులందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని డిఆర్వో శ్యాం ప్రసాద్‌లాల్ కోరారు. అన్ని మండలాల ఎంపిడివోలు, పంచాయతి కార్యదర్శులు, ఎంజిఎన్‌ఆర్ ఇజిఎస్ క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బందితో ఇజిఎస్ తాజా ప్రగతి నివేదికలతో సమావేశంకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదేశాను సారం ఈ సమావేశాన్ని నిర్వహస్తున్నామని డిఆర్‌డివో తెలిపారు. అధికారులు సిబ్బంది, గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిఆర్వో హెచ్చరించారు.