కరీంనగర్

మిషన్‌కాకతీయతోనే సమగ్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, ఏప్రిల్ 7: నిజాంకాలం నాటి చెరువులు దాదాపుగా ఆంధ్ర పాలక పక్షం నిర్లక్ష్యం మూలంగా కబ్జాకు గురైయ్యాయని, వాటిని పరిరక్షించడంతోనే అన్నదాతలకు మేలు జరుగుతుందని సంకల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ దృడ సంకల్పంతో చేపట్టిన మిషన్ కాకతియతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ మల్యాలపల్లి గ్రామంలో మిషన్ కాకతీయలో భాగంగా ఎంపీ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చెరువు పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ సుమన్ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని ఎవ్వరు ఆపలేరని, కెసిఆర్ నేతృత్వంలో చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆదరణ లభిస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైపే ప్రపంచ దేశాలు చూస్తున్నాయని పేర్కొన్నారు. మునుపు ఎన్నడు లేని విధంగా మిషన్ బగీరథ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడమే లక్ష్యంగా వేలాది కోట్లాది రూపాయలతో ఈ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుందన్నారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడు జరుగని అభివృద్ధి పనులు 2సంవత్సరాలలో ఊహించని అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ కోదాటి ప్రవీణ్ ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేకు గ్రామ సమస్యను విన్నవించారు. మల్యాలపల్లిని ముంపుగా పరిగనించి ఇక్కడ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసైనా తమను వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించి ఆదుకోవాలని లేకపోతే అటు ఎన్టీపీసీ యాష్ ఫాండ్, పక్కనే జెన్ కోథర్మల్ స్టేషన్ నుండి వెలువడే కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ జాన్ శ్యాం సన్, ఎంపిపి రాజేశం, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్లు సోమారపు లావణ్య, షమీమ్ సుల్తానాతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.