కరీంనగర్

అనితర సాధ్యం కానివి ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఏప్రిల్ 27: ప్రపంచంలో అనితర సాధ్యం కానివి ఏవీ ఉండవని, సాధనల ద్వారా సర్వ సమస్యలు పరిష్కారం కాగలవని హైదరాబాద్ శ్రీనిఖిల్ చేతనా కేంద్ర వ్యవస్థాపకులు, నిర్వాహకులు సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ ఉద్ఘాటించారు. సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఉదయ్‌దత్ జ్యోషి, శేషు శర్మ మార్గదర్శకత్వంలో, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 108 మంది శిష్య బృందంతో శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీ నరసింహ మూల మంత్ర జప హవన కార్యక్రమ నిర్వహణ సందర్భంగా గురువారం ధర్మపురి క్షేత్రానికి విచ్చేసిన అనిల్‌కుమార్ జ్యోషి మాట్లాడుతూ, నారసింహ మూల మంత్ర జపాలు పూర్తి చేయడం జరిగిందని, దానికి ముగింపుగా ఏటా నిర్వహిస్తున్న క్రమంలో ధర్మపురి నారసింహ సన్నిధిలో దశాంశ పద్దతిన మూలమంత్ర హవన కార్యక్రమం జరుపుతున్నామన్నారు. శుక్రవారం ఉదయం దేవస్థానంలో కలశ, గణపతి పూజతో ప్రారంభించి, మాతృక, స్వస్తి, పుణ్యాహవాచనం, సర్వతోభద్ర మండల పూజ, శ్రీ లక్ష్మీ నరసింహ స్థాపన, పూజాదికాలు, హోమాదులు, సాయంత్రం పొన్నచెట్టు సేవాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మే నెల 1నుండి బోధన్‌లోని నూతన నిర్మిత నిఖిల్‌ధాం నందు నారసింహ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
వసతుల ఏర్పాట్లపై జెసి ఆకస్మిక తనిఖీ
* రైతులు, కార్మికులను విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం
కోనరావుపేట, ఏప్రిల్ 27: కోనరావుపేట మండలం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వసతుల ఏర్పాట్లపై గురువారం సిరిసిల్ల జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధర్మారం, నిజామబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెసి తనిఖీ చేసి రైతుల కోసం వసతుల ఏర్పాట్లను, రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు. ధర్మారంలో సింగిల్ విండో కొనుగోలు కేంద్రంలో నిజామాబాద్‌లో ఐకెపి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో రైతులకు టెంట్లు, మంచినీరు తదితర సౌకర్యాలు లేవని, మంచినీటి కుండలపై మూతలు లేకుండా ఉండడాన్ని జెసి గ్రహించి నిర్వాహకులను మందలించారు. రైతులకు ఇలాగే సేవలందిస్తే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎలా తెస్తారని మండి పడ్డారు. రైతులను ఇబ్బందులు చేయకుండా వెంట వెంట ధాన్యంను తూకం వేసి డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కోనరావుపేట తహశీల్దార్ సదానందంను ఆదేశిస్తూ రోజు వారిగా ధాన్యం కొనుగోలు వివరాలను అందించాలని, అలాగే కొనుగోలు కేంద్రాలలో వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఇక నైనా రైతులకు సేవలందించాలని జెసి ఆదేశించారు.