కరీంనగర్

కార్మికుల హక్కుల రక్షణకు పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 28: కార్మికుల హక్కుల రక్షణకై పోరాడాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నేత జెవి.చలపతిరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టియు) కార్యాలయంలో జిల్లా కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 131వ మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే, 1న ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మిక వర్గం ప్రదర్శన నిర్వహించగా, అది హింసాత్మకంగా మారి పోలీసు కాల్పుల జరగడంతో ఆరుగురు కార్మికులు అమరులయ్యారన్నారు. 1889లో అంతర్జాతీయ కార్మిక సంస్థల మహాసభ మే1న ఎనిమిది గంటల పని దినం సాధనకై పోరాట దినంగా ప్రకటించిందన్నారు. ఇఫ్టూ అనుబంధ సంఘాలైన విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, బీడీ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, సామిల్ వర్కర్స్, భవన నిర్మాణం, పవర్‌లూం వర్కర్స్ యూనియన్‌లతో పాటు ఇతర రంగాల కార్మికులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, గౌరవ అధ్యక్షులు కె.ప్రకాశ్, అధ్యక్షుడు సిహెచ్.్భమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు
బావిలో పడి యువకుడి మృతి
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 28: పోలీసుల భయంతో పారిపోతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కొత్తపల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (35) అనే యువకుడు కొత్తపల్లిలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన అనంతరం మరో ఇద్దరితో కలిసి కొత్తపల్లి శివారులో మద్యం సేవిస్తుండగా పోలీసులు వచ్చారు. పోలీసులను చూసిన శ్రీనివాస్ భయంతో పారిపోతున్న క్రమంలో బావిలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కట్టరాంపూర్‌లో చోరీ
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 28: కట్టరాంపూర్‌కు చెందిన మర్రి బాలరాజు అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళం పగులగొట్టి ఇంటిలోని 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు లక్ష నగదును అపహరించారు. భార్యా,పిల్లలు హైదరాబాద్‌లో ఉండడంతో బాలరాజు ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.