కరీంనగర్

బాసట..బహుదూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 10: సాగులో మెలకువలు తెలియక, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా దిగుబడి రాక రైతన్నకు ఆధునిక వ్యవసాయం,తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు తీసేలా అవగాహన పెంచుతూ, అన్నదాతకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన మన తెలంగాణమన వ్యవసాయం జిల్లాలో పేలవంగా కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఖరీఫ్‌కు ముందు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి సాగుకు సాయమందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సాగుపై మెలకువలు, సస్యరక్షణ చర్యలతో పాటు ఇతర విధానాలపై అవగాహన పెంచుతూ,రైతులను ప్రగతి బాట పట్టించేందుకు అధికారులు చేపడుతున్న పల్లెబాట జిల్లాలో అంతగా కానరావటంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉత్పత్తి, నికర ఆదాయం పెంచి కర్షకుల జీవనప్రమాణాలు మెరుగుపర్చేందుకు తలపెట్టిన ఈ అవగాహన సదస్సుల నిర్వహణపై అధికారులు చిత్తశుద్ది కనబర్చకపోవటంతో, రైతులకు సాగుపై అవగాహన కల్పించటం అల్లంతదూరానికి చేరింది . జూన్ 1నుంచి ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుండగా, సాధారణ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా భూములకు చికిత్స చేసేందుకు భూసార పరీక్షలు నిర్వహించుకునేలా, సమగ్ర యాజమాన్య పద్ధతులు,విత్తన శుద్ది, పంటలకు వినియోగించే ఎరువుల మోతాదు,పంటరుణాలపై బ్యాంకర్లతో సంధానం చేస్తూ, వానకాలం వ్యవసాయానికి సన్నద్దం చేయాల్సి ఉంటుంది. ఈ అవగాహన సదస్సుల్లో వ్యవసాయాధికారులతో పాటు అనుబంధ విభాగాలైన ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్,బ్యాంకింగ్,నీటిపారుదల, మత్య్స, ఆత్మ, డిఆర్‌డిఏ, విద్యుత్, పట్టుపరిశ్రమ శాఖల అధికారులతో పాటు సమీపంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాల నుంచి శాస్తవ్రేత్తలు కూడా హాజరుకావాల్సి ఉంటుంది. రోజుకు రెండు గ్రామాల చొప్పున ఉదయం 7నుంచి 11.30 గంటల వరకు గ్రామాల్లోకి వెళ్ళి రైతులను సమీకరించి, సదస్సులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని ఆయా మండలాల వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో కొనసాగించాలి. సదస్సు నిర్వహణకు ఒకరోజు ముందే గ్రామంలోప్రచారం చేపట్టాలి. కానీ, చడీచప్పుడు కాకుండా గ్రామాల్లోకి వచ్చి కూడళ్ళలోకొద్దిసేపు ముచ్చటిస్తూ, తిరుగుపయనమవుతున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్నిచోట్ల ఒకరిద్దరు వ్యవసాయాధికారులు మాత్రమే వచ్చి కొంతమందిని సమీకరించి తూతూమంత్రంగా కరపత్రాలు పంచి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని గ్రామాల్లో సదస్సులపై అవగాహన ఉన్న ఒకరిద్దరు రైతులు పథకాల అమలుతీరుపై ప్రశ్నిస్తుండగా, దాటవేత ధోరణితోసదస్సులు ముగిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు కేంద్రం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధాని కృషి సంచయ్ యోజన, జాతీయ ఆహార భద్రతా పథకంలపై కూడా అవగాహన కల్పించాల్సి ఉండగా, చాలాచోట్ల వీటి ఊసే ఎత్తటం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల అధికారులను రైతులు నిలదీసిన సందర్భాలు కూడా ఉండగా, నచ్చజెపుతూ ఆందోళనలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల స్థితిగతులు అంచనావేస్తేనే సరైన కార్యచరణ రూపొందించే అవకాశాలుండగా, మండుతున్న ఎండలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఎంతో ఉదాత్తాశయంతో తలపెట్టిన మన తెలంగాణ మన వ్యవసాయం హలదారికి అందని ద్రాక్షలా మారుతుందనే ఆవేదన వ్యవసాయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దీంతో తెలంగాణను కోనసీమగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలన్నీ వృధాప్రయాసగా మారనున్నాయని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు.