కరీంనగర్

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మే 10: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం, అధికారులు రైతులకు ఎలాంటి వసతులు కల్పించడం లేదని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఐకెపి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పెట్టొద్దని, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని, చెల్లించాల్సిన డబ్బులు కూడా తొందరగా చెల్లించేట్లు చూడాలని కోరారు. అధికారుల తీరుపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యాన్ని 24 గంటల్లో కొనుగోలు చేస్తామన్నారని, కాని పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు. రైతులు చాలా సేపు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆయన తెలిపారు. అకాల వర్షం పడితే రైతులు తెచ్చిన ధాన్యం తడిసి నష్టపోయే అవకాశం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు లేవని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు కూడా ఏర్పాటు చేయలేదని పొన్నం అన్నారు. రైతులకు కనీస వౌళిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇసుక మీద కూడా పూర్తిగా నియంత్రణ ప్రభుత్వానికి లేదని పొన్నం విమర్శించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు తరలివెళ్లే లారీలను కాంగ్రెస్ హయాంలో పూర్తిగా నియంత్రించామని ఆయన అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ నియోజకవవర్గంలోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. దుర్శేడులో ఇటీవల ధాన్యం విక్రయానికి వచ్చి ట్రాక్టర్ కింద నిద్రిస్తూ ప్రమాదానికి గురై రైతు మరణించిన సంఘటన చోటు చేసుకుందని, దీనికి ప్రభుత్వానికి, అధికారులదే బాధ్యత అని పొన్నం అన్నారు. హుజూరాబాద్ మండలంలో 12 కొనుగోలు కేంద్రాలున్నా పరిస్థితి అంతటా ఇలాగే ఉందన్నారు. తాము రాజకీయ లబ్ది కోసం కొనుగోలు కేంద్రాల్ని సందర్శించడం లేదని, ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, రైతుల సమస్యలపై ప్రభుత్వపై ఒత్తిడి పెంచుతామని ఆయన అన్నారు.
వడదెబ్బతో ఒకరి మృతి
సుల్తానాబాద్, మే 10: మండలంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన పోతర్ల మల్లయ్య (70) అనే వృద్ధుడు వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు. ఎండ తీవ్రత కారణంగా టీ కొట్టు నడుపుకునే మల్లయ్య తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని వారు తెలిపారు.
రజిత ఆత్మహత్యకు భర్తే కారణం
హుజూరాబాద్ రూరల్, మే 10: హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో మంగళవారం రాత్రి విష గుళికలు మింగి దుగ్యాల రజిత (33) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుని మరణించిన సంఘటనకు భర్త శ్రీనివాసరావు వేధింపులే కారణమని రజిత తండ్రి భీంరావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొద్ది కాలంగా శ్రీనివాసరావు తన కుమార్తెను తీవ్రంగా వేధిస్తున్నాడని, తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన పర్కాల మండలానికి చెందిన శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విఆర్‌ఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు
కోహెడ, మే 10: మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన పలువురు రైతులు విఆర్‌ఓ యాదగిరిపై కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలోని తమ పేర్లమీద ఉన్న భూములను విఆర్‌ఓ యాదగిరి తన కుటుంబ సభ్యుల పేరుమీద అక్రమంగా బదలాయించాడని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హుస్నాబాద్ పర్యటనకు రాగా తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు బాధిత రైతులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో
వ్యక్తి మృతి
ధర్మపురి, మే 10: ధర్మపురి మండలం రాజారం గ్రామ సమీపాన ఎదులాపురం సత్తయ్య (44) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సత్తయ్య భార్య భవాని, కూతురు శే్వత, కుమారుడు శేషు ఉండగా, కొంతకాలంగా కుటుంబ కలహాలతో భార్య భవాని, పిల్లలు దీకొండలోని తన పుట్టింట ఉంటున్నది. దీనితో మానసిక వ్యథకు గురైన సత్తయ్య, గ్రామ శివారులో క్షుద్ర పూజలు చేసే తొడేటి వెంకటేశ్ వద్దకు వెళ్ళి, ఆయన సలహా మేరకు నయం కావడానికి 15రోజులు గ్రామ శివారులోని గుడిలో ఉండే ఏర్పాట్లు చేసుకున్నాడు. బుధవారం అటవీ నర్సటీ పక్కన శవమై కన్పించగా, గ్రామ్తుల, సర్పంచ్ ద్వారా ధర్మపురి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని, శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాలకు తరలించారు. తన కుమారుని వద్ద డబ్బులు ఉన్నందునే పథకం ప్రకారం హత్య చేయబడినట్లు రాజయ్య ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా సిఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గొంతు కోసుకుని
నేత కార్మికుడు మృతి
* అప్పులు, మద్యానికి బానిసై ఆత్మహత్య
సిరిసిల్ల, మే 10: సిరిసిల్ల పట్టణంలోగూడూరి సుదర్శన్(40) అనే పవర్‌లూం కార్మికుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు, మద్యానికి అలవాటు పడిన సుదర్శన్ బుధవారం తన ఇంటిలో బ్లేడ్‌తో గొంతు కోసుకోవడంతో ఆయనను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందారు. అప్పులతో ఇబ్బందులు పడుతున్న సుదర్శన్ మద్యానికి బానిసైనట్టు తెలిసింది. దీనితో కుటుంబ పోషణ భారం కావడంతో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు కొన్ని మాత్రలు కూడా మింగినట్టు చెబుతున్నారు. ఉదయం భార్య ఇంటిలో పని చేసుకుంటూండగా, అదే సమయంలో సుదర్శన్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. అయితే అతడిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. కొద్ది సమయానికే ఆయన మృతి చెందడంతో సుదర్శన్ వద్ద కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో ఆసుపత్రి వర్గాలు కంగుతిన్నాయి. సుదర్శన్‌ను పోస్టు మార్టం గదిలోకి మార్చగా, పోలీసులు అతడి కుటుంబ సభ్యుల ఆచూకి కోసం ప్రయత్నించి, చివరికి చిరునామా కనుక్కుని ఆసుపత్రికి తీసుకవచ్చారు. మృతుడికి స్వంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలో జీవిస్తున్నాడు. సుమారు ఐదు లక్షల మేర అప్పులు చేసినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య రజిత, కుమారుడు సాయి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.