కరీంనగర్

అధికారుల పనితీరు మారకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, మే 10: హుస్నాబాద్ డివిజన్‌లో మూడు మండలాల అధికారుల పనితీరులో మార్పు రావాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని బాగస్వాములు చేయలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి పిలుపు నిచ్చారు.బుధవారం అయన హరితహారం ఒంటరి మహిళల పెన్సన్ పథకం పై పట్టణంలో కెజిఅర్ గార్డెన్‌లో అధికారులు ప్రజాప్రతిన్ధిలతో కలిసి సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్‌లో మూడు మండలాల అధికారులు వారి పనితీరులో ఏమాత్రం మార్పు రావటం లేదని తీవ్రంగా మందలించారు.హరితహారం కార్యక్రమం విజయంవంతం చేయుటకు ముందుగా గ్రామాల్లో హరిత రక్షణ కమిటిలను ఏర్పాటు చేసుకొవాలని సూచించారు.
గత రెండు పర్యాయాలుగా హరిత హరకార్యక్రమాలు విజయవంతం కాలేక పోయామని ఈ సారి ఈ మండలాల అధికారుల పనితీరు మెరుగు పరిచి జిల్లాలోనే గజ్వేల్ సిద్దిపేట మండలాల మాదిరిగా ముందుకు పోయేందుకు ప్రణాళికలు తయారు చేసుకుని ఈ నెల 22వరకు కమిటిలు పూర్తి చేయాలని అధికారలును ఆదేశించారు. జిల్లాలో 1.62కోట్లు మొక్కలు 25రకాల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుని తొలకరి కురువగానే మొక్కలు నాటాలన్నారు. గ్రామ సర్పంచుచైర్మెన్‌గా హరిత కమీటిలు ఏర్పాటు చేయాలన్నారు.మొత్తం 12 మందితో హరితరక్షణ గ్రామ స్థాయిలో అధికారులు ఫీల్డుఅసిస్టెంట్లు మొక్కట పరిరక్షణకు పూర్తి సహకారం అందించాలన్నారు. భర్త వదిలేసిన మహిళలు,పెళ్లిలు కాని 30 సంవత్సరాల దాటిని వారిని గుర్తించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారిఖాతలో పెన్సన్ డబ్బులు జమచేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మెన్ రాయారెడ్డిరాజారెడ్డి, ఎంపిపి భూక్య మంగ, అరు మండలాల ఎంపిపిలు,జడ్ప్‌టిసిలు ఎంపిడివోలు తహశీల్దార్లు వివిధ శాఖల అధికారులు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.

బీరయ్య పట్నాల్లో
పాల్గొన్న ఎమ్మెల్యే శోభ
చొప్పదండి, మే 10: మండల పరిధిలోని దేశాయిపేట గ్రామంలో యాదవ, కుర్మల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుని పట్నాల ఉత్సవాల్లో భాగంగా బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా యాదవ, కుర్మలు 15 రోజుల పాటు ఎంతో వైభవంగా బీరయ్య పట్నాలను నిర్వహించుకోవడం గర్వకారణమని, అలాగే తెలంగాణ సంస్కృతికి ఈ ఉత్సవాలు అద్దం పడతాయని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం యాదవ, కుర్మలను పట్టించుకోలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం యాదవ, కుర్మలకు గొర్రెల లోన్‌లను ఇచ్చి ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడిగ గాలన్న, మండల పార్టీ అధ్యక్షుడు మంద నర్సయ్య, మునిగాళ్ల చందు, సుద్దాల శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

అన్నదాతల సంక్షేమానికి
ప్రభుత్వం పెద్దపీట
* రైతులకు మొట్టమొదటిసారిగా
సహకార బ్యాంక్ ఎటిఎం కార్డు
* పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
సుల్తానాబాద్, మే 10: అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రైతులకు కేంద్ర సహకార బ్యాంక్‌కు సంబంధించి ఎటిఎం కార్డులను ఇక్కడ అందజేయడం జరిగిందన్నారు. అలాగే శాస్తవ్రేత్తలు చెప్పే సూచనలు, సలహాలు పాటిస్తేనే రైతులు అధిక దిగుబడులు సాధిస్తారన్నారు. ప్రభుత్వం ఇవ్వనున్న ఎకరాకు నాలుగు వేల రూపాయల విధి విధానాల గురించి వివరించారు. వ్యవసాయ అధికారుల వద్ద రైతులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే నారాయణపూర్, కొదురుపాక గ్రామాల్లోనూ రైతు సదస్సులు జరిగాయి.

రైస్‌మిల్లు దగ్ధంపై
పూర్తి స్థాయి విచారణ
* మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ
జగిత్యాల రూరల్, మే 10: జగిత్యాల మండలం తాటిపల్లి శివారులోని శ్రీరాజ రాజేశ్వర రైస్‌మిల్లు బుధవారం పాక్షికంగా దగ్ధం కావడంతో జగిత్యాల పైర్ ఇంజన్ మంటలను ఆర్పి వేసింది. సమాచారం తెలుసుకున్న మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ సంఘటన స్ధలాన్ని పరీశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లు దగ్దం పట్ల పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టి బాధ్యులు ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత రెండు నెలల క్రితం విజిలెన్స్ దాడులు జరుపగా మిల్లు యజమాని నిల్వలకు సంబంధించి సరైన లెక్కలు చూపించకపోవడంతో మిల్లును సీజ్ చేసారని అన్నారు. సీజ్ చేసిన మిల్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ముషారప్ అలీ వెల్లడించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సబ్ కలెక్టర్ వెంట రూరల్ తహశీల్దార్ రాజ్‌మనోహర్‌రెడ్డి, ఆర్‌ఐ రాజేందర్‌రావులు ఉన్నారు. కాగా గతంలో విజిలెన్స్ దాడుల సమయంలో మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడం, నిల్వల్లో తేడాలు రావడం సరైన ఆధారాలు లేక పోవడంతో దాదాపుగా రూ.కోటి 6 లక్షల విలువైన ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు. జరిగిన సంఘటనలో పాక్షికంగానే దగ్దం అయ్యిందని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
జోన్ సిస్టం రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి
*మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్
జమ్మికుంట, మే 10: జోన్ సిస్టం రద్దు చేసి, నిరుద్యోగ గ్రామీణ ప్రాంత యువతకు పెద్ద దెబ్బతీసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం, కెసిఅర్ చేస్తున్నారని, కెసిఅర్‌కి మంచి బుద్ధి ఇవ్వాలని, జోన్ సిస్టం రద్దు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామిని వేడుకుంటున్నామని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యమ్రానికి హాజరయ్యారు. అనంతరం అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హైద్రాబాద్‌లో కానె్వంట్ పాఠశాలలో చదివిన పిల్లవాన్ని, గ్రామంలో చదివిన పిల్లవానికి ముడి పెడుతున్నావు, చదువు పట్ల వ్యత్యాసం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం నిరుద్యోగ యువత ఉద్యోగుల కోసం తెలంగాణ సాధించుకున్నారని, కానీ జోన్‌ల వ్యవస్థ రద్దువల్ల స్థానికతను, గ్రామీణ ప్రాంత యువకులు కోల్పోతారన్నారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, కుల, విద్యార్థి సంఘాల మద్ధతు కూడగట్టి పోరాటం కొనసాగిస్తామన్నారు. బయటి రాష్ట్రాల యువకులు హైద్రాబాద్‌కు పరిమితం అయి ఉద్యోగాలలో 5 నుండి 10 ఏళ్లతో స్థానికత పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు జిల్లా, మండలాల వారిగా కూడా ఇతర రాష్ట్రాల ఉద్యోగస్థులుగా తెప్పించే కుట్రను కెసిఅర్, ప్రభుత్వం చేస్తుందని, ఉద్యోగాల కోసం ఉద్యమం నడిచిందని, జోనల్ రద్దు వ్యవస్థ, ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని పొన్నం హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల మద్ధతుతో ఉద్యమం చేయవలసిన అంశమన్నారు. తెలంగాణ సాధించుకున్నది, స్థానికత పేరుతో గ్రామాల వారిగా కోట్లాటలు పెట్టించేందుకు కాదన్నారు. తెలంగాణ యువత ఎక్కడికి వెళ్లినా నినధించాలని, అందరు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఉద్యోగం ఆశించే ప్రతి నిరుద్యోగ వ్యక్తికి సంబంధించిన అంశమన్నారు. కాంగ్రెస్ పార్టీ సామ, ధాన, భేధ, దండోపాయాలను పోరాటంలో ఉపయోగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఅర్ మూర్ఖత్వం నుండి బయటపడేయాలని, పోరాటంలో రాములోరి ఆశీర్వచనం కోరుకుంటున్నామన్నారు. ఇప్పటి జిల్లాల విభజన అక్టోబర్‌లో చేసి, జిల్లాకు కోటి నిధులు విడుదల చేస్తానని మాట తప్పారన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుపై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు కరపత్రాలతో ప్రచారం చేస్తామన్నారు. ఈ విషయంలో ఈటల రాజేందర్ మద్ధతు కోరుతామన్నారు. హోం మంత్రిపై మాట్లాడుతు ఆయన తూటా లేని తూపాకి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు సచ్చిలునివై నిరూపించుకోవాలన్నారు. రైతులపై కెసిఅర్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తుందని, 2వేల రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో రైతులు కర్రు కాల్చి వాత పెడుతారని హెచ్చరించారు. పంటలు పండించిన రైతులు రోడ్డున పడి ఆవేదన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దేశిని కోటి, జయరామారావు, రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుల జిల్లెల తిరుపతిరెడ్డి, ఇల్లందకుంట సర్పంచ్ పెద్ది స్వరూప కుమార్, శివ, అశోక్, సలీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామీణ వృత్తులకు ప్రభుత్వ చేయూత
*జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్
ధర్మపురి, మే 10: గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించేలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మల కోసం గెర్రెల పెంపకం నూతన పథకం అమలు చేస్తున్నట్లు జిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఉద్ఘాటించారు. బుధవారం ధర్మపురి మండలంలోని నాగారం గ్రామంలో నిర్వహించిన గొర్రెల పెంపకం దారుల లబ్దిదారుల ఎంపిక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ, గొర్రెల పెంపకంపై ఆసక్తిగల ఆర్హులైన కుటుంబాలలో భార్య లక భర్త, వారి 18ఏళ్ళు నిండిన పిల్లలకు ఈ పథకం ద్వారా 20గొర్రెలు, ఒక పొట్టేలు 1.25లక్షల విలువ గల యూనిట్‌గా మంజూరీ చేస్తున్నట్లు, ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 93,750 రూపాయలు పోను లబ్దిదారుడు 31,250రూపాయలు మాత్రమే తన వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణలో ఉత్పత్తి షవుతున్న మాంసం అవసరాలకు సరిపోని స్థితిలో, ఇతర రాష్రాష్టల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున, రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడు మాంసం ఉత్పత్తితో పాటు గొల్ల్ర, కుర్మలకు ఆదాయం సమకూరగలదన్నారు. మన ప్రాంతంలో వాతావరణాన్ని తట్టుకునే గొర్రెలను ఇతర రాష్టమ్రుల నుండి కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ఇదివరకే ఉన్న గొర్రెలకు బీమా చేయిస్తామని, అడవులలో, ఇతన భూములలో పెంచడానికి అటవీ శాఖ అభ్యంతరాలు ఉండవని, సొసైటీల, స్థలాలను, తోటలను గుర్తించి, గొర్రెలకు గడ్డి పెంచడానికి చర్యలు గైకొంటున్నామన్నారు. గొల్ల, కుర్మలకు భూమి ఉంటే గడ్డి పెంపకానికి సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయనున్నట్లు, కోతకు చాప్ కట్టర్లు అందజేయనున్నట్లు వివరించారు. సర్వేల ద్వారా అర్హులను గుర్తించడం జరిగిందని, గ్రామ సభల ద్వారా విడతలుగా ఎంపిక చేయడం జరుగుతున్నదన్నారు. నాగారంలో 46మంది దరఖాస్తులు చేసుకోగా, ఈసారి 23మందిని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మపురి తహశీల్‌దార్ మహేశ్వర్, ఎంపిడిఓ శశికళ, పశు వైద్యాధికారి డాక్టర్ రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ రూపు సత్తమ్మ, ఎంపిటిసి అక్కల అంజయ్య, సొసైటీ అధ్యక్షులు దండవేని గంగమల్లు, ఆదర్శ రైతు గడ్డం సత్యనారాయణ రెడ్డి, గొర్రెల పెంపకం దారులు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాలి
* ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఇల్లంతకుంట, మే 10: మిషన్ కాకతీయ పనులను 15 రోజుల లోపే పనులను ప్రారంభించి పూర్తి దశలోకి తీసుకురావాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. బుధవారం మండలంలోని ముస్కాన్‌పేట గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. తదనంతరం గాలిపెల్లి, వంతడుపుల, కట్కూర్ గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడంతో రాష్ట్రంలోనే జలకళతో పాటు పల్లెల్లో వెలుగులు కనిపిస్తున్నాయని అన్నారు. మూడవ దశ పనులను సత్వరమే పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఐలయ్య యాదవ్, జడ్పీటిసి సిద్ధం వేణు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులుపాల్గొన్నారు.
నేషనల్ వలంటరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ముకరంపుర కరీంనగర్, మే 10: నెహ్రూ యువక కేంద్ర కరీంనగర్ జిల్లాలో పనిచేయుటకు నేషనల్ యూ త్ వాలంటీర్లుగా నియమించుటకు అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థుల నుం డి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నె హ్రూ యువక కేంద్రం కో-ఆర్డినేటర్ మనోరంజన్ ప్రకటనలో తెలిపారు.