కరీంనగర్

ఇంకెన్నాళ్లు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 15: కొత్త రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్‌ఎస్ అప్పుడు, ఇప్పుడు అంటూ నామినేటెడ్ పదవులపై ఊరిస్తూనే వస్తోంది. మూడేళ్లుగా పదవుల ఎంపికలో ఆలస్యం జరుగుతుండటంతో ఆ పదవులపై కనే్నసిన ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంటోంది. ప్రస్తుతం అటు పార్టీ పదవులు, ఇటు కొత్త జిల్లాల కమిటీలను నియమించాల్సి ఉంది. అయితే, ఇటీవలే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన అధిష్టానం జిల్లా స్థాయి పదవులపై దృష్టి సారించడం లేదు. జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలకు చైర్మన్లను నియమించగా, ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సముచిత స్థానం దక్కింది. పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈద శంకర్‌రెడ్డిని ఐడిసి చైర్మన్‌గా, జగిత్యాలకు చెందిన బి.ఎస్.రాములును బిసి కమీషన్ చైర్మన్‌గా, కరీంనగర్‌కు చెందిన అక్బర్ హుస్సేన్‌ను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన లోక బాపురెడ్డిని మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా నియమించింది. అంతకుముందే జిల్లాకు చెందిన ఘంటా చక్రపాణికి టిఎస్‌పిఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర స్థాయి పదవుల్లో జిల్లాకు సముచిత స్థానం లభించగా, జిల్లా స్థాయి పదవుల ఎంపికలో తాత్సారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో పలు మార్కెట్ యార్డులకు కమిటీలు వేయగా, మరికొన్నింటికి కమిటీలను వేయాల్సి ఉంది. అలాగే ఆలయ కమిటీలను వేయాల్సి ఉండగా, ఇటీవలే ధర్మపురి ఆలయ కమిటిని నియమించింది. ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్‌గా ధర్మపురికి చెందిన డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డిని నియమించింది. వేములవాడ, కొండగట్టు ఆలయ కమిటీలతోపాటు మరికొన్ని మార్కెట్ యార్డు కమిటీలు ఖాళీగా ఉన్నాయి.
మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగి కూడా దాదాపు ఆరు మాసాలు గడస్తున్నప్పటికీ కొత్త జిల్లాల్లో కమిటీలను వేయలేదు. కొత్త జిల్లాల కమిటీలతోపాటు ఖాళీగా ఉన్న పార్టీ నామినేటెడ్ పదవులు భర్తీ కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి ఇదిగో..అదిగో అంటూ అధిష్టానం ఊరిస్తూనే వస్తోంది.
పార్టీ వార్షికోత్సవానికి ముందే ప్రకటిస్తామని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. వరంగల్‌లో జరిగిన వార్షికోత్సవ సభలో పదవులను భర్తీ చేస్తామని పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయినా, నేటివరకు పదవుల ఊసే లేకుండా పోయింది. బిజెపి, టిడిపిలు కొత్త జిల్లాల కమిటీలను వేసుకోగా, టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. మొత్తానికి పార్టీ, నామినెటేడ్ పదవుల భర్తీలో తాత్సారం జరుగుతున్న కొద్దీ గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంటోంది. ముఖ్యంగా ఆయా పదవులపై కనే్నసిన ఆశావహుల ఆశలు ఆవిరవుతున్నాయి.
త్వరగా పార్టీ, నామినెటేడ్ పదవులను భర్తీ చేయాలని పలువురు నాయకులు కోరుతున్నారు.
ఫైనాన్సర్లను ఆశ్రయించవద్దు
* మానకొండూర్‌లో పోలీసుల కార్డెన్‌సెర్చ్
* 13 ఆటోలు, 24 బైకులు సీజ్
* సిపి కమలాసన్ రెడ్డి
మానకొండూర్, మే 15: గ్రామస్థులు ఫైనాన్స్‌లను ఆశ్రయించి మోస పోవద్దు అని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. సోమవారం తెల్లవారు జామున కరీంనగర్ రూరల్ ఎసీపి తిరుపతి అద్వర్యంలో మానకొండూర్ గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. 250 పోలీసులతో తెల్లవారు జామునే రాజీవ్‌నగర్ కాలనీ చుట్టుముట్టి ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించారు. వాహనాలకు సంబందించిన పత్రలు లేని 13 ఆటోలు, 24 ద్విచక్రవహనాలు సీజ్ చేసిన్నారు. అలాగే 8 వేల విలువ గల గుట్కాప్యాకేట్లు, క్వింటాళ్లు 25 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ కరుణాకర్‌రావు, చొప్పదండి సిఐ రమేష్, మానకొండూర్, గనే్నరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామాడి ఎస్‌ఐలు ఇంద్రసేనా రెడ్డి, కోటేశ్వర్, చంద్రశేఖర్, నరేష్, స్వరూప్‌తోపాటు 250 మంది డిస్ట్రీక్‌గార్డ్స్ పాల్గొన్నారు.