కరీంనగర్

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూన్ 5: ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జాప్యం చేయక సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సొమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి (66) వినతులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులను ఆయా సంబందిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, ప్రజల ఆవసరాలను గుర్తించి సేవలందించాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ పలాలు అందెలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మాదిగ మహా సమ్మేళనం సభను జయప్రదం చేయాలి
* జేఏసి జిల్లా అధ్యక్షుడు దుబ్బయ్య
ధర్మపురి, జూన్ 5: ఈనెల 8న రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే ‘‘మాదిగల మహా సమ్మేళనం’’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ మాదిగ జేఏసి జగిత్యాల జిల్లా అధ్య6లు మెడపట్ల దుబ్బయ్య కోరారు. సోమవారం ధర్మపురి క్షేత్రంలో అంబేడ్కర్ విగహ్ర కూడలి వద్ద మాదిగల సమ్మేళనం గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుబ్బయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ముఖ్య అతిథిగా, ఉత్తర తెలంగాణను కలుపుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమ్మేళనం నిర్వహ్తిన్నందున అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. రిజర్షేన్ల పెంచుకుని సమానంగా పంచుకోవాలని, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలన్నదే తమ డిమాండ్లన్నారు. టిఎంవి జేఏసి జిల్లా అధ్యక్షులు దాసరి పురుశోత్తం, రామయ్యపల్లె సర్పంచ్ కలమడుగు శంకరమ్మ, ఎ.మా.ఐకాస కార్యవర్గ సభ్యులు బడుగు శేఖర్, కలమడుగు హరిప్రసాద్, ఆవునూరి శ్రీకాంత్, సిరిసిల్ల లక్ష్మణ్, మెడపట్ల అనిల్, విజేందర్, గణేశ్, మహేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.