కరీంనగర్

సంస్కృతి,సంప్రదాయాలు మరవొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 6: ఎంత ఎత్తుకెదిగినా, ఎంతటి గొప్పవారిమైనా మన సంస్కృతి, సంప్రదాయాలను మరవద్దని రెవెన్యూ డివిజనల్ అధికారి బి.రాజాగౌడ్ అన్నారు. శుభప్రదం కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివేకానంద విద్యానికేతన్‌లో 4వరోజు విద్యార్థులకు నిర్వహించిన ఉద్ఘాటన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏదేశ ప్రజలకైనా ఆదేశ ఆచారాలు గొప్పవని, ప్రపంచానికే గర్వకారణమైన మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నా రు. మనిషి జ్ఞానంతో ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నప్పటికీ మూలాలు మరిస్తే, నైతిక విలువలు పతనమవుతాయన్నారు. శిబిరాధికారి సౌగాని కొం రయ్య మాట్లాడుతూ, తితిదే చేస్తున్న ధర్మ ప్రచారం చాలా గొప్పదని, దీనిలో భాగస్వా మ్యం కావటం ఆనందదాయకంగా ఉందన్నారు. నిర్వాహకులు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్ మాట్లాడుతూ నైతిక విలువల పెంపుదల, మానవీయ కోణం, దేశభక్తి నిర్మాణం దిశగా ఈశిబిరం సాగుతుందన్నారు. కార్యక్రమంలో టిటిడి పరిశీలకులు వి.జనార్దన్ శర్మ, పాఠశాల డైరెక్టర్ అనుదీప్, ఏవో తుంగాని సంపత్, బోధకులు మర్రిపెల్లి శ్రీనివాస్, కె.మహేశ్వర్, శంకర్, శ్రీనివాస్‌చారి, శశికళ, సుజాత, ప్రభావతి, సువర్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.
రైస్‌మిల్లులో ప్రమాదం
* మహిళా కూలీకి తీవ్రగాయాలు
* పరిస్థితి విషమం.. వరంగల్‌కు తరలింపు
మానకొండూర్, జూన్ 6: మానకొండూర్ కేంద్రంలోని చెరువుకట్ట సమిపంలో ఉన్న హనుమాన్ రైస్‌మిల్‌లోజరిగిన ప్రమాదంలో మహిళ కూలీకి తీవ్రగాయాలు అయినట్లు మంగళవారం గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు తెలిపిన వివారాల ప్రకారం.. మానకొండూర్ గ్రామంలోని చెరువుకట్ట సమిపంలో ఉన్న హన్‌మాన్ రైస్‌మిల్‌లో మంగళవారం ఉదయం మీన సహేజరామ(30) అనే మహిళతోపాటు మరో కూలీ రైస్‌మిల్‌లో యంత్రల ద్వార బియ్యం పడుతుండగా మీన సహేజరామ అనే కూలీ మహిళ చీర విద్యుత్ మోటారులో చిక్కుకొవడంతో అమె విద్యుత్ మోటారులో చిక్కుకొని ఎడమకాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయి యంత్రంలో చిక్కుక్కపోయి కట్‌అయిపోయింది. తోటి కూలీ కేకలు వేయడంతో యంత్రలను నిలిపివేసి యంత్రంలో చిక్కిన మీన సహేజరామను వెంటనే 108 వాహనంలో చికత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతోకరీంనగర్ నుండి వరంగల్ ఎంజీఎం హసుప్రతికి తరలించినట్లు తెలిపారు. హన్‌మాన్‌రైస్ మిల్‌లో విద్యుత్ మోటారు యంత్రాలకు చుట్టుప్రక్కల జాలిని రైస్‌మిల్ యాజమన్యం బిగించలేక పోవడంతోనే రైస్‌మిల్‌లోపని చేస్తున్న మహిళ కూలీ యంత్రంలో చిక్కుకొని ప్రమాదం జరిగిందని తోటి కూలీలు అవేదన వ్యక్తం చేశారు. మహరాష్టల్రోని దిడ్‌జిల్లా పర్ణి తాలుక వీట గ్రామానికి చెందిన మీన సహేజరామ, తన భర్త ముంజ ఇద్దరి పిల్లలతో కలిసి హనుమాన్ రైస్‌మిల్‌లో కూలీ పని కోసం నేల రోజుల క్రితమే వచ్చినట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు తీవ్రగాయాలై రక్తస్రవం ఎక్కవగా కావడంతో పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపినట్లు గ్రామస్థులు తెలిపారు.
హత్య కేసులో
ముగ్గురు నిందితుల అరెస్ట్
కోరుట్ల, జూన్ 6: కోరుట్ల మండలంలోని యూసుఫ్‌నగర్‌లో గత నెల 24న దొంతు మహేష్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అనంతశర్మ నిందితుల వివరాలను వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు..కోరుట్ల మండలంలోని యూసుఫ్‌నగర్‌కు చెందిన మహేష్‌పై పాత కక్షలతో అదే గ్రామానికి చెందిన కోటగిరి అంజయ్య (32), బర్ల విజయ్ (30), సుధీర్ (28) అనే ముగ్గురు కలిసి గత నెల 24న దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి నిందితుడు అంజయ్య, విజయ్, సుదీర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. సిఐ రాజశేఖర్ రాజు, ఎస్‌ఐ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధర్నా చౌక్ తరలింపుపై ..
జంతర్ మంతర్ ఎదుట ధర్నా చేస్తాం
* ఎన్నికల హామీలు విస్మరించిన సిఎం కెసిఆర్
* అవినీతికంపులో రాష్ట్ర పాలన
* పెద్దనోట్ల రద్దుపై వివరణ ఏది?
* పాలకపార్టీల అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి
కరీంనగర్ టౌన్, జూన్ 6: ఇందిరాపార్కు ఎదుట గల ధర్నా చౌక్ తరలింపుపై వచ్చే నెల మొదటి వారంలోదేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబోతున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్టక్రార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోప్రతిపక్షాలను తొక్కిపెట్టి, ఏకఛత్రాధిపత్య పాలన కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ యత్నిస్తున్నారని, దీనిని అడ్డుకుని ఆయన అరాచకాలను బహిర్గతం చేసేందుకు సిపిఐ వామపక్ష పార్టీలతో పాటు, కలిసివచ్చే పార్టీలను ఏకం చేస్తుందన్నారు. ఎన్నికల హామీ లు విస్మరించి, ఇష్టారాజ్యంగా పాలన కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అవినీతి కంపులోకి నెడుతున్నాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అటకెక్కించి, నియంత పాలనకు తెరతీసాడని, నాటి నైజాం పాలన గుర్తుకువస్తుండగా, రజాకార్లమాదిరిగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు తయారయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఎగరేసుకుపోతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు తమ పార్టీ కార్యకర్తలకు, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే చెందుతున్నాయని దుమ్మత్తి పోశారు. సబ్సిడీ ట్రా క్టర్ల పంపిణీలో జరుగుతున్న కుంభకోణం అంతా ఇంతా కాదని అన్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులే ఎస్సీ, ఎస్టీల పేర సబ్సీడీ ట్రాక్టర్లు పొందుతున్నారని దుమ్మెత్తారు. అర్హులకందాల్సిన ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా దక్కకుండా పోతున్నాయని, అప్పుల బాధలతోరోజుకోచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస పట్టింపుకూడా లేదని, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఇప్పటివరకు ఆదుకోలేదని దుయ్యబట్టారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించటంలోరాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కొనుగోళ్ళలో కూడా నిబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వహించటం సిగ్గుచేటని విమర్శించారు. భూనిర్వాసితుల చట్టం 2017ని కొత్తగా తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల శవాలపై పేలాలు ఏరుకునేందుకు సిద్దమవుతోందని ఆక్రోశం వెల్లగక్కారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదని, రాష్టప్రతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం లో కొనసాగుతున్న అవినీతి పాలనపై స్పందించటం లేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై క్షేత్రస్థాయిలోప్రజలను చైతన్యపర్చి, రాబోయే ఎన్నికల్లో తగినబుద్ది చెప్పేందుకు ఇప్పటినుంచే కార్యచరణ రూపొందించినట్లు స్పష్టం చేశారు. సమావేశంలోసిపిఐ నాయకులు పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కె.బుచ్చన్న, వెంకట్రాజం, సిహెచ్.రాజేశం, న్యాలపట్ల రాజు, కూన శోభతో పాటు పలువురు పాల్గొన్నారు.
పనులు అడ్డుకుంటే చర్యలు
* పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
* గోలివాడ పంప్ హౌస్ పనుల పరిశీలన
* సుప్రీం తీర్పుతో
తొలగిన అడ్డంకులు
గోదావరిఖని, జూన్ 6: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు చెందిన గోలివాడ పంప్‌హౌస్ నిర్మాణపనులను హద్దు లు దాటి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎంతటి వారిపైనైనా కేసులు తప్పవని పెద్దపల్లి ఇన్‌ఛార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయం త్రం అంతర్గాం మండలం గోలివాడ శివారులో వందల కోట్ల రూపాయల తో నిర్మిస్తున్న పంప్‌హౌస్ నిర్మాణ పనులను ఇన్‌చార్జి కలెక్టర్ పరిశీలించారు. పంప్‌హౌస్ నిర్మాణం చేపడుతున్న ప్రదేశాల వివరాలను, భూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పం ప్‌హౌస్ భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోయాయి. అయితే పనులను మరింత వేగవంతం చేసేందుకు ఇన్‌చార్జి కలెక్టర్ ఇక్కడ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పంప్ హౌస్ పనులకు సంబంధించి ఒప్పందం మేరకు పనులను శరవేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించిన మట్టిని శివారు ప్రాంతాల్లో వేస్తుండగా కొందరు గ్రామస్థులు అడ్డుకున్న విషయాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. అనవసరంగా పనులకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారిపైనైనా కేసులు నమోదు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం మంచి సంకల్పంతో చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, ఎవరో... వారి లబ్ధి కోసం చెబుతున్న మాటలు నమ్మి నిర్వాసితులు మోస పోవద్దని... నిర్వాసితులందరికి ప్రభుత్వం అనుకున్న మేరకు న్యాయం చేస్తుందని తెలిపారు. గోలివాడ పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించి సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు దాదాపుగా పరిహారం చెల్లింపులు జరిగాయని, ఇంకా పరిహారం పొందని నిర్వాసితులు వారం రోజుల్లో వారి వారి పరిహారాన్ని పొందాలని, లేని ప క్షంలో సంబంధిత పరిహారం డిపాజి ట్ చేయడం జరుగుతుందని ఇన్‌ఛార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వివరించారు.
కెసిఆర్ వెంటే మహిళలు
* ఎమ్మెల్యే రసమయి
తిమ్మాపూర్, జూన్ 6: ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల పిం ఛన్ అందజేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెంట అందరు మహిళలు ఉన్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నా రు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మంగళవా రం అల్గునూరులో గల ఓ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానకొండూర్ నియోజకవర్గంలో మొత్తం 1031 మంది ఒంటరి మహిళలకు పిం ఛన్లు అందజేస్తున్నామన్నారు. మానకొండూర్ మండలంలో 254, ఇల్లంతకుంట మండలంలో 200, తిమ్మాపూర్ మండలంలో 156, బెజ్జంకి మండలం లో 258, శంకరపట్నం మండలంలో 163 మంది ఒంటరి మహిళలకు పిం ఛన్లు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జడ్పీటిసిలు, ఎంపిపిలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనోభావాలు కాపాడటంలో విఫలం
* బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంజయ్
గంగాధర, జూన్ 6: రాష్ట్రంలో ఉన్న మెజారిటీ హిందూ ప్రజల మనోభావాలను కాపాడడంలో కాంగ్రెస్, టిఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ విమర్శించారు. ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని కురిక్యాల తదితర గ్రామాల్లో పాల్గొన్న అనంతరం గంగాధరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇస్లామిక్ సెంటర్‌కు 40 కోట్లు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ ధార్మిక పరిషత్‌కు కేవలం 10 కోట్లు కేటాయించి హిందువులపై ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడని ఆయన ఆరోపించారు. జాతీయ గీతాన్ని పాడాలని కానీ, వందేమాతరం పాడాలని కానీ ఏనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని, ఎంఐఎం ముస్లీంల మెప్పుకోసమే 12 శాతం రిజర్వేషన్లు, మైనారిటీలకు వివిధ పథకాలు ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర,జిల్లా నాయకులు పెర్క మల్లారెడ్డి, తూం నారాయణ, చెన్నోజుల మునీందర్, మండల పార్టీ అధ్యక్షుడు కోల అశోక్, సీనియర్ నాయకులు పానగంటి లక్ష్మినారాయణ, ముత్యాల హన్మంతు, ఇనుకొండ నర్సింహారెడ్డి, జారతి శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.
నీతి నిజాయితీ పార్టీ అవసరం
సిరిసిల్ల, జూన్ 6: రానున్న ఎన్నికల్లో బిజెపిదే అధికారమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం ‘పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కార్య విస్తార్ యోజన’లో భాగంగా ‘శక్తి కేంద్రాల కన్వీనర్ల సమావేశం’ జరిగింది. స్థానిక శివనగర్‌లోని అంకారపు నర్సయ్య ఫంక్షన్ హాలులో జరిగిన దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బిజెపిలో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ నీతి నిజాయితీ గల పార్టీ తెలంగాణలో అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంజన్ లేని బండి అని, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు విడిచిపోతుంటే దివాళా తీసిన సంస్థలా మారిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఆది శ్రీనివాస్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, దళితమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, జిల్లా ఇంచార్జి రాగుల రామనాథ్, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడెపు రవీందర్, జిల్లా కార్యదర్శి మల్లిఖార్జున్, పట్టణ బిజెపి అధ్యక్షులు గౌడ వాసు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గడ్డం లత పాల్గొన్నారు.
ఘనంగా
మాజీ విప్ మోహన్ జన్మదిన వేడుకలు
మానకొండూర్, జూన్ 6: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విఫ్ అరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ, దళిత యువజన సంఘం అద్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానకొండూర్ కేంద్రంలోని పల్లేమీద బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల సమావేశానికి అరెపల్లి మోహన్ పాల్గొని కేక్‌కట్ చేసి వేడుకలను ఘనంగా చెపట్టారు. అనంతరం స్వీట్ పంపిణి చేసి, వృద్దులకు పండ్లు పంపిణి చేపట్టారు. ముందుగా అరెపల్లి మోహన్‌కు పార్టీ నాయకులు స్వాగతం చెప్పుతు టపాకాయలు పేల్చిన్నారు. అలాగే మండల పరిధిలోని లలితాపూర్ గ్రామంలో అరెపల్లి మోహన్ జన్మదిన వేడుకలు సర్పంచ్ మర్రి-కవిత ఓదెలు అద్వర్యంలో కేక్‌కట్ చేసి వేడుకలను నిర్వహించారు. మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ కొండ్ర శంకర్, జిల్లా నాయకులు పాడల శంకరయ్య, పెండ్యాల రాంరెడ్డి, ఎంపిటిసిలు సత్యం, శంకర్, మాజీసర్పంచ్‌లు గడమల్ల వెంకటయ్య, మాచర్ల తిరుపతి, యువజన నాయకులు గసికంటి సంపత్, రవీందర్ చారి, బోట్ల కిషన్, మర్రి ఒదెలు, పిట్టల మధు, తాళ్లపల్లి సంపత్, అసంపల్లి వెంకటేష్, గుడాల మహెందర్, ఎండి తాజ్, అనీల్, తదితరులు పాల్గొన్నారు.
ఐసిడిఎస్ ఆర్గనైజర్‌కు అభినందనలు
కరీంనగర్ టౌన్, జూన్ 6: మహిళా శిశు సంక్షేమ శాఖ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఆర్గనైజర్‌గా నియమితులైన జి.రేణను జిల్లాకు చెందిన పలువురు అంగన్‌వాడీ సంఘాల నాయకురాళ్ళు మంగళవారం కలిశారు. సంఘం అధ్యక్షురాలు ఏరువ లలితారెడ్డితో కలిసి సిరిసిల్లలోని ఆమె స్వగృహంలో కలిసి, పుష్పగుచ్ఛం అందించి, అభినందనలు తెలిపారు. అంగన్‌వాడీలను బలోపేతం చేయటంపై పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇతోధికంగా సేవలందిస్తున్న అంగన్‌వాడీల అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి సారించాలని, ప్రభుత్వాశయాన్ని నెరవేర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఆర్గనైజర్ రేణకు హామీ ఇచ్చినట్లు సంఘం నాయకురాలు లలితారెడ్డి తెలిపారు. ఆమెను కలిసిన వారిలో అంగన్‌వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రతినిధులు చందన, మమత, కె.పద్మ, శంకుతల, శ్రీవాణి, వాణి, విజయ, సుధ, జయశ్రీ, లక్ష్మితో పాటు పలువురు ఉన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఐఎంఏ ధర్నా
* వైద్యులకు ఏకీకృత సేవల నిబంధనలు వర్తింపజేయాలని డిమాండ్
కరీంనగర్ టౌన్, జూన్ 6: దేశవ్యాప్తంగా వైద్యులకు ఏకీకృత సేవా నిబంధనలు వర్తింపజేయాలని, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవా రం కలెక్టరేట్ ఎదుట పలువురు వైద్యులు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ వైద్యులు డా.్భంరెడ్డి, ఎడవెల్లి విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ ఒకే మందు, ఒకే ధర, ఒకే కంపనీ ఉండేలా చట్టం తేవాలని, చికిత్స సమయాల్లో రోగుల బంధువు లు ఆస్పత్రులు, వైద్యులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఎంబిబి ఎస్ ఫైనల్ ఇయర్ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే విధానంలో ఉండాలని, ప్రాక్టీస్‌కు ముందు ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టడాన్ని తొలగించాలని కోరారు. నీట్ విధానాన్ని తొలగించి, రాష్ట్రాల వారీగా ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్ష విధానం కొనసాగించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా వెనుకంజ వేయబోమని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వందమంది వైద్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డా. అలీం, కార్యదర్శి డా.జి.రవీందర్, వైద్యురాలు ఎడవెల్లి శైలజ, డా. ఆకుల శైలజ, డా. సుహాసిని, పలువురు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు.
డిఎంహెచ్‌వో
ప్రైవేటు ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల, జూన్ 6: ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా ఆరోగ్య వైధ్యాధికారి డా.ఆర్.రమేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మంగళవారం స్థానిక పాత బస్టాండ్‌లోని లాస్య రోగ పరీక్ష నిర్ధారణ కేంద్రం, రక్ష ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండింటిలో చెక్‌లిస్ట్ ప్రకారం సలహా కేంద్రం లేదని, ఆసుపత్రిలో ధరల పట్టిక లేదని, ఫ్లోర్ ప్లానింగ్ లేదని, రిజిష్ట్రేషన్ నంబర్ లేదని పేర్కొన్నారు. ఇతర అంశాలయిన టాయిలెట్టు క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్, ఆల్టర్‌నేట్ కరెంట్, హైజనిక్ కండిషన్, ఫైర్ ఎక్ట్సింగ్యుసర్, ల్యాబ్ డిటేల్స్ బిల్డింగ్ టాక్స్ పేమెంట్, లీజ్ డీడ్ డాక్యుమెంట్‌పై చెక్‌లిస్ట్ ప్రకారం అందుబాటులో ఉంచకపోతే ఆసుపత్రి డయాగ్నస్టిక్ సెంటర్ పూర్తిగా మూసివేయబడుతుందని డిఎం అండ్ హెచ్‌వో హెచ్చరిస్తూ ఆంక్షలు విధించారు.