కరీంనగర్

అటకెక్కిన రైతుల రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, జూన్ 27: ఎన్నికల సమయంలో వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని అటకెక్కించిందని, మరో పక్క రైతులు పంటలు పండించి ధాన్యాన్ని అమ్ముకుంటే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వం 24 రోజులైనా డబ్బులు ఇవ్వటం లేదని, పైగా ఆన్‌లైన్ ద్వారా రైతులకు డబ్బులు రావటం లేదని, బ్యాంక్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పడిగాపులు కాస్తున్నారని, ఇదేనా రైతులకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసే న్యాయం అంటూ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం మాట్లాడుతూ కుటుంబ రాజకీయాల కోసం తెలంగాణ తెచ్చుకున్నట్లుందని, కేవలం కుటుంబ రాజకీయాల స్వలాభం కోసం పలు పథకాలను లోపభూయిష్టంగా ప్రవేశపెడుతూ కోట్లాది రూపాయలను దండుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ రుణ మాఫీని పలు దఫాలుగా అమలు చేస్తామని ఇంతవరకు అమలు చేయకపోవడం విడ్డూరమన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ ఇందిరమ్మ ఇండ్లను పశువుల పాకలుగా పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమని, తాము 2019లో అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లకు అదనపు గదులను నిర్మిస్తామన్నారు. బీడీ కార్మికులకు పిఎఫ్ ఉన్న వారికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. మద్యపాన నిషేదంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల సమ్మతితో నిషేధిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులతో కెసిఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్‌లు వేయకపోవడం, వేసిన వాటిపై కోర్టులకెక్కడం వారికే చెల్లుతుందన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంవి సంక్షేమ పథకాలు కావని, సంక్షోభ పథకాలని అన్నారు. తమ కాలంలో మంజూరైన వాటిని నేడు శిలాఫలకాలు వేస్తూ వారి చేసినవని చెప్పుకుంటున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన సైనికుల్లా పని చేయాలని పొన్నం కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దిండిగాల మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరెల్లి చంద్రశేఖర్, యువత పార్లమెంటు కన్వీనర్ నాగి శేఖర్, పొన్నం సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆంజనేయులు, ఎంపిటిసి ముద్దసాని రంగన్న, జిల్లా గౌడ సంఘం అద్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిపి ఒల్లాల కృష్ణహరి, మాజీ మార్కెట్ చైర్మన్ పురం రాజేశం, మాజీ సర్పంచ్ మల్లయ్య, తిరుపతి, కుమార స్వామి, సుధాకర్, రమేష్, నిజానపురం చందు, శంకర్, కట్టెకోల లక్ష్మణ్‌తోపాటు పెద్దమొత్తంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

పట్టణ సమగ్రాభివృద్ధికి చర్యలు
* ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి రూరల్, జూన్ 27: నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణ సమగ్రాభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. నగర పంచాయితీ పరిధిలోని నాల్గవ వార్డులో మంగళవారం నిర్వహించిన వార్డు సందర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డు పరిధిలో నిలిచి ఉన్న నీటి గుంతలు, అస్తవ్యవస్తంగా ఉన్న మురికి కాల్వలు, రోడ్లను ఆయన పరిశీలించారు. అలాగే వార్డు ప్రజలను సమస్యలు అడిగి తెలుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశల వారిగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. మిషన్ భగీరథ ద్వారాలోనే అన్ని వీధులకు మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. వౌళిక వసతుల కల్పన కోసం తగిన నిధులు కెటాయిస్తామన్నారు. పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రకటించిన 50 కోట్ల నిధులు తీసుకు వచ్చి అన్ని రంగాల అబివృద్ధి కోసం వెచ్చించనున్నట్టు ఆయన వివరించారు. ఎమ్మెల్యే వెంట నగర పంచాయితీ చైర్మన్ ఎలవాక రాజయ్య, వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు వేముల రామ్మూర్తి, ఉప్పు రాజ్‌కుమార్, కొంతం మల్లేశ్వరి-శ్రీనివాసరెడ్డి, నగర పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.