కరీంనగర్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 27: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషిచేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘటన కార్యదర్శి సకినాల హర్షవర్ధన్ కోరారు. మంగళవారం నగరంలోని ఆసంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు అందజేయాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ విద్య పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని సత్వరమే అమలు చేస్తూ ఫీజుల నియంత్రణ తీసుకురావాలని, విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల నిర్వహణను అడ్డుకోవాలంటూ ఈనెల 28న, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఈనెల 29న క్షేత్రస్థాయి సందర్శనలు చేపట్టినట్లు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ, జూలై 5న ఛలోడిఈవో కార్యాలయం పేర భారీ నిరసన ప్రదర్శన తలపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్టక్రార్యవర్గ సభ్యుడు మేరుగు రాము, విద్యార్థి నాయకులు బొంగోని ప్రశాంత్, కిరణ్,శివరామకృష్ణ, నక్క అరున్,రాపర్తి శ్రీనివాస్, మైతం మహేశ్, ప్రశాంత్,అభినవ్, బాలాజిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
అటవీ భూముల అప్పగింత
ధర్మపురి, జూన్ 27: కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, ధర్మపురి మండలంలోని దొనూరు గ్రామ సంబంధిత అటవీ భూమిని గొర్రెల మేతకై కెటాయించి, వారికి అప్పగించారు. గ్రామ సర్పంచ్ కొండపెల్లి సువర్ణ ప్రకాశ్‌రావు, ఎంపిటిసి చిరుత సత్తమ్మ మల్లేశం, గొర్రెల పెంపకం దారుల సంక్షేమ సంఘం నాయకులు సంగ నర్సింహులు, అటవీ బీట్ అధికారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసిఆర్‌కు, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌కు లబ్దిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.