కరీంనగర్

ఊపందుకున్న ఖరీఫ్ సాగు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, జూన్ 27: ఖరీప్ సీజన్ ప్రారంభంలోనే ఆశించిన మేర వర్షపాతం నమోదు కావడంతో సాగు పనులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. జగిత్యాల ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న, పసుపు, వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఇటీవల కురిషిన వర్షాలకు దుక్కులు దున్ని ఎరువులు వేసుకున్న రైతులు దుక్కుల్లో విత్తనాలు విత్తేందుకు తేమ పూర్తి స్ధాయిలో ఉండడంతో వారం రోజులుగా గ్రామాల్లో సాగు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఎద్దుల నాగలి ద్వారానే పసుపుసాగు చేపడితే ఆశించిన పంట దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం ఉన్నప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితుల్లో పెట్టుబడి అధికం అయినప్పటికీ యంత్రాల వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. గ్రామాల్లో ఎద్దుల నాగళ్ల పోషణ కరువవడంతో ట్రాక్టర్ సహాయంతో బోజలను తయారు చేసి పసుపును విత్తేందుకు రైతులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం చెదురు ముదురు వర్షాలు ఆశించిన స్ధాయిలో కురువడంతో బావుల్లో నీటి మట్టం పెరుగడంతో సన్న వరి రకాల సాగును ఎంచుకుని వరి నార్లు పోసేందుకు సిద్దమయ్యారు. అలాగే దొడ్డు రకాల సాగును జులై మాసం వరకు సాగు చేపట్టవచ్చని వ్యవసాయ, శాస్తవ్రేత్తలు సూచించడంతో ఎరువులు వేసి నారు మడులను తయారు చేసే పనుల్లో రైతులున్నారు. అయితే ప్రారంభంలోనే కురిషిన వర్షాలకు గ్రామాల్లో కొంతమంది రైతులు మొక్కజొన్న, పత్తి పంటల సాగు చేపట్టారు. తేమ ఉండడానికి తోడు కురుస్తున్న వర్షాలకు విత్తనాలు పూర్తి స్ధాయిలో నాటుకోవడంతో రైతులు ఆనందోత్సవంలో ఉన్నారు.