కరీంనగర్

జాతీయ భావం ఉప్పొంగిన వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: భారత స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగగా, జాతీయ భావం ఉప్పొంగింది. చిన్నారుల నుంచి పెద్దొళ్ల వరకు జాతీయ జెండాలను చేతబూని ఆ భారత మాతను స్మరించారు. ఉమ్మడి జిల్లా అంతటా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిల్లాలో ప్రభుత్వ చీప్ విఫ్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా శివారులోని కల్వల క్యాంప్ మైదానంలో మండలి చీప్ విఫ్ పాతూరి సుధాకర్‌రెడ్డిలు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయా జిల్లాల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు, వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరైన యూనిట్లను మంత్రులు, చీప్ విఫ్‌లు లబ్దిదారులకు అందజేసారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన, పలు పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర వేడుకల్లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. అటు ప్రైవేట్ విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద స్థంస్థల కార్యాలయాల్లో సైతం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా విద్యా సంస్థల చైర్మన్లు, పార్టీల అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఆయా జిల్లాల ఎంపిలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగగా, త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.